S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/20/2016 - 00:42

ప్రజాస్వామ్యాన్ని రక్షించమంటూ ఇటీవల ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభలో‘‘ఎన్డీయే ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తోంది, నాగపూర్ నుంచి ఆర్‌ఎస్‌ఎస్ రిమోట్‌తో ప్రభుత్వాన్ని నడుపుతోంది’’ అంటూ సోనియా,‘‘దేశాన్ని ఇద్దరే పాలిస్తున్నారు. వారు మోదీ, మోహన్ భాగవత్’’2 అంటూ రాహుల్ ద్వ జం ఎత్తడం గురివిందలు తమ నలుపెరుగని చందంగా ఉంది.

05/20/2016 - 00:13

నిజామాబాద్, మే 19: నాసిరకం విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల విక్రయాలు జరిపే ప్రైవేట్ డీలర్ల గుట్టును కనుగొని రైతులు నష్టపోకుండా నిలువరించడంలో విజిలెన్స్ శాఖ అధికారుల పాత్ర ఎంతో కీలకమైనప్పటికీ, ఆ దిశగా జిల్లాలో చర్యలు చేపడుతున్న దాఖలాలు కనిపించడం లేదు.

05/20/2016 - 00:12

నిజామాబాద్, మే 19: ఎన్నిక ఏదైనా తెరాసదే విజయం అన్న చందంగా ఇటీవలి కాలంలో వరుస విజయాలతో జోరు మీదున్న అధికార పార్టీ నేతలకు తాజాగా ఖమ్మం జిల్లా పాలేరులోనూ రికార్డు స్థాయి మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించడం మరింత ఉత్సాహాన్ని అందించింది.

05/20/2016 - 00:12

ఆర్మూర్, మే 19: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన బాలుడు విశాల్ కిడ్నాప్‌కు గురై మెట్‌పల్లి మండలం రామలచ్చక్కపేటలో గురువారం ప్రత్యక్షమయ్యాడు. ఇంటి పక్కన నివాసం ఉండే వేముల శంకర్ బాలుడిని కిడ్నాప్ చేయగా అతనిపై మెట్‌పల్లి పోలీసులు కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి ఓం ప్రకాష్, కవిత దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం ఆర్మూర్‌కు వలసవచ్చారు.

05/20/2016 - 00:11

నిజామాబాద్, మే 19: కొలువుల క్రమబద్ధీకరణ కోసం గత ఎంతోకాలం నుండి ఎదురుతెన్నులు చూస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియలో మరో అడుగు ముందుకుపడింది. గురువారం జిల్లాలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్న 293మంది అధ్యాపకుల ఒరిజినల్ సర్ట్ఫికెట్లను ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా నియమించిన కమిటీ పరిశీలన జరిపింది.

05/20/2016 - 00:10

మాచారెడ్డి, మే 19: ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కుల ప్రస్తావన తేవడం అర్థరహితమని కలెక్టర్ యోగితా రాణా అన్నారు. మండలంలోని మంథని దేవునిపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం మానవ వనురుల అభివృద్ధి ప్రణాళిక అమలుపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఈ సందర్భంగా మార్పు, అమ్మ ఒడి కార్యక్రమం అమలుపై చర్చ కొనసాగింది.

05/20/2016 - 00:10

నిజాంసాగర్, మే 19: తెలంగాణ ప్రభుత్వం ఎంతోప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకం కింద మంజూరైన చెరువు పనులలో నాణ్యత లోపించకుండా నిర్మించాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఇంజనీరింగ్ అధికారులకు, సంబందిత కాంట్రాక్టర్‌లకు ఆదేశించారు. గురువారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీటిపారుదల అతిథిగృహంలోఐదు మండలాల ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్‌లతోసమావేశం నిర్వహించారు.

05/20/2016 - 00:09

బోధన్ రూరల్, మే 19: బోధన్ మండలంలో గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు అతివేగంతో కూడుకున్న ఈదురు గాలుల వర్షం ఇరవై నిముషాల పాటు బీభత్సాన్ని సృష్టించింది. అనేక గ్రామాలలో ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంబాలు విరిగిపోయాయి. ఆచన్‌పల్లి శివారులో ఆర్టీసి బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. అతివేగంతో వీచిన ఈదురు గాలులకు ఆచన్‌పల్లి శివారు వద్ద ఓ భారీ వృక్షం నేలకొరిగింది.

05/20/2016 - 00:09

బోధన్, మే 19:చర్చల పేరిట హైదరాబాద్‌కు పిలిపించి ఎటువంటి చర్చలు జరుపకుండా తమను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదంటూ ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ గురువారం డెక్కన్ సుగర్స్ కార్మికులు రాస్తారోకో చేపట్టారు. తమను ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు.

05/20/2016 - 00:07

నల్లగొండ టౌన్, మే 19: దేశంలో బిజెపి సంఘపరివార్ మత విద్వేష కార్యక్రమాలకు ఆజ్యం పోస్తుందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అనడం అర్థరహితమని, అది ఆయన అవివేకానికి నిదర్శనమని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తి అన్నారు.

Pages