S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/30/2016 - 07:04

తిరుపతి, మే 29: తిరుపతిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు చివరిరోజైన ఆదివారంనాడు పార్టీ జాతీయ కార్యదర్శి, ఆంధ్ర సిఎం చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్, పార్టీ తెలంగాణ నేతలు తెలంగాణరాష్ట్ర సమితిపైనా, తెలంగాణ సిఎం కె.చంద్రశేఖర్ రావుపైనా నిప్పులు చెరిగారు.

05/30/2016 - 06:57

హైదరాబాద్, మే 29: కేంద్రం నుంచి అధిక నిధులు సాధించే అంశంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఉమ్మడిలో ఉన్నప్పుడు రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చేవో అంతే మొత్తాన్ని రాబట్టుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై సర్కారు కసరత్తు మొదలెట్టింది. ఉమ్మడిలో 23 జిల్లాలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పది జిల్లాలు మాత్రమే ఉండటంతో సగానికి సగం తగ్గిపోయాయి.

05/30/2016 - 07:29

బెంగళూరు, మే 29: తొమ్మిదో ఐపిఎల్ ఫైనల్‌లో పటిష్టమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన తుది పోరులో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని బెంగళూరును ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన సన్‌రైజర్స్ తొలిసారి టైటిల్‌ను సాధించింది. కాగా, హైదరాబాద్ ఐపిఎల్‌లో విజేతగా నిలవడం ఇది రెండోసారి.

05/30/2016 - 06:49

హైదరాబాద్, మే 29: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. ఆదివారం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపినా ఎంపికపై స్పష్టత రాలేదు. అయితే ఎంపిక నిర్ణయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకే పొలిట్ బ్యూరో అప్పగించింది.

05/30/2016 - 06:48

న్యూఢిల్లీ, మే 29: పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం వెంకయ్యనాయుడు, వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభ అభ్యర్థిత్వాల పట్ల కర్నాటక బిజెపి, ఆంధ్ర తెలుగుదేశం పార్టీల నుంచి గట్టి వ్యతిరేకత రావటంతో బిజెపి అధినాయకత్వం చివరి నిమిషంలో నిర్ణయాలు మార్చుకుంది. వెంకయ్య అభ్యర్థిత్వం పట్ల కర్నాటక బిజెపిలో తిరుగుబాటు పరిస్థితులు తలెత్తడంతో, ఆయనకు రాజస్తాన్ నుంచి రాజ్యసభ టికెట్ కేటాయించింది.

05/30/2016 - 06:46

తిరుపతి, మే 29: ‘పేదరికం నా కులం.. నా మతం. పేదరికం ఎక్కడుంటే నేను అక్కడుంటా. పేదరిక నిర్మూలనే నా లక్ష్యం, సంకల్పం’ అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మూడు రోజులపాటు సాగిన టిడిపి మహానాడు ముగింపు సభలో ఆయన గంటకు పైగా ఉద్వేగంగా ప్రసంగించారు. కాంగ్రెస్, వైకాపాలపై విమర్శలతో విరుచుకుపడ్డ బాబు కెసిఆర్‌పై పెదవి విప్పకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

05/30/2016 - 06:45

దావణగెరె (కర్నాటక), మే 29: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్ల కాలంలో 700కు పైగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను చేపట్టామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. వీటిలో కొన్ని పథకాలు అమలులోకి రాకపోయినా, చేపట్టిన ప్రయత్నాలు సఫలం కాకపోయినా ‘ఎట్టి పరిస్థితుల్లోనూ దేశాన్ని తప్పుడు పథంలో ముందుకు వెళ్లనివ్వను’ అని ఉద్ఘాటించారు.

05/30/2016 - 06:42

హైదరాబాద్, మే 29: తమ పాలనపై ప్రతి ఏటా ప్రోగ్రెస్ రిపోర్ట్‌తో ప్రజల ముందుకు వస్తామని, అదే కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లకొకసారి మాత్రమే ప్రజల ముందుకు వెళ్లేదని బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ నేతలంతా 10 జన్‌పథ్ చుట్టూనే తిరిగేవారని ఆయన విమర్శించారు. అవినీతిలో కూరుకుపోయిన యుపిఎ పాలనకు, ఇప్పటి ఎన్డీయే పాలనకు పోలికే లేదన్నారు.

05/30/2016 - 06:40

తిరుపతి, మే 29: తిరుపతి మహానాడు మూడు రోజుల ముచ్చట ఆదివారంతో ముగిసింది. యథావిధిగా చంద్రబాబునాయుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలపై వస్తున్న అవినీతి ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని.. దానిని మరో మార్గం పట్టించేందుకు జగన్ అవినీతిని మరోసారి తెరపైకి తీసుకువచ్చారు.

05/30/2016 - 06:38

హైదరాబాద్/ విశాఖపట్నం, మే 29: ఎండాకాలం వెళ్లిపోతోంది. ఎండలు తగ్గుముఖం పట్టాయి. వడగాడ్పులు ఉంటాయని గత చాలా రోజుల నుండి ప్రకటిస్తున్న భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రస్తుతం వడగాడ్పుల గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. నైరుతీ రుతుపవనాలు ఇంకా రాకపోయినప్పటికీ, రుతుపవనాల కంటే తొలుత వచ్చే ‘ముందస్తు వర్షాలు’ కురుస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షపాతం నమోదైంది.

Pages