S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/02/2016 - 14:50

ఖమ్మం: తెలంగాణలో వైకాపా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. ఆ పార్టీకి చెందిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెరాసలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. ఎంపీ పొంగులేటి తన అనుచరులు, వైకాపా కార్యకర్తలతో సోమవారం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశం ముగిసిన వెంటనే ఆయన తన కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

05/02/2016 - 14:50

కరీంనగర్: తెలంగాణకు కృష్ణా, గోదావరి నదుల నుంచి గతంలో కేటాయించిన విధంగానే 1,300 టీఎంసీల నీటిని ఆరునూరైనా వాడుకుని తీరతామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఆయన సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన సందర్భంగా మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలోనే తెలంగాణకు 1,300 టిఎంసీలను కేటాయించారని గుర్తు చేశారు.

05/02/2016 - 14:49

దిల్లీ: డీజిల్, పెట్రోల్‌కు బదులు గ్యాస్ (సిఎన్‌జి)తో నడిచే ట్యాక్సీలను మాత్రమే రోడ్లపై అనుమతించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలు అమలులోకి రావడంతో దిల్లీలో సోమవారం నాడు క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. గ్యాస్‌తో నడిచేలా ట్యాక్సీలను మార్చుకునేందుకు ఇచ్చిన గడువు గత నెల 30తో ముగిసినందున సుప్రీం ఆదేశాలు మే 1 నుంచి అమలులోకి వచ్చాయి.

05/02/2016 - 14:49

హైదరాబాద్: కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు దండుకునేందుకే తెరాస ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు డిజైన్లను మారుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ఆరోపించారు. ఆమె సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయకుండా డిజైన్ల మార్పు పేరుతో తెరాస నేతలు కాసులు దండుకుంటున్నారని అన్నారు. పాలమూరు ప్రాజ్టెక్టు వ్యయాన్ని అనూహ్యంగా పెంచడంలో అంతరార్థం ఇదేనని అన్నారు.

05/02/2016 - 14:48

విశాఖ: రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు విశాఖలో వెంటనే రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక డిమాండ్ చేసింది. ఈమేరకు ట్విట్టర్‌లో సందేశాలను పోస్ట్ చేసినట్లు వేదిక ప్రతినిధులు తెలిపారు.

05/02/2016 - 14:48

కరీంనగర్: కాళేశ్వరంలోని ముక్తీశ్వర ఆలయాన్ని తెలంగాణ సిఎం కెసిఆర్ దంపతులు సందర్శించి అర్చనలు జరిపారు. వీరికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో కెసిఆర్ దంపతులు బంగారు కిరీటం, పట్టువస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత కనే్నపల్లి వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌస్ నిర్మాణానికి సిఎం భూమిపూజ చేశారు.

05/02/2016 - 14:47

దిల్లీ: మెడికల్ కోర్సులో ప్రవేశానికి కేంద్రం నిర్వహించే ‘నీట్’ (జాతీయ స్థాయి అర్హత పరీక్ష) నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి. ఆర్టికల్ 370 అమలులో ఉన్నందున ఇతర రాష్ట్రాల వారికి మెడికల్ సీట్లను కేటాయించడం కుదరదని ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు కోర్టుకు నివేదించాయి.

05/02/2016 - 14:47

నైనిటాల్: ఉత్తరాఖండ్‌లోని మూడు జిల్లాల పరిధిలోని అడవుల్లో వ్యాపించిన మంటలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 450 ప్రాంతాల్లో మంటలు వ్యాపించి వేలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం దగ్ధమైంది. 70 శాతం మేరకు మంటలు అదుపులోకి వచ్చాయని, ఒకటి రెండు రోజుల్లో మంటల్ని ఆర్పివేస్తామని ఎన్‌డిఆర్‌ఎఫ్ అధికారులు సోమవారం తెలిపారు.

05/02/2016 - 14:46

దిల్లీ: అగస్టా-వెస్ట్‌ల్యాండ్ వివిఐపీ హెలికాప్టర్ల కొనుగోలులో ముడుపులు అందినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న భారత వైమానిక దళం మాజీ అధిపతి త్యాగిని సోమవారం నాడు సిబిఐ అధికారులు ప్రశ్నించారు. హెలికాప్టర్ల కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు ఇటీవల ఇటలీ కోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తీర్పులో త్యాగి పేరును ప్రస్తావించడంతో ఆయన నుంచి వివరాలు రాబట్టాలని సిబిఐ యత్నిస్తోంది.

05/02/2016 - 11:59

విజయవాడ: రాష్ట్రాన్ని దోచుకోవాలన్న ధ్యాస తప్ప ప్రజాసేవ చేయాలన్న ఆలోచన వైఎస్ జగన్‌కు ఏనాడూ లేదని ఎపి మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఈ కారణంనే గత ఎన్నికల్లో జగన్‌ను ప్రజలు తిరస్కరించారన్నారు. జగన్ వైఖరి వల్లే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు వలసపోతున్నారని, వైకాపా నడిసముద్రంలో మునిగిపోతున్న నావ అని ఆయన వ్యాఖ్యానించారు.

Pages