S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 01:49

ఖమ్మం(క్రైం), జూలై 4: హెల్మెట్ల వాడకంపై ప్రజల్లో అవగాహన కల్గించేందుకు పోలీసులు సోమవారం వినూత్న ర్యాలీని నిర్వహించారు. సబ్‌డివిజన్ అధికారి సురేష్‌కుమార్, ట్రాఫిక్ సిఐ నరేష్‌రెడ్డి సిబ్బందితో కలసి బస్టాండ్, జడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించి హెల్మెట్లు ధరించిన ద్విచక్ర వాహనదారులకు చాక్లేట్లు, ధరించని వారికి గులాబిపూలు ఇచ్చారు.

07/05/2016 - 01:49

భద్రాచలం, జూలై 4: అక్రమార్కుల స్వార్థానికి చిక్కటి అటవీ ప్రాంతం కరిగి పోతోంది. ఇటీవలే దుమ్ముగూడెం మండలంలో కలప లారీని పట్టుకున్న అటవీశాఖాధికారులు ఇంటి దొంగల పాత్రపై విచారణ జరుపుతున్నారు. దుమ్ముగూడెం మండలం పులిగుండాల అటవీ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో 400కు పైగా టేకు చెట్లను నరికినట్లుగా గుర్తించారు.

07/05/2016 - 01:48

సత్తుపల్లి, జూలై 4 : తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలోస్క్రూటినీ ప్రోగ్రాం స్థానిక కళాభారతిలో సత్తుపల్లికి చెందిన ఓలేటి వెంకట రమణ 111 నిమిషాలలో 111 మంది హీరోలు, 111 మంది హీరోయిన్లకు సంబంధించిన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సిఈఓ డాక్టర్ బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, అరిశె అంబేద్కర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

07/05/2016 - 01:48

ఖానాపురం హవేలి, జూలై 4: స్థానిక ప్రభుత్వ బాలికల మహిళా కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు.

07/05/2016 - 01:47

జూలూరుపాడు, జూలై 4: మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పాలకమండలితో పాటు, అధికారులను ప్రజా ప్రతినిధులు నిలదీశారు.

07/05/2016 - 01:47

కారేపల్లి, జూలై 4: జ్ఞాన తెలంగాణ నిర్మాణానికే ప్రతి గడపకు పుస్తకాన్ని తీసుకెళ్ళే లక్ష్యంలో భాగంగానే పల్లెకు పుస్తకం కార్యక్రమం చేపట్టినట్లు బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరిశంకర్, వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్ అన్నారు.

07/05/2016 - 01:46

గార్ల, జూలై 4: సికింద్రాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఇంటర్‌సిటి రైలు నుంచి యువతి జారి పడి మృతి చెందిన సంఘటన గార్ల రైల్వే స్టేషన్ సమీపంలోని పాకాల ఏరు వంతెన వద్ద సోమవారం చోటు చేసుకుంది. సుమారు ఇరవై సంవత్సరాల వయస్సు లోపు కలిగి ఉన్న యువతి గోధుమ రంగు ఛాయ కలిగి శరీరంపై నీలి రంగు దుస్తులు ధరించి ఉంది.

07/05/2016 - 01:44

గుంటూరు, జూలై 4: భజరంగ్ జూట్‌మిల్లు కార్మికులు లాకౌట్‌కు వ్యతిరేకంగా కదంతొక్కారు. సోమవారం జూట్‌మిల్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెడ్పీ కార్యాలయం ఎదుట బైఠాయించి మిల్లు యాజమాన్యం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు కదిలేది లేదని భీష్మించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

07/05/2016 - 01:43

గుంటూరు, జూలై 4: రాష్టవ్య్రాప్తంగా సంక్షోభంలో కూరుకుపోయిన స్పిన్నింగ్ మిల్లుల వ్యాపారులను ఆదుకోవాలని ఎపి కాటన్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. రెండేళ్లుగా టెక్స్‌టైల్ పరిశ్రమ నష్టాల్లో కూరుకుపోయిందని, చైనా, యూరోపియన్ దేశాల్లో ఆర్థిక సంక్షోభం వల్ల ఎగుమతులు నిలిచిపోయాయని, దీంతో దేశంలో నూలు నిల్వలు పేరుకుపోయి గిట్టుబాటు ధర కూడా లభించడం లేదని సంఘ ప్రతినిధులు వివరించారు.

07/05/2016 - 01:43

మంగళగిరి, జూలై 4: పట్టణంలో విచ్చల విడిగా అనుమతి లేకుండా వెలుస్తున్న ఫ్లెక్సీలపై గత గురువారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అధికారులపై మండిపడింది.

Pages