S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/04/2016 - 00:32

ఏలూరు, జూలై 3 : జిల్లాలో బెల్టుషాపులను పూర్తిగా నిరోధించాలని రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. స్థానిక శనివారపుపేట రోడ్డులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఎక్సైజ్ శాఖ పనితీరుపై ఆమె సమీక్షించారు.

07/04/2016 - 00:32

పోలవరం, జూలై 3: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో స్పిల్‌వే డయాగ్రామ్ వాల్ నిర్మించే ప్రాంతంలో సేకరించిన రాళ్లను సీనియర్ జియాలజిస్టు అజయ్‌కుమార్ ఆదివారం పరిశీలించారు. ప్రాజెక్టు కాంట్రాక్టు ఏజన్సీకి చెందిన ల్యాబ్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు. జియాలజిస్టు ఆఫ్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ అయిన అజయ్‌కుమార్ రెండు రోజుల రాతి పరీక్షల నిమిత్తం శనివారం సాయంత్రం ఇక్కడకు చేరుకున్నారు.

07/04/2016 - 00:31

భీమవరం, జూలై 3: కృష్ణా పుష్కరాల నేపధ్యంలో సిఎం చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసిన పురాతన దేవాలయాలను పరిశీలించేందుకు వెళ్లిన భారతీయ జనతా పార్టీ నేతలపై తెలుగుదేశం పార్టీ ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అనుచరులు దాడి చెయ్యడం చాలా దారుణమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు భూపతిరాజు శ్రీనివాసవర్మ మండిపడ్డారు. ఈ విధంగా దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.

07/04/2016 - 00:30

భీమవరం, జూలై 3: దేశాన్ని, ధర్మాన్ని కాపాడటమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) లక్ష్యంగా పనిచేస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత బౌద్ధప్రముఖ్ గుత్తా శేషారెడ్డి (ఆంధ్రప్రదేశ్) అన్నారు. సమాజ సేవలో ఐక్యమత్యంతో సంఘ్ ముందుకు వెళ్తోందన్నారు. ఆదివారం స్థానిక త్యాగరాజ భవనంలో ఆర్‌ఎస్‌ఎస్ గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. జిల్లా అధ్యక్షుడు మంతెన రామచంద్రరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.

07/04/2016 - 00:30

భీమవరం, జూలై 3: కొద్ది రోజుల క్రితం పట్టణంలోని గోవులను స్థానిక బంట్రోతులవారి వీధిలో ఉన్న మున్సిపల్ స్థలానికి తీసుకువచ్చారు. ఇక్కడకు గోవులు ఎక్కువ సంఖ్యలో తీసుకురావడం జరిగింది. అయితే వాటికి ఎటువంటి ఆహార, పానీయాలు పురపాలక సంఘ అధికారులు అందించలేదు. అయితే ఏం జరిగిందో తెలియదుగాని ఆదివారం రాత్రి ఒక గోవు మృతి చెందింది.

07/04/2016 - 00:29

ఏలూరు, జూలై 3 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గుర్తుంచుకోవాలని, దుష్ప్రచారాలు మానుకోవాలని ప్రతిపక్ష వై ఎస్ పార్టీకి ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ సూచించారు. తన క్యాంపు కార్యాలయంలో వచ్చిన ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

07/04/2016 - 00:29

పోలవరం, జూలై 3: గోదావరి నదిలో స్నానానికి దిగిన బాలుడు ప్రమాదవశాత్తు మునిగి మరణించిన సంఘటన ఆదివారం సాయంత్రం పోలవరం పంచాయతీ పరిధిలో జరిగింది. కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన కేతా మహేష్ (15) కొంతమంది యువకులతో ఇంజన్ పడవపై తూర్పుగోదావరి జిల్లాలోని పూడిపల్లి గ్రామ సమీపంలో ఉన్న గండి పోశమ్మ ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో మహానందీశ్వర స్వామివారి ఆలయం వద్ద ఆగి దైవదర్శనం చేసుకున్నారు.

07/04/2016 - 00:28

నల్లజర్ల, జూలై 3: చదరంగం ఆడటం ద్వారా మెదడు చురుకుగా పనిచేసి మంచి ఆలోచనలు వస్తాయని ఎలైట్ విద్యాసంస్థల ఛైర్మన్ శ్రీలక్ష్మి అన్నారు. జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-17 బాల బాలికల విభాగంలో జిల్లాస్థాయి చదరంగ పోటీలు ఆదివారం ప్రారంభించారు. ఈ పోటీలను ప్రారంభించిన ఆమె క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువులో బాగా రాణించాలంటే చదరంగం ఒక్కటే మార్గమన్నారు.

07/04/2016 - 00:28

ఏలూరు, జూలై 3 : ఏలూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు 696 కోట్ల రూపాయల అంచనాలతో ఒక ప్రణాళికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందని ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ చెప్పారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో ఆదివారం మేయర్‌గా రెండేళ్లు పూర్తి చేసిన నూర్జహాన్‌ను మహిళా కార్పొరేటర్లు ఘనంగా సత్కరించారు.

,
07/04/2016 - 00:19

ఇండోర్, జూలై 3: ఇండోర్ వైద్యులు అరుదైన ఘనతను సాధించారు. పనె్నండేళ్ల బాలుడికి మాయమైన ముక్కును కృత్రిమంగా సృష్టించి యథాస్థానంలో ఇంప్లాంట్ చేసి విజయం సాధించారు. ఉజ్జయిని పట్టణానికి చెందిన అరుణ్ పటేల్ (12) నెలరోజుల వయసులో ఉన్నప్పుడే ఇంజక్షన్ కారణంగా సైడ్ ఎఫెక్ట్‌తో అతని ముక్కు దాదాపు మాయమైపోయిందని అతనికి సర్జరీ చేసిన వైద్యుల బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ అశ్విని దాష్ తెలిపారు.

Pages