S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/20/2016 - 04:47

విజయవాడ, మే 19: తెలుగుదేశం.. ప్రజారాజ్యం... కాంగ్రెస్ పార్టీలలో కొనసాగి ప్రస్తుతం వైకాపా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు గురువారం రాత్రి తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పసుపు కండువా కప్పించుకున్నారు.

05/20/2016 - 04:46

హైదరాబాద్, మే 19: ఆంధ్ర రాష్ట్రంలో కాపులను బిసిల్లో చేర్చే విషయమై నియమించిన జస్టిస్ మంజునాత్ కమిషన్ నివేదిక ఎప్పుడు సమర్పిస్తుందని వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కాపుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మంజునాథ్ కమిషన్ పనిని వేగవంతం చేయాలన్నారు.

05/20/2016 - 04:22

ముంబయి, మే 19: దేశీయ స్టాక్ మార్కెట్లు వరసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ రెగ్యులేటర్ సెబి పి-నోట్స్ నిబంధనలను కఠినతరం చేస్తుందన్న భయాలకు తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ జూన్‌లో వడ్డీ రేట్లను పెంచవచ్చన్న ఊహానాలతో బిఎస్‌ఇ సెనె్సక్స్ 305 పాయింట్లు పతనమై రెండు వారాల నిష్ఠస్థాయి అయిన 25,399.72 పాయింట్లకు పడిపోయింది.

05/20/2016 - 04:21

ముంబయి, మే 19: భారత్‌లో తమ శాఖలను దాదాపు సగానికి సగం కుదించనున్నట్లు బ్రిటన్‌కు చెందిన హెచ్‌ఎస్‌బిసి బ్యాంకు గురువారం ప్రకటించింది. బ్యాంకింగ్ లావాదేవీల కోసం ఖాతాదారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు, ప్రత్యేకించి డిజిటల్ ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతుండటంతో స్థిరీకరణ ప్రక్రియలో భాగంగా ఈ చర్య చేపడుతున్నామని హెచ్‌ఎస్‌బిసి బ్యాంకు స్పష్టం చేసింది.

05/20/2016 - 04:19

విజయవాడ, మే 19: కృష్ణానదీ పుష్కరాల సందర్భంగా ఇబ్రహీంపట్నం సమీపాన గోదావరి కృష్ణానదీ సంగమ ప్రదేశాన్ని అద్భుత పర్యాటక ప్రదేశంగా రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు ఆదేశించారు. గురువారం రాత్రి సిఎంఓలో పదికిపైగా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పుష్కర ఏర్పాట్లను సమీక్షించారు. పుష్కర పనులు నత్తనకడన నడుస్తుండటంపై సమీక్ష ప్రారంభంలోనే ఇంజనీర్లపై సిఎం ఆగ్రహం చెందారు.

05/20/2016 - 04:17

హైదరాబాద్, మే 19: రెండు రోజుల్లో మీతో ఒక పెద్ద వార్త పంచుకుంటాను అని రెండు రోజుల క్రితం ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్‌లో పేర్కొనడం చర్చనియాంశంగా మారింది. మీడియాలో కొందరు బిగ్ న్యూస్ అనే పదాన్ని సంచలన వార్త అని అనువాదం చేయడంతో రాజకీయంగా ఏదైనా జరుగుతుందేమో అంటూ సామాజిక మాధ్యమాల్లో బోలెడు చర్చ జరిగింది. అయతే ఏమిటా బిగ్ న్యూస్? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారో చెబుతారా?

05/20/2016 - 04:14

రాజమహేంద్రవరం, మే 19: గిరిజన ఉత్పత్తులకు రాష్ట్రంలో డిమాండ్ అధికంగా ఉందని, అయితే దానికి ఆస్థాయిలో ఉత్పత్తి మాత్రం లేదని, ఉత్పత్తి పెంచి కార్పొరేట్ స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి రాష్ట్ర గిరిజన సహకార సంస్థ కృషి చేస్తోందని ఆ సంస్థ వైస్-్ఛర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జిఎస్‌పిఎస్ రవిప్రకాష్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

05/20/2016 - 04:12

న్యూఢిల్లీ, మే 19: అసోం, కేరళ రాష్ట్రాల్లో ఓటమిని చవిచూసిన కాంగ్రెస్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వం మరోసారి ప్రశ్నార్థకం కావటంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాహుల్ నాయకత్వంలో బతికి బట్టకట్టగలుగుతామా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రాహుల్ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేశారు.

05/20/2016 - 04:09

న్యూఢిల్లీ, మే 19: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)కి చెందిన ఐదు అనుబంధ బ్యాంకుల ఉద్యోగులు శుక్రవారం సమ్మె నిర్వహించనున్నారు. మాతృ సంస్థలో తమ బ్యాంకులను విలీనం చేయాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఈ సమ్మె చేపడుతున్నట్లు వారు స్పష్టం చేశారు.

05/20/2016 - 04:09

న్యూఢిల్లీ, మే 19: దేశంలో వస్తు వినిమయం క్రమేణా పెరుగుతుండటంతో ప్రస్తుత సంవత్సరంతో పాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికాభివృద్ధి రేటు 7.5 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మూడీస్ ఇనె్వస్టర్ సర్వీస్ గురువారం వెల్లడించింది. అయితే ప్రైవేటు పెట్టుబడులు నిలకడగా పెరగడంపైనే ఇది ఆధారపడి ఉంటుందని మూడీస్ స్పష్టం చేసింది.

Pages