S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 02:18

నేలకొండపల్లి, మే 17: ఉత్కంఠబరితంగా జరిగిన పాలేరు ఉప ఎన్నికల భవితవ్యంపై మహిళలపైనే ఆధారపడి ఉంది. ఈ మండలంలో మహిళలు పురుషుల కంటే అధికంగా ఓటు వేసి తమ చైతన్యాన్ని తెలియజేశారు. మండలంలోని మొత్తం 42,036 మంది ఓటర్లు ఉండగా వారిలో 38,152 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా వీరిలో పురుషులు 18,726 మంది, స్ర్తిలు 19,428 మంది తమ ఓటును వినియోగించుకున్నారు.

05/18/2016 - 02:17

ఖానాపురం హవేలి, మే 17: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 19వ తేదీన జరిగే తెలంగాణ రాష్ట్ర ఐసెట్ పరీక్షకు ఖమ్మం జిల్లాలో 9 పరీక్షా కేంద్రాల్లో 4396మంది అభ్యర్థులు హాజరుకానున్నారని యూనివర్సిటీ పిజి కళాశాల ప్రిన్సిపాల్, పరీక్ష కో ఆర్డినేటర్ మాలోజి పుష్పలత పేర్కొన్నారు.

05/18/2016 - 02:16

భద్రాచలం, మే 17: ఐదవ షెడ్యూల్డ్ భూభాగం ఆదివాసీల ప్రాంతం కాబట్టి నూతన జిల్లాల ఏర్పాటులో మొదటిగా ప్రభుత్వం భద్రాచలం ఆదివాసీ జిల్లాను ఏర్పాటు చేయాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకురాలు కెచ్చెల కల్పన డిమాండ్ చేశారు. భద్రాచలం ఆదివాసీ జిల్లా సాధనకై జీఎస్పీ, జీవీఎస్పీ, ఏటీఎఫ్ ఆధ్వర్యంలో ఐటీడీఏ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను ఆమె ప్రారంభించి మాట్లాడారు.

05/18/2016 - 02:15

గుంటూరు, మే 17: అపాచీ బూట్ల కంపెనీకి గతంలో కేటాయించిన 56 ఎకరాల భూమిని కబ్జాచేసేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు పావులు కదుపుతున్నారు.. ఈ కంపెనీ శాఖ ఏర్పాటుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం పొత్తూరు వద్ద భూములు కేటాయించింది. అయితే నగరపాలక సంస్థ డంపింగ్ యార్డు చేరువలో ఉన్నందున అక్కడ కంపెనీ స్థాపించలేమని అపాచీ యాజమాన్యం అప్పట్లో తేల్చిచెప్పింది. ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంది.

05/18/2016 - 02:14

గుంటూరు (పట్నంబజారు), మే 17: సాగు, మంచినీటి కోసం ఏ పోరాటానికైనా, ఎంతటి త్యాగానికైనా సిద్ధమని వైసిపి రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి స్పష్టంచేశారు. కృష్ణానదిలో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను నిరసనగా వైసిపి అధినేత జగన్ కర్నూలు వేదికగా చేపట్టిన జలదీక్షకు మద్దతుగా వైసిపి నగర విభాగం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట దీక్ష నిర్వహించారు.

05/18/2016 - 02:13

తెనాలి, మే 17: తెనాలి వైద్యశాలకు సంబంధించిన గణాంకాలను కాకిలెక్కలు చూపుతూ అసత్యాలను ఆన్‌లైన్‌లో పొందుపురుస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా గణాంకాధికారి నాగమల్లేశ్వరావు పిహెచ్‌సి, తెనాలి జిల్లా వైద్యశాల సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం తెనాలి జిల్లా వైద్యశాలలో వైద్యులు, క్లస్టర్ పరిధిలోని ఆరోగ్య సిబ్బంది, వైద్యులతో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

05/18/2016 - 02:13

గుంటూరు (కొత్తపేట), మే 17: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ - ఉపాధ్యాయుల పాత్ర అనే అంశంపై జిల్లా విద్యాసదస్సు టిఎన్‌యుఎస్ రాష్ట్ర కన్వీనర్ ఎ మోహనరావు అధ్యక్షతన జరిగింది.

05/18/2016 - 02:12

యడ్లపాడు, మే 17: మండల పరిధిలోని లింగారావుపాలెంలోని నాలుగు గృహాల్లో ఒకేరోజు చోరీలు జరిగాయి. ఇద్దరు యజమానులు తమ వారిని అమెరికా పంపేందుకు హైదరాబాదు వెళ్లగా మరో రెండు కుటుంబాల వారు షిరిడియాత్రలో ఉన్నారు. ఆదివారం రాత్రి జరిగి ఉండవచ్చని గ్రామస్థులు, పోలీసులు భావిస్తున్న ఈ చోరీలు మంగళవారం వెలుగులోకి వచ్చాయి.

05/18/2016 - 02:12

పెదకూరపాడు, మే 17: విద్యార్థులు తమ లక్ష్యసాధనకై ప్రణాళికతో ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సూచించారు. పెదకూరపాడులోని దివంగత ఎస్‌ఎం లాల్‌జాన్‌బాషా షాదీఖానాలో మంగళవారం అడ్వకేట్ షేక్ బాలిసైదా పర్యవేక్షణలో స్థానిక ముస్లిం డెవలప్‌మెంట్ సొసైటీ వారిచే కెరీర్ గైడెన్స్ అవగాహనపై సదస్సు జరిగింది.

05/18/2016 - 02:11

గుంటూరు (కొత్తపేట), మే 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ స్టాక్ పాయింట్ల వద్ద పనిచేస్తున్న కార్మికులకు కూలిరేట్లు పెంచాలంటూ సివిల్ సప్లైస్ హమాలీ కార్మికులు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. కలెక్టరేట్ పరిపాలనా అధికారికి వినతిపత్రం అందజేశారు.

Pages