S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/04/2016 - 00:39

గరం, జూలై 3: అణువిద్యుత్ కేంద్రాలు పర్యావరణానికి, ప్రజల మనుగడకు ప్రమాదకరమని ప్రముఖ సామాజిక, పర్యావరణవేత్త ఇ.ఎ.ఎస్.శర్మ తెలిపారు. ఆదివారం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన జనవిజ్ఞాన వేదిక జిల్లా మహాసభలో ముఖ్యఅతిధిగా శర్మ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు- ప్రమాదాలు- ప్రత్యామ్నాయ మార్గాలు అనే అంశంపై మాట్లాడారు.

07/04/2016 - 00:38

విజయనగరం(టౌన్), జూలై 3: సం క్షేమ హాస్టళ్లను ప్రభుత్వం మూసివేయ డం సరైన చర్య కాదని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. బా లాజీ కూడలిలోని అంబేద్కర్ భవనం లో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లాకార్యదర్శి కె.సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇటీవల ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్ల మూసివేత, విలీనం, పాఠశాలల రేషనలైజేషన్ అంశాలపై చర్చించారు.

07/04/2016 - 00:38

వేపాడ, జూలై 3: మండలంలోని వల్లంపూడి పోలీసు స్టేషన్‌లో విజయనగరం డి ఎస్పీ రమణ ఆదివారం వార్షిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఫిర్యాదులు, కేసు లు నమోదు, లైసెన్సులు కలిగిన తుపాకులు, గ్రామాల చరిత్ర రికార్డులను డిఎస్పీ పరిశీలించారు. పలు రికార్డుల నిర్వహణపై తప్పులను ఎత్తిచూపుతూ ఎస్సై కృష్ణమూర్తిని సున్నితంగా మందలించారు.

07/04/2016 - 00:37

బొండపల్లి, జూలై 3: పరిసరాల పరిశుభ్రతపై ప్రజల ఆలోచనలలో మార్పు రావాల్సిన అవసరం ఉందని జెడ్పీటిసి బం డారు బాలాజీ అన్నారు. మండలంలోని బి.రాజేరు గ్రా మంలో సర్పంచ్ అధ్యక్షతన మండల బిజెపిశాఖ ఆధ్వర్యం లో స్వచ్ఛ్భారత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలలో ప్రజలు మారుతున్న కాలాన్ని బట్టి ఆలోచనలలో మార్పు రావాలన్నారు. బిజెపి చేపట్టిన స్వచ్ఛ భారత్ పట్ల ప్రజలు అర్థం చేసుకుని ఆచరించాలన్నారు.

07/04/2016 - 00:37

నెల్లిమర్ల, జూలై 3: నెల్లిమర్ల జూట్‌మిల్లు యాజమాన్యం దొడ్డిదారి ఒప్పందాలు చేస్తే కార్మికులు సహించరని జూట్‌మిల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి కిల్లంపల్లి రామారావు అన్నారు. ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 800 గ్రాట్యూటీ బకాయిలు చెల్లించాల్సి ఉన్నా యాజమాన్యం ఇంతవరకు చర్య లు చేపట్టలేదని అన్నారు.

07/04/2016 - 00:36

గజపతినగరం, జూలై 3: మ ండలంలోని కొణిసి గ్రామంలోగల గ్రానైట్ క్వారీ నిర్వాహకు లు పేలుస్తున్న పేలుళ్లతో కొణి సతోపాటు సమీప చిట్టాయవలస గ్రామస్థులు భయబ్రాంతులకు గురవుతూ ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. రాళ్లను పేల్చడానికి పేలుళ్లు నిర్వహించడంతో ఆ శబ్దాలు చెవులకు చిల్లులు పడేలా ఉంటున్నాయని, దీనివలన శారీరక సమస్యలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. బోడిమెట్టలో గెలాక్సీ, నటరాజ్, ఎస్.కె.

07/04/2016 - 00:36

విజయనగరం(టౌన్), జూలై 3: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు అమలులోకి తెచ్చిన 2004 కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దుచేయాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శేషగిరి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా పరిషత్ ఆవరణలోని యుటిఎఫ్ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంట్రిబ్యూటరీ పింఛన్ వల్ల ఉద్యోగులకు ఎటువంటి భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

07/04/2016 - 00:35

విజయనగరం (్ఫర్టు), జూలై 3: మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఎమ్మెల్యే గీత కోరారు. పట్టణంలో పూల్‌బాగ్‌లో ఆదివారం మొక్కలను నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ మొక్కలను నాటితే సరిపోదని, వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని తెలిపారు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యానికి కళ్లెం వేయాలం టే మొక్కలను నాటాలని కోరారు.

07/04/2016 - 00:35

విజయనగరం (్ఫర్టు), జూలై 3: పట్టణంలో బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలలలో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ తెలిపారు. 13వ వార్డు పరిధిలో కాటవీధి మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలను ఆదివారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ బడిఈడు వయస్సు కలిగిన పిల్లలను గుర్తించి పాఠశాలలలో చేర్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.

07/04/2016 - 00:33

ఏలూరు, జూలై 3 : ఇంకొంతకాలమే... మనం అధికారంలోకి వస్తాం... ఆ తరువాత ఇన్నాళ్లూ కష్టపడిన వారికి పూర్తిస్థాయిలో న్యాయం జరుగుతుంది... అంటూ రెండేళ్ల క్రితం ఎన్నికల ముందు టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు జిల్లా జిల్లా పార్టీ కేడర్‌కు హామీలు ఇస్తూ ముందుకు సాగిపోయారు. ఆయన చెప్పిన విధంగానే పార్టీ అధికారంలోకి వచ్చింది. అది కూడా పూర్తి మెజార్టీతో కొలువుతీరింది.

Pages