S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/30/2016 - 06:37

కాకినాడ, మే 29: పప్పు ధాన్యాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు, మినపప్పు ధరలు అమాంతం పెరిగిపోవడంతో జనం హడలెత్తిపోతున్నారు. హోటళ్లు, తినుబండారాల దుకాణదారులు కూడా ధరలు పెంచేశారు. తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున కంది, మినప్పప్పులు బ్లాక్‌మార్కెటీర్లు స్టాక్ చేసినట్టు స్పష్టమవుతోంది. అయినప్పటికీ సదరు గోదాములపై దాడులకు అధికారులు సాహసించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

05/30/2016 - 06:27

కాబోయే వరుడు ముస్త్ఫారాజ్‌తో ప్రముఖ నటి ప్రియమణి నిశ్చితార్ధం బెంగళూరులో జరిగింది. ఈవెంట్ కంపెనీ యజమాని అయిన ముస్త్ఫారాజ్‌తో కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగించిన ప్రియమణి త్వరలో ఓ ఇంటిది కాబోతోంది.

05/30/2016 - 06:24

‘కృష్ణాష్టమి’ చిత్రంతో తెలుగు తెరపైకి వచ్చిన కొత్త కథానాయిక నిక్కీ గల్రాని. ఒకేసారిగా తెలుగు తెరపైకి తెరంగేట్రం చేయలేదు ఈ బెంగుళూరు భామ. గత మూడు నాలుగేళ్లుగా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎడాపెడా చిత్రాల్లో నటించాకే ఆమెకు తెలుగులో అవకాశం వచ్చింది. తెలుగు మార్కెట్ పెద్దది కనుక ఇక్కడ అదృష్టాన్ని పరీక్షించుకొందామని ప్రయత్నించినా తొలి చిత్రం అనుకున్న అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయింది.

05/30/2016 - 06:21

గత ఏడాది మలయాళంలో విడుదలై ఘన విజయం సాధించిన ‘ప్రేమమ్’ చిత్రంలో లెక్చరర్ పాత్రలో నటించి ఆకట్టుకుంది సాయిపల్లవి. తమిళ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఈ సినిమా తర్వాత పలు తమిళ, మలయాళ చిత్రాల్లో అవకాశాలతో జోరుమీదుంది. తాజాగా ఈమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మెగా హీరో వరుణ్‌తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనుందట.

05/30/2016 - 06:19

విశాల్, తమన్నా, జగపతిబాబు కాంబినేషన్‌లో హరివెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై నిర్మాత జి.హరి ఓ సినిమాను రూపొందించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, భారీ బడ్జెట్‌తో హైటెక్నికల్ విలువలతో, స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నామని తెలిపారు. విశాల్ కెరీర్‌లో హై రేంజ్ చిత్రంగా నిలవనుందని, షూటింగ్ ప్రారంభం కాకముందే భారీ అంచనాలు నెలకొన్నాయని ఆయన తెలిపారు.

05/30/2016 - 06:17

దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రుతిహాసన్ ఈమధ్య తెలుగులో ‘ప్రేమమ్’ సినిమాలో మాత్రమే నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ వైపు ఆసక్తిగా ఉన్న ఈమె అక్కడ ఓ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో పలు అవకాశాలు వస్తున్నా కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదట. ఎలాగైనా సరే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా జెండా పాతాలనే ప్రయత్నాల్లో ఉంది.

05/30/2016 - 06:15

మోడరన్ సినిమా పతాకంపై ఆదిత్య ఓం స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, జూన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో ఆదిత్య ఓం మాట్లాడుతూ, ఈ చిత్రం ద్వారా పది మంది నూతన నటీనటులను పరిచయం చేస్తున్నామని, యూత్‌ఫుల్ ట్రెండీ ఫిలిమ్‌గా టెక్నికల్ హై స్టాండర్డ్స్‌లో సినిమాను రూపొందించామని తెలిపారు.

05/30/2016 - 06:14

తక్కువ సినిమాలతోనే గ్లామర్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న హాట్‌భామ రాశిఖన్నా మొదట్లో చాలా ముద్దుగా, బొద్దుగా ఉండేది. దాంతో ఆమె ఫిజిక్‌పై రకరకాల కామెంట్స్ వచ్చాయి. ఇక లాభం లేదనుకుని ఆమె జిమ్‌లో బాగానే కష్టపడుతోంది. ఇప్పటికి రెండు, మూడుగంటలపాటు తెగ కసరత్తులు చేస్తోందట. ఇదంతా ఎందుకంటే..

05/30/2016 - 06:13

జె.వి.నాయుడు ప్రధాన పాత్రలో జాలె ఫిలిమ్స్ పతాకంపై నాగరాజు తలారి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘బిట్రగుంట’ (ది బిగినింగ్). మురళీధర్‌రెడ్డి, ఇషిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

05/30/2016 - 06:11

సత్యరాజ్, శిబిరాజ్, బిందుమాధవి ప్రధాన తారాగణంగా రత్న సెల్యులాయిడ్స్ పతాకంపై నిర్మాత జక్కం జవహర్‌బాబు అందిస్తున్న చిత్రం ‘దొర’. తమిళంలో ధరణీధరన్ దర్శకత్వం వహించిన జాక్‌సన్ దురై పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించారు. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేశారు.

Pages