S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/30/2016 - 06:10

బర్నింగ్ స్టార్‌గా హృదయకాలేయం సినిమాతో ఇమేజ్‌ని తెచ్చుకున్న సంపూర్ణేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం కొబ్బరిమట్ట. ఇటీవలే విడుదలే ఈ టీజర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ టీజర్‌ను ప్రముఖ నటుడు చిరంజీవి చూసి సంపూర్ణేష్‌ను అభినందించాడట. రోనాల్డ్ సన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సంపూర్ణేష్ మూడు పాత్రల్లో నటిస్తున్నాడు.

05/30/2016 - 06:10

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోవడంతో నిరుత్సాహానికి గురైనాడు. మొత్తంమీద అందులోంచి బయటకు వచ్చిన పవన్ మళ్లీ కొత్త ఉత్సాహంతో మరో సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు. తన కెరీర్‌లో ‘ఖుషి’లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాన్ని అందించిన ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

05/30/2016 - 05:15

తెలంగాణా యందు ఇంకుడు గుంటల విషయంలో ప్రముఖుల నివాస స్థానాలలోనూ, అధికారులు తమ నివాసాలలోనూ మంత్రుల నివాస స్థలాల్లోనూ, ఇంకుడు గుంటలకు స్థలాన్ని కేటాయించలేదని వార్తలు వస్తున్నాయ. బోధించడం ప్రచార ఆర్భాటం చేయడం అతి సులభాతి సులభం. కాని ఆచరణలో ఉంచడం అతి కష్టతరం. పెద్దలూ, ప్రభుత్వమూ గమనించుదురుగాక! ప్రముఖులూ ఒకరికి చెప్పేటందుకే నీతులా?! ఏమో?!
- ప్రొఫెసర్ కె.ఎన్.రావు, కావలి

05/30/2016 - 05:13

అక్కడ ఢిల్లీలో మోదీగారు రెండేళ్లు పూర్తిచేసుకున్నారు. ఇక్కడ కొత్తగా ఏర్పడ్డ రాష్టానికి రెండేళ్ల పాలన అందించిన కె.సి.ఆర్.గారున్నారు. ఇద్దరూ ‘‘మంచిరోజులు’’ తేవడానికే కంకణం కట్టుకున్నారు. ప్రస్తుతానికి కె.సి.ఆర్.గారి- సంగతి నల్లేరు మీద బండీ లాగా వుంది. ఎందుకంటే కొత్త రాష్ట్రం, కొత్త ఆశలు, కొత్త బాటలు- ఒక్క రాష్ట్రం దాకా పరిమితం.

05/30/2016 - 05:10

వాతావరణ మార్పు ప్రమాదకరంగా మారింది.. మన విద్యుత్ రంగం, పరిశ్రమలు, రవాణా రంగం బొగ్గు, పెట్రోలు, సహజ వాయువు లాంటి ఇంధనాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దీనివలన వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు ఎక్కువై భూతాపానికి దారితీస్తున్నది. ప్రస్తుతం విద్యుత్ సరఫరాలో 70 శాతం శిలాజ ఇంధనాల నుంచి వస్తున్నది. శిలాజ ఇంధనాల తరుగుదలవల్ల మనం పునరుత్పాదక ఇంధన వనరులపైనే ఎక్కువగా ఆధారపడవలసి వుంది.

05/30/2016 - 05:08

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈనెల 19వ తేదీన వెలువడినప్పటినుంచి కాంగ్రెస్, వామపక్షాల స్పందనను గమనించగా తాము ఎందుకు ఓడామన్న విషమైగాని, మునుముందు ఏమి చేయాలన్న ప్రశ్నపైకాని వారికి ఏమీ అర్థమవుతున్నట్టు లేదు. ఇందులో కొత్త కూడా ఏమీ కనిపించదు. గతంలోనూ ఇదేవిధంగా ఓడారు. ఇదే పద్ధతిలో అయోమయపు స్పందనలు చేశారు. గంతలు కట్టుకొని తొట్రుపడుతూనే పోయారు.

05/30/2016 - 05:07

సమాఖ్య కూటమి-ఫెడరల్ ఫ్రంట్- గురించి ప్రాంతీయ రాజకీయ అధినేతలకు మరోసారి స్ఫురించడం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల వల్ల సంభవించిన ప్రధాన పరిణామం. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు లభించిన ఘనవిజయం పశ్చిమ బెంగాల్ చరిత్రలోనే అపూర్వమైంది. అందువల్ల సమాఖ్య కూటమి ప్రతిపాదన మరోసారి ప్రాణం పోసుకునే అవకాశం లేకపోలేదు.

05/30/2016 - 04:55

మనం వ్రాసేది ఎంతమందిని సముచ్చకితుల్ని చేస్తుంది. ఎంతమందిని ఉత్తేజపరుస్తుంది. ఎంతమందిని కదిలిస్తోంది. ఏ మహాకార్యం సాధిస్తుంది. ఈ అంతర్గత బాధ కలగకుండా - ఈ భావం స్ఫురించకుండా - ఏదో వ్రాస్తూపోవడం ఎందుకు? చెప్పవలసిన అవసరం వచ్చినప్పుడే,
ఏదో స్ఫురించినప్పుడే, ఎద లోతుల్లో ఏదో మెరిసినప్పుడే, ఏదో ఒక జలపాత భంగిమ భావ ఔన్నత్యానికి అందినప్పుడే - చెప్పు. అక్షర హర్యక్షాలను రెచ్చగొట్టు. అవే

05/30/2016 - 04:52

తెలియని సౌభాగ్యాలన్ని
వెంటబడితె
అపురూపమైన
కానుకలను కొన్నాను
ఇన్నాళ్ళకు పెంచిన
ఆశలన్ని పూలై
ఎన్ని వరాల జల్లుల హొయలో
అని పరవశించాను
తెల్లవారకుండానె
గోరుముద్దలతో పెంచిన
రెండు గోరువంకలు
పాతిక వసంతాల కన్నవారి
కలల్ని, విరచి
సూర్యోదయానికి ముందే
బిలబిలమంటు, ఇల్లు
వాకిలి వదిలి ఎగిసిపోయాయి

05/30/2016 - 04:48

మహాకవి శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా జాతీయ స్థాయ శ్రీశ్రీ స్మారక కవితల పోటీలు నిర్వహిస్తున్నట్లు మానస సాహిత్య సాంస్కృతిక అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. కవితాంశం ‘పదండి ముందుకు’. క్లుప్తత, స్పష్టత గల కవితలను 30 లైన్లకు మించకుండా పంపాలి. కవితలు చేతివ్రాతలో గానీ, డిటిపి చేయంచిగాని పంపవచ్చు. కవిత పైన శీర్షిక పేరు మాత్రమే ఉండాలి.

Pages