S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 02:14

శ్రీకాకుళం(టౌన్), జూలై 4: జిల్లాలో గిరిజన ఉత్పత్తులకు మంచి గిరాకీ లభిస్తోంది. నాబార్డు ఆధ్వర్యంలో ఆర్ట్స్ సంస్థ సౌజన్యంతో మాతోట ఉత్పత్తి ద్వారా అమ్మకాలు సాగిస్తున్న ఈ ఉత్పత్తులు నాణ్యతతో పాటు బయట మార్కెట్‌లో కంటే తక్కువ ధరకు అందజేస్తున్నట్టు ఉద్యానవన శాఖ ప్రతినిధులు శంకరరావు తెలిపారు.

07/05/2016 - 02:13

శ్రీకాకుళం(టౌన్), జూలై 4: జిల్లాలో పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు నష్టం కలిగించే రీతిలో ఉన్న జీవోలను తక్షణమే రద్దుచేయాలని ఎఐటియుసి నాయకుడు చిక్కాల గోవిందరావు కోరారు. సోమవారం జిల్లా ఫిర్యాదుల విభాగంలో జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్ అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు.

07/05/2016 - 02:12

సారవకోట, జూలై 4: స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి మన్యం వీరుడుగా గుర్తింపు పొందిన ఆదర్శమూర్తి అల్లూరి సీతారామరాజు పేరుతో గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని గిరిజన జెఎసి మహిళా విభాగం అధ్యక్షురాలు బొమ్మాళి భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు.

07/05/2016 - 02:12

శ్రీకాకుళం(టౌన్), జూలై 4: రాష్ట్ర ప్రభుత్వ ధృతరాష్ట్ర పాలనను ప్రజలు ఎండగట్టేందుకు సిద్ధం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాషరావు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

07/05/2016 - 02:10

ఒంగోలు, జూలై 4: జిల్లాలోని పొగాకు బోర్డు వేలం కేంద్రాల కొనుగోళ్లలో పొగాకు వ్యాపారులు సిండికేట్ అవుతుండటంతో పొగాకు ధరలు పెరగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

07/05/2016 - 02:09

ఒంగోలు,జూలై 4:దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన మహాయోధుడు అల్లూరి సీతారామరాజు అని కలెక్టర్ సుజాతశర్మ కొనియాడారు. అల్లూరి సీతారామరాజు 120జయంతి వేడుకలు సోమవారం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్‌భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటానికి కలెక్టర్, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు.

07/05/2016 - 02:08

అద్దంకి, జూలై 4: ఆస్తి విషయంలో బావ-బావమరుదుల కుటుంబాల మధ్య జరిగిన తగాదా తీవ్రరూపం దాల్చి కత్తులు, వేటకొడవళ్లతో నరుక్కునే వరకు వచ్చింది. వివరాల ప్రకారం ధర్మవరం గ్రామానికి చెందిన దేవరాల పెద్ద రామాంజనేయులు, తాళ్ళూరి అంజయ్య కుటుంబాల మధ్య ఆస్తి విషయంలో వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో వివాదం ఘర్షణగా మారి ఇరువర్గాలకు చెందిన వారు కత్తులు, వేటకొడవళ్లతో దాడులు చేసుకున్నారు.

07/05/2016 - 02:08

ఒంగోలు అర్బన్, జూలై 4 : ఒంగోలులోని టిటిడి కల్యాణ మండపంలో ఈనెల 12, 13, 14 తేదీల్లో కంచిపీఠం స్వాములు జయేంద్ర సరస్వతి మహాస్వామి, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆగమన ఆహ్వానానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను సోమవారం మంత్రి శిద్దా రాఘవరావు తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మూడు రోజుల పాటు స్వామి వార్లు అందుబాటులో ఉండి ప్రత్యేక పూజలు చేస్తారన్నారు.

07/05/2016 - 02:07

ఒంగోలు, జూలై 4: జిల్లాలోని 13 మండలాల్లో భూగర్భజల మట్టాలు పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ సుజాతశర్మ అధికారులను ఆదేశించారు.

07/05/2016 - 02:05

నెల్లూరు కలెక్టరేట్, జూలై 4: మతోన్మాదాన్ని అంగీకరించటమే జాతీయవాదమైతే అది ఫాసిస్ట్ చర్య అవుతుందని విప్లవ రచయితల సంఘం (విరసం) నాయకులు జి కల్యాణరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని టౌన్‌హాలులో సోమవారం విరసం 46వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ పురోగతి శ్రామికుల శ్రమతోనే ఇమిడి ఉందన్న విషయాన్ని పాలకులు గుర్తెరగాలన్నారు.

Pages