S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/22/2016 - 14:15

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా నుంచి నిర్మల్‌ను విడదీయవద్దని జిల్లా సంరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం కొనసాగుతున్న బంద్‌లో భాగంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నాయి. బంద్‌కు కాంగ్రెస్‌, భాజపా, తెదేపా పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు.

09/22/2016 - 14:08

ఐరాస : పాకిస్థాన్‌ ఓ ఉగ్రవాద దేశమని, యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్‌ తీరుపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐరాస జనరల్‌ అసెంబ్లీలో పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన అనంతరం భారత్‌ తన వాదనలను దీటుగా వినిపించింది.

09/22/2016 - 14:03

దిల్లీ: ఆప్‌ ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతిని దిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రి ఆవరణలో భద్రతా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో పాటు వారిపై దాడికి దిగినందుకు ఆయనపై కేసు నమోదైంది. ఈ నెల 6వ తేదీన ఎయిమ్స్‌ ప్రాంగణంలోని వస్తువులను సోమనాథ్‌, ఆయన కార్యకర్తలు ధ్వంసం చేయడంతో పాటు వారిపై దాడికి దిగారు.

09/22/2016 - 14:00

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో గురువారం మధ్యాహ్నం నుంచి అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షం కురుస్తోంది. గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలకు అనుగుణంగానే భారీ వర్షం నగరాన్ని వణికిస్తోంది.

09/22/2016 - 12:35

గుంటూరు : బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల-రెడ్డిగూడెం మధ్యం రైల్వే ట్రాక్ భారీ వర్షానికి కొట్టుకుపోయింది. రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో రైల్వే ట్రాక్ మీద వరద నీరు చేరుకుంది. దీంతో గురువారం పలు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. హైదరాబాద్ వెళ్లే అజంతా ఎక్స్‌ప్రెస్‌ను నడికుడు మీదుగా నడుపుతున్నారు. గుంటూరు మీదుగా నడవాల్సిన రైళ్లను దారి మళ్లించారు.

09/22/2016 - 12:31

విశాఖ : కుండపోత వర్షాలతో జిల్లాలోని పలు జలాశయాలకు గురువారం భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. అధిక వర్షపాతం నమోదు కావడంతో వరద నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైవాడ రిజర్వాయర్‌ గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 113.5 మీటర్లకు చేరింది. అధికారులు రెండు గేట్లు ఎత్తి వెయ్యి క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు.

09/22/2016 - 12:27

ముంబయి: ముంబయి నగరం గురువారం నీట మునిగే ప్రమాదం ఏర్పడింది. తెల్లవారుజామునే నగరం అంతా భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల మోకాలి లోతు నిలిచాయి. భారీ వర్షం కారణంగా కార్యాలయాలకు వెళ్లేవారు నానా తంటాలు పడ్డారు. రాగల 48 గంటల్లో ముంబయి సహా తీర ప్రాంతమంతా వర్షాలు కురుస్తాయి. కొంకన్, మరాట్‌వాడ, సెంట్రల్ మహారాష్ట్ర, విదర్భా ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

09/22/2016 - 12:10

రాయ్‌పూర్‌: ఆరోగ్యం విషమించడంతో పసికందు ప్రాణాలు కోల్పోయిన ఘటన కోల్‌కతా నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో గురువారం చోటుచేసుకుంది. కోల్‌కతాకి చెందిన దంపతులు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని వైద్యం కోసం బెంగళూరు తీసుకెళ్లాల్సి ఉంది. విమానం బయలుదేరిన కొద్ది సేపటికే పసికందు ఆరోగ్యం విషమించడంతో అత్యవసరంగా రాయ్‌పూర్‌లో విమానం ల్యాండ్‌ అయింది. అప్పటికే పసికందు చనిపోయింది.

09/22/2016 - 12:05

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు గురువారం ఉదయం నుంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.86 పైసలు వద్ద కొనసాగుతోంది. 282 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 89 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. మారుతీ సుజుకీ, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, యస్‌బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

09/22/2016 - 11:54

మహబూబ్‌నగర్‌: జూరాల ప్రాజెక్టులో గురువారం ఉదయం ఇన్‌ఫ్లో-22 వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో-34 వేల క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం- 318.516 అడుగులు కాగా , ప్రస్తుత నీటిమట్టం- 318.150 అడుగులుగా ఉంది. వరద ఉధృతితో నారాయణపూర్‌ ప్రాజెక్టు 4 గేట్లు 2 మీ. మేర అధికారులు ఎత్తివేశారు.

Pages