S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/04/2016 - 00:16

షిల్లాంగ్, జూలై 3: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఒక రెస్టారెంట్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్న 20 మందిని దారుణంగా నరికి చంపిన సంఘటన తర్వాత మేఘాలయలోని 443 కిలోమీటర్ల భారత్-బంగ్లా సరిహద్దు వెంబడి సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) బలగాలను అత్యంత అప్రమత్తంగా ఉంచినట్లు బిఎస్‌ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు ఆదివారం చెప్పారు.

07/04/2016 - 00:14

న్యూఢిల్లీ, జూలై 3: చరిత్రను మరిచిపోయేవారు చరిత్రను సృష్టించలేరని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సిక్కుల చివరి గురువు గురుగోవింద్ సింగ్ 350 జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తామని, ఇందుకోసం వంద కోట్లు కేటాయిస్తామని మోదీ తెలిపారు. సిక్కు జనరల్ బాబా బందా సింగ్ 300 వర్ధంతి సందర్భంగా ఆదివారం ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఓ సంస్మరణ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు.

,
07/04/2016 - 00:12

భువనేశ్వర్, జూలై 3: పూరీ జగన్నాథుడి వార్షిక రథయాత్ర కార్యక్రమం నేపథ్యంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ మరో ప్రపంచ రికార్డుకు సిద్ధమవుతున్నాడు. పూరీ సముద్రతీరంలో మొత్తం వంద ఇసుక రథాలను రూపొందిస్తున్నారు. జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలతో కలిసి మూడు అత్యున్నతమైన రథాలపై ప్రతి ఏటా తొమ్మిది రోజులపాటు ఊరేగడం తెలిసిందే.

07/04/2016 - 00:09

కోల్‌కతా, జూలై 3: దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందువుల వలసలపై వచ్చేవారం నుంచి విశ్వహిందూ పరిషత్ సర్వే నిర్వహించనుంది. జమ్ము కాశ్మీర్ నుంచి కేరళ దాకా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇళ్లూ వాకిళ్లు, ఆస్తిపాస్తులను వదిలేసి వెళ్లిపోతున్న హిందువుల పరిస్థితులపై పూర్తిస్థాయి సర్వేను నిర్వహిస్తామని విహెచ్‌పి అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌భాయ్ తొగాడియా ఆదివారం తెలిపారు.

07/04/2016 - 00:09

గుంటూరు, జూలై 3: రాజధాని అమరావతి యాక్సిస్ రోడ్డు నిర్వాసితులకు ప్రభుత్వం ఇప్పటికీ ప్యాకేజీ ప్రకటించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వెంకటపాలెం మొదలు కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, పెనుమాక, తుళ్లూరు వరకు 21 కిలోమీటర్ల పరిధిలో యాక్సిస్ రోడ్డు ఏర్పాటు కానుంది. రూ. 235 కోట్లతో రూపుదిద్దుకుంటున్న ఈ రహదారి పనులను నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది.

07/04/2016 - 00:08

న్యూఢిల్లీ, జూలై 3: ఎన్‌డియే ప్రభుత్వ రెండేళ్ల పనితీరుపై కాంగ్రెస్ పార్టీ ఆదివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. హామీలను తుంగలో తొక్కడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరితేరిన వాడని, అబద్ధాలనే పునాదిగా చేసుకుని ఆయన పరిపాలన సాగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. ‘ఎన్నికల ప్రచారంలో మోదీ వాస్తవాలను పక్కనపెట్టి దేశవ్యాప్తంగా అబద్ధాలను ప్రచారం చేశారు.

07/04/2016 - 00:07

ఢాకా, జూలై 3: బంగ్లాదేశ్‌లోని ఒక రెస్టారెంట్‌పై దాడి చేసి, 20 మందిని బందీలుగా చేసుకొని, హతమార్చింది దేశీయు ఇస్లామిస్టు ఉగ్రవాదులేనని ఆ దేశం ప్రకటించింది. ఈ ఊచకోతతో దిగ్భ్రాంతికి గురయిన బంగ్లాదేశ్ రెండు రోజులపాటు జాతీయ సంతాప దినాలు పాటిస్తోంది.

07/04/2016 - 00:04

న్యూఢిల్లీ, జూలై 3: న్యాయమూర్తులుగా పదోన్నతికోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల పేర్లను కొలీజియంకు పంపే ముందు ఆ దరఖాస్తులను పరిశీలించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.్ఠకూర్ తిరస్కరించారు.

07/04/2016 - 00:03

వాషింగ్టన్, జూలై 3: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాదుల భయాందోళనలు కలిగించే ప్రచారం, హింస విజయవంతం కాలేవని అమెరికా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అన్నారు. బంగ్లాదేశ్‌లోని ఒక రెస్టారెంట్‌పై దాడికి దిగిన ఉగ్రవాదులు కొంతమందిని బందీలుగా చేజిక్కించుకొని, అందులోని 20 మందిని ఊచకోత కోసిన నేపథ్యంలో హిల్లరీ బంగ్లాదేశ్ ప్రజలకు సంఘీభావం ప్రకటించారు.

07/04/2016 - 00:02

చెన్నై, జూలై 3: తమిళనాడులో ఇన్ఫోసిస్ ఉద్యోగి స్వాతిని హత్య చేసిన దోషికి ఉరిశిక్ష వేయాలని ఆమె కుటుంబం ఆదివారం డిమాండ్ చేసింది. నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో 24 ఏళ్ల స్వాతిని హతమార్చిన నిందితుడు రామ్‌కుమార్ (22)ను పోలీసులు శనివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. స్వాతి హంతకుడికి కఠినాతి కఠిన మైన శిక్ష విధించాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

Pages