S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/20/2016 - 03:01

తిరువనంతపురం, మే 19: కేరళలో సిపిఎం నేతృత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని అధికార యుడిఎఫ్ కూటమిని చిత్తుచేసి తిరిగి అధికారాన్ని దక్కించుకుంది. దీంతో ఒక సారి గెలిచిన కూటమి మరోసారి గెలవకపోవడం అనే ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ రాష్ట్రంలో మరోసారి పునరావృతమైంది.

05/20/2016 - 02:45

హైదరాబాద్, మే 19: ‘ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడితే సహించం. అక్రమాలు జరిగాయని, అవినీతి పాలనని నోటికొచ్చినట్టు మాట్లాడితే పరువు నష్టం దావా వేసి కోర్టుకీడుస్తాం’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. చేసిన ఆరోపణలను నిరూపించనైనా నిరూపించాలి. లేనిపక్షంలో శిక్షనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి.

05/20/2016 - 02:33

హైదరాబాద్, మే 19:ప్రపంచ ప్రఖ్యాత యాపిల్ కంపెనీ హైదరాబాద్‌లో గురువారం మాప్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించింది. యాపిల్ సిఇఓ టిమ్ కుక్, ముఖ్యమంత్రి కెసిఆర్, ఐటి మంత్రి కెటిఆర్, అధికారులు, ఐటి కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నానక్‌రామ్‌గూడలోని వేవ్ రాక్‌లో యాపిల్ సంస్థ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.

05/20/2016 - 02:30

హైదరాబాద్, మే 19:హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బూమ్ మరోసారి బహిర్గతమైంది. టిఎస్‌ఐఐసి ద్వారా నిర్వహించిన ప్రభుత్వ భూముల వేలంలో నగరంలోని పలుచోట్ల పారిశ్రామిక, గృహ అవసరాల కోసం అమ్మిన భూమి గరిష్ట ధర పలికింది. ఖానామెట్‌లో ఎకరానికి 29 కోట్ల రూపాయల ధర పలికింది. కున్ మోటారెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 29 కోట్ల రూపాయల ధరతో రెండెకరాల స్థలం కొనుగోలు చేసింది.

05/20/2016 - 02:36

దిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పులనే ఇచ్చారు. అసోంలో తొలిసారి బిజెపికి పట్టం కట్టి చరిత్రను తిరగరాశారు. పదిహేనేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీని సాగనంపారు. కేరళలో తొలిసారిగా బిజెపి ఖాతాతెరవడం మరో కీలక పరిణామం. జయ ఇంటికేనన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నివ్వెరపోయేలా అన్నాడిఎంకెను మళ్లీ అధికారంలోకి తెచ్చారు.

05/20/2016 - 02:18

కైరో, మే 19: పారిస్ నుంచి కైరో వెళుతున్న ఈజిప్ట్ ఎయిర్ విమానం మధ్యధరా సముద్ర ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో 26మంది విదేశీయులు సహా 66మంది ప్రయాణికులు మరణించారు. ఈజిప్టు ఎయిర్‌స్పేస్‌లోని రాడార్ స్క్రీన్లనుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఈ విమానం కనిపించకుండా పోయిందని విమానయాన అధికారులు తెలిపారు.

05/20/2016 - 02:13

విశాఖపట్నం/విజయవాడ, మే 19: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రోను తుపాను గురువారం రాత్రికి విశాఖకు నైరుతి దిశలో 240 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు.

05/20/2016 - 02:08

ఖమ్మం, మే 19: పాలేరు ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఘన విజయం సాధించారు. గురువారం జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాంరెడ్డి సుచరితారెడ్డిపై 45,682 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తుమ్మల నాగేశ్వరరావుకు 94,940 ఓట్లు రాగా సుచరితారెడ్డికి 49,258 ఓట్లు వచ్చాయి.

05/20/2016 - 02:44

విజయవాడ, మే 19: సాంకేతికతను వినియోగించుకుంటూ రాష్ట్రంలో మరింత సమర్ధవంతగా, వేగవంతంగా సేవలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ దిశగా గురువారం విజయవాడలోని తన కార్యాలయంలో జరిగిన ఐటి శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో పాలనపరంగా తీసుకోవాల్సిన సాంకేతిక మార్పులపై చర్చించారు.

05/20/2016 - 02:03

గుంటూరు, మే 19: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూ సమీకరణలో పాల్గొన్న రైతులకు ప్లాట్ల పంపిణీ ఇప్పట్లో సాధ్యపడేలాలేదు. రైతుల అభ్యంతరాలకు గడువు శుక్రవారంతో ముగియనుంది. ప్లాట్ల పంపిణీపై గ్రామాలవారీగా అవగాహన కార్యక్రమాలను సీఆర్డీఏ అధికారులు నిర్వహించారు. అయితే రైతులు అప్పట్లో కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు.

Pages