S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 23:55

గోవిందరావుపేట, జూలై 3: మండలంలోని రైతులకు కల్పతరువైన లక్నవరం చెరువులోకి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చిచేరుతుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల 13 అడుగుల నీటి మట్టం ఉన్న లక్నవరం చెరువు నీరు 21.5 అడుగులకు చేరింది. 25 అడుగుల నీటిమట్టానికి చేరితే ఖరీఫ్ పంటకు ఢోకా ఉండదు.

07/03/2016 - 23:54

నక్కలగుట్ట, జూలై 3: చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో లోక కల్యాణం కోసం శాకంబరీ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి అంజనీదేవి తెలిపారు. ఆదివారం దేవస్థాన ప్రధానార్చకులు భద్రకాళిశేషుతో కలసి విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజనీదేవి మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీనుండి 19వ తేదీ వరకు, 15 రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

07/03/2016 - 23:54

నరుూంనగర్, జూలై 3: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ఆదివారం నగరమేయర్ నన్నపునేని నరేందర్‌తో కలిసి ప్రశాంత్‌నగర్‌లో మొక్కలు నాటారు.

07/03/2016 - 23:53

నక్కలగుట్ట, జూలై 3: పోలీసు శాఖలోని వివిధ విభాగాలలో స్ట్ఫైండరీ, క్యాడెట్ ట్రైనీ పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్ ఝా అన్నారు.

07/03/2016 - 23:53

నరుూంనగర్, జూలై 3: వరంగల్ జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ శాసనసభ ఉప సభాపతి పద్మాదేవేందర్ రెడ్డికి నగర నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

07/03/2016 - 23:53

నర్సంపేట, జూలై 3: కరవు మండలాలకు తక్షణమే నష్టపరిహారం అందించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎడ్ల అశోక్‌రెడ్డి మాట్లాడారు.

07/03/2016 - 23:52

వరంగల్, జూలై 3: ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా రైతుల ప్రయోజనం కోసం సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి తీరుతామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా సర్య్యూట్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్దికోసమే మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై రాద్ధాంతం చేస్తున్నారని ఆమె విమర్శించారు.

07/03/2016 - 23:51

నల్లగొండ టౌన్, జూలై 3: ఎస్‌ఐ అభ్యర్థులకు పట్టణలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహిస్తున్న దేహధారుడ్య పరీక్షలు ఆదివారం 7వరోజు కూడా కొనసాగాయి. అభ్యర్థులు ఈ పరీక్షల్లో నెగ్గి తమ ఉద్యోగావకాశాల అందుకునేందుకు పోటీలు పడ్డారు. పరీక్షలకు హాజరుకాని మైనార్టీ అభ్యర్థులు 9న హాజరుకావచ్చని ఎస్పీ తెలిపారు.

07/03/2016 - 23:50

తిప్పర్తి, జూలై 3: మండలంలోని గుట్టకాడి గూడెం వద్ధ శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయలయ్యాయి. ఎస్‌ఐ హరీందర్‌గౌడ్ తెలిపిన వివరాల మేరకు మేకల వసంత్(25), ఇట్టమల్ల రాజుతో కలిసి నల్లగొండ నుండి తిప్పర్తి అద్దంకి-నార్కట్‌పల్లి హైవే మీదుగా వస్తుండగా గుట్టకాడిగూడెం వంతెన వద్ధ గుర్తు తెలియని వాహనం వారిని ఢీ కొట్టింది.

07/03/2016 - 23:50

ఆలేరు, జూలై 3: తెలంగాణ ఉద్యమకారుల పోరాటాలు, త్యాగాలతో సిద్ధించిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎం కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ అమరులను, ఉద్యమకారులను విస్మరించి తెలంగాణ ద్రోహులకు అందలమెక్కిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు దుయ్యబట్టారు.

Pages