S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/30/2016 - 07:33

లక్నో, మే 29: పప్పు్ధన్యాల ధరలు పెరగడానికి కారణం.. గడచిన రెండేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, విదేశాల నుంచి పడిపోయిన పప్పు దిగుమతులేనని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. రిటైల్ మార్కెట్‌లో పప్పు ధరలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో పాశ్వాన్ పైవిధంగా స్పందించారు. ‘పప్పు్ధన్యాల ధరలు పెరగడానికి పలు కారణాలున్నాయి.

05/30/2016 - 07:28

పారిస్, మే 29: ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ ఇక్కడ జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్స్ చేరింది. కెరీర్‌లో 22వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌పై కనే్నసిన ఆమె మూడో రౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టినా మ్లాడెనోవిచ్‌ను 6-4, 7-6 తేడాతో ఓడించింది.

05/30/2016 - 07:27

పారిస్, మే 29: సెరెనా విలియమ్స్‌ను జికా వైరస్ భయం వెంటాడుతున్నది. ఆగస్టులో రియో ఒలింపిక్స్ జరగనుండగా, అక్కడ తీవ్రమవుతున్న జికా వైరస్ సమస్య ఆందోళన కలిగిస్తున్నదని సెరెనా చెప్పింది. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ మూడో రౌండ్‌లో క్రిస్టినా మ్లాడెనోవిచ్‌ను ఓడించిన తర్వాత ఆమె విలేఖరులతో మాట్లాడుతూ బ్రెజిల్‌ను జికా వైరస్ కుదిపేస్తున్న విషయాన్ని ప్రస్తావించింది.

05/30/2016 - 07:27

జకార్తా, మే 29: క్వాలిఫయర్స్‌తో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇండోనేషియా ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతానని భారత స్టార్, హైదరాబాదీ సైనా నెహ్వాల్ చెప్పింది. ఈ ఈవెంట్ కోసం జకార్తా వచ్చిన ఆమె పిటిఐతో మాట్లాడుతూ ఫిట్నెస్ సమస్యలేవీ ప్రస్తుతం బాధించడం లేదని చెప్పింది. రియో ఒలింపిక్స్ సమీపిస్తున్న నేపథ్యంలో జకార్తా ఓపెన్ వామప్ ఈవెంట్‌గా ఉపయోగపడుతుందని తెలిపింది.

05/30/2016 - 07:26

న్యూఢిల్లీ, మే 29: భారత వెటరన్ డిస్కస్ త్రోయర్ సీమా పునియా రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించింది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం కాలిఫోర్నియాలోని సలినాస్‌లో జరుగుతున్న పాట్ యంగ్స్ త్రోయర్స్ క్లాసిక్ ఈవెంట్‌లో పాల్గొన్న 32 ఏళ్ల సీమ 62.62 మీటర్ల దూరానికి డిస్కస్‌ను విసిరి ఒలింపిక్స్ అర్హతగా నిర్దేశించిన 61 మీటర్ల దూరాన్ని సులభంగా పూర్తి చేసింది. రియోకు అర్హత సంపాదించింది.

05/30/2016 - 07:16

శ్రీమద్రామాయణం సకల వేద సారమైన గాయత్రీ మంత్రాక్షరములతో కూర్చబడిన పవిత్ర కావ్యం. వేద ప్రతిపాదిక ధర్మ నిరూపకం. ఈ మహాకావ్యంలో సీతారాముల తర్వాత వెంటనే చెప్పుకోతగిన విశిష్ట పురుషుడు హనుమంతుడు. శ్రీరామునివలె హనుమంతుడు కూడా ఆదర్శపురుషుడే. సీతాదేవికి కల్గిన రాక్షస పీడను దూరం చేయడంతోపాటు శ్రీరామచంద్రుని వైభవాన్ని ప్రకటించి, రావణుని కీర్తిని చీల్చి చెందాడిన శక్తిసంపన్నుడు, బుద్ధిశాలి.

05/30/2016 - 07:15

ఇంకా ఏమైనా మీ సేవలో మేము చేయవలసిన పనులు ఆజ్ఞాపించవలసింది అని చెప్పగా నరజనాభుడు ఎంతో సమ్మోద మనస్కుడైనాడు. చంద్రకాంతులతో తేజరిల్లుతున్న వరుణ ఛత్రం తానే చేతిలోకి తీసుకున్నాడు. తక్కిన ధన కనక వస్తు వాహనాలను, గజాశ్వాలను, పశు సంపదను ద్వారకా నగరానికి చేర్చవలసిందిగా నరకుడి అధికార సేవ పరివారానికి ఆజ్ఞాపించాడు.

05/30/2016 - 07:14

కోతికి చీర కట్టొచ్చు. కోతి మనిషి అయిపోతుందా?
‘‘మనిషంటే స్వయంగా ఆలోచించాలి. ఎదుటివారి మాటలకి స్పందించాలి. తప్పొప్పులు చెప్పగలగాలి. మంచి చెడ్డలు బేరీజు వెయ్యాలి. అన్యాయాన్ని ప్రతిఘటించాలి. నువ్వు మా టామీని మనిషని ఎలా అనుకున్నావో నాకర్థం కావడంలేదు’’ అంది మాత.

05/30/2016 - 07:12

మానిని
ఏచి తనర్చి తలిర్చిన క్రోవుల నిమ్మగు ఠావుల, జొంపములం
బూచిన మంచియ శోకములన్ సురపొన్నలఁ బొన్నల గేదఁగులం
గాచి బెడంగుగఁ బండిన యాస హకారములం గదళీ తతులం
జూచుచు వీనుల కింపెసఁగన్ వినుచున్ శుక కోకిల సుస్వరముల్

05/30/2016 - 07:01

హైదరాబాద్, మే 29: డీజిల్, పెట్రోల్ ట్యాంకర్ల యజమానులు నేటినుంచి సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. పెట్రో ఉత్పత్తులపై 14.5 శాతం వ్యాట్ ఉపసంహరించాలన్న డిమాండ్‌తో సమ్మెకు దిగినట్టు ట్యాంకర్ల యజమానుల సంఘం ప్రకటించింది. వ్యాట్‌ను ఎత్తివేయాలన్న తమ దీర్ఘకాలిక డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించనందున సమ్మెకు పూనుకున్నట్టు తెలిపారు.

Pages