S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/20/2016 - 03:37

పుదుచ్చేరి, మే 19: అసోం, కేరళలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి చిన్న కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో భాగస్వామ్య పక్షమైన డిఎంకెతో కలిసి అధికారంలోకి రావడం కాస్త ఊరట కలిగించే అంశం. 30 స్థానాలు గల అసెంబ్లీలో కాంగ్రెస్-డిఎంకె కూటమి 17 స్థానాలు గెలుచుకొని సాధారణ మెజారిటీని సంపాదించింది.

05/20/2016 - 03:35

న్యూఢిల్లీ, మే 19: కేరళలో వామపక్ష (ఎల్‌డిఎఫ్) కూటమిని గెలుపు చరిత్రాత్మకమని, బెంగాల్‌లో ఓటమిపై సమిక్షించుకుంటామని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై గురువారం ఢిల్లీలో సిపిఎం ప్రధాన కార్యలయంలో ఏచూరి మాట్లాడుతూ ఎల్‌డిఎఫ్ కూటమిని కేరళలో ప్రజలు ఆదరించారని తెలిపారు.

05/20/2016 - 03:34

న్యూఢిల్లీ, మే 19: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. అస్సాం, కేరళలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రజల తీర్పును శిరసావహిస్తామని రాహుల్ అన్నారు. ‘ప్రజల తీర్పును వినమ్రంగా స్వాగతిస్తున్నాం.

05/20/2016 - 03:32

న్యూఢిల్లీ, మే 19: రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోవడంతో పాటు మరో రెండు రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో జట్టు కట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బాధ్యత వహించాలనే వాదనను ఆ పార్టీ తోసిపుచ్చింది. ‘ప్రతి ఎన్నికలోనూ ప్రత్యేకమైన అంశాలు పనిచేస్తాయి.

05/20/2016 - 03:17

న్యూఢిల్లీ, మే 19: అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో బిజెపి, అన్నా డిఎంకె, డిఎంకె, తృణమూల్ కాంగ్రెస్, వాపపక్షాలతో పాటు కాంగ్రెస్ కూడా కొత్త చరిత్రను సృష్టించింది. అసోంలో భారీ మెజారిటీతో మొదటిసారి అధికారంలోకి రావటంతో పాటు కేరళ, పశ్చిమబెంగాల్‌లో తన ఖాతాలను తెరవటం ద్వారా బిజెపి కొత్త రాజకీయ చరిత్రకు శ్రీకారం చుట్టింది. పశ్చిమబెంగాల్‌లో బిజెపి ఏడు సీట్లు, కేరళలో ఒక సీటు గెలిచింది.

05/20/2016 - 03:13

గౌహతి, మే 19: పదిహేనేళ్లుగా తిరుగులేని అధికారాన్ని అనుభవించిన తరుణ్‌గొగోయ్ పాలనకు అసోం ప్రజలు స్వస్తి పలికారు. ఈశాన్య భారతంలో మొట్టమొదటిసారి మోదీ బృందానికి బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారాన్ని అప్పజెప్పారు. అసోం అసెంబ్లీలోని 126 స్థానాల్లో మొత్తం బీజేపీ దాని మిత్రపక్షాలు ఏకంగా 86స్థానాల్లో విజయాన్ని నమోదు చేసి అద్భుతం సృష్టించాయి.

05/20/2016 - 03:11

కోల్‌కతా, మే 19: ప్రభుత్వ వ్యతిరేత, ప్రతిపక్షాలయిన వామపక్షాలు, కాంగ్రెస్ చేతులు కలపడంలాంటి ప్రతికూల పవనాలకు ఎదురొడ్డి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మూడింట రెండు వంతుల భారీ మెజారిటీని సాధించి మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకుంది. గురువారం ప్రకటించిన ఫలితాల్లో 294 స్థానాలున్న అసెంబ్లీలో ఆ పార్టీ 211 స్థానాలను దక్కించుకుంది.

05/20/2016 - 03:09

చెన్నై, మే 19: తమిళనాడు ప్రజలు చరిత్ర సృష్టించారు. మూడు దశాబ్దాల తరువాత అధికారంలో ఉన్న పార్టీకి రెండోసారి పాలించే అవకాశాన్ని అందించారు. గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాలలో పురచ్చితలైవి జయలలిత దరహాసం వెల్లివిరిసింది. 232 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత నేతృత్వంలోని అన్నాడిఎంకే 134 స్థానాలను కైవసం చేసుకుంది.

05/20/2016 - 03:06

యానాం, మే 19: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో యానాం నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు వరుసగా ఐదోసారి ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, ఎన్నార్ కాంగ్రెస్ అభ్యర్థి తిరుకోటి భైరవస్వామిపై 8,762 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

05/20/2016 - 03:03

విజయవాడ , మే 19: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిన నేతలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. అస్సాంలో అధికారాన్ని సాధించినందుకు, ఎన్నికలు జరిగిన ఇతర రాష్ట్రాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచుకొని, మెరుగైన ఫలితాలను సాధించినందుకు ప్రధాని నరేంద్రమోదీని, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాను చంద్రబాబు అభినందించారు.
జయలలితతో మాట్లాడిన ఏపి సిఎం

Pages