S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/05/2016 - 01:42

వినుకొండ, జూలై 4: మండలంలోని చీగటీగలపాలెం జంక్షన్ వద్ద సోమవారం ఎదురెదురుగా వస్తున్న గూడ్సు ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో నూజండ్ల మండలంలోని చెరుకుంపాలెం గ్రామానికి చెందిన కానాల పెద్దిరెడ్డి (65) అక్కడి కక్కడే మృతి చెందగా, దగ్గుపాటి శివన్నారాయణ తీవ్రంగా గాయపడ్డాడు.

07/05/2016 - 01:42

గుంటూరు (స్పోర్ట్స్), జూలై 4: జిల్లాలో అథ్లెటిక్స్‌కు ప్రత్యేకస్థానం ఉందని, అథ్లెటిక్స్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని బాస్కెట్‌బాల్ జాతీయ క్రీడాకారుడు, వ్యాపారవేత్త కొర్రపోలు శ్రీనివాసరావు అన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోస్థానిక బిఆర్ స్టేడియంలో సోమవారం ప్రారంభమైన జిల్లా అథ్లెటిక్స్ అండర్ 14, 16 బాలబాలికల ఎంపికల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

07/05/2016 - 01:41

నరసరావుపేట, జూలై 4: జేఎన్‌టీయూకే అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల నరసరావుపేటకు రా వడం విద్యారంగానికి, విద్యా వికాసానికి, ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో ఉపయోగపడనుందని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. సోమవారం స్థానిక భువనచంద్ర టౌన్‌హాల్లో ‘నరసరావుపేటలో విద్యావ్యవస్థలో మరో మణిహారం జేఎన్‌టీయూకే’ అనే అంశంపై జరిగిన రౌండ్ టౌబుల్ సమావేశంలో వివరించారు.

07/05/2016 - 01:41

ప్రత్తిపాడు, జూలై 4: జెఎన్‌టియు కాకినాడ పరిధిలోని 253 ఇంజనీరింగ్ కళాశాలల్లో సిఎస్‌ఇ విభాగంలో శ్రీ మిట్టపల్లి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని మిట్టపల్లి లక్ష్మీవందిత రాష్ట్రప్రభుత్వ ప్రతిభా పురస్కారానికి ఎంపికైంది.

07/05/2016 - 01:40

గుంటూరు, జూలై 4: పెదకాకాని బాజీబాబా 528వ ఉరుసు మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం గంధం ఊరేగింపు కార్యక్రమంతో ఉరుసు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎపి స్టేట్ వక్ఫ్‌బోర్డు సహాయ కార్యదర్శి షేక్ అహ్మద్, ప్రత్యేక అధికారి నూర్, కాకాని తహశీల్దార్ల పర్యవేక్షణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొదటిసారిగా వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో రూ.

07/05/2016 - 01:40

గుంటూరు, జూలై 4: తెలుగుజాతి పౌరుష ప్రతాపాలను ప్రపంచానికి చాటిన మాన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు త్యాగనిరతిని, శౌర్య పరాక్రమాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని అవగాహన సంస్థ నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న వివిధ రంగాల ప్రముఖులు నివాళులర్పించారు. సోమవారం ఉదయం నాజ్‌సెంటర్‌లోని అల్లూరి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

07/05/2016 - 01:38

అల్లవరం, జూలై 4: నాలుగు మండలాల మురుగు నీరు సముద్రంలో కలవడానికి మార్గమైన అల్లవరం మండలంలోని రామేశ్వరం మొగ మళ్లీ తవ్వడానికి తక్షణ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టంచేశారు. సోమవారం బోటుపై వెళ్లి మొగను ఆయన పరిశీలించారు. బోటుకు సాంకేతిక లోపం ఏర్పడటంతో అరగంట సేపు బోటు డ్రెయిన్‌లోనే నిలిచిపోయింది.

07/05/2016 - 01:37

కాకినాడ సిటీ, జూలై 4: జిల్లాలోని కడియం మండల పరిధిలో ఉన్న నర్సరీ రైతులకు 500 సౌరశక్తితో పనిచేసే పంపుసెట్లను ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు.

07/05/2016 - 01:37

కాకినాడ, జూలై 4: జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేసే శాఖలు తమ లక్ష్యాల సాధనలో ఉత్తమ పద్ధతులు పాటించటం ద్వారా మంచి ఫలితాలు పాటించవచ్చని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కోర్టు హాలులో జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.

07/05/2016 - 01:36

రాజమహేంద్రవరం, జూలై 4: రివర్ సిటీ రాజమహేంద్రవరంలో కోట్లు కుమ్మరిస్తున్నా ముంపు సమస్య కొలిక్కి రావడం లేదు.. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా పూర్వం నుంచీ వున్న చెరువులు ఆక్రమణలకు గురి కావడం, అభివృద్ధి పేరిట పూడుకుపోవడంతో నగరంలో కోట్ల నిధులు కుమ్మరించి పనులు చేపడుతున్నా కాసింత వర్షానికే ముంపు సమస్య తప్పడం లేదు. సరే ఇపుడు తాజాగా నగరంలో రూ.7.50 కోట్లతో డ్రెయిన్ల ఆధునీకరణ చేపట్టారు.

Pages