S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/02/2016 - 07:11

రాజ్‌కోట్, మే 1: స్పిన్నర్ అక్షర్ పటేల్ అద్భుత ప్రతిభ గుజరాత్ లాయన్స్‌పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు విజయాన్ని సాధించిపెట్టింది. కెప్టెన్ మురళీ విజయ్ అర్ధ శతకంతో పంజాబ్‌ను ఆదుకోగా, గుజరాత్ తరఫున జేమ్స్ ఫాల్క్‌నెర్ ఒంటరి పోరాటం సాగించినా ఫలితం లేకపోయింది. అంతకు ముందు గుజరాత్ ‘మిస్టీరియస్ స్పిన్నర్’ శివిల్ కౌశిక్ 3 వికెట్లు పడగొట్టి పంజాబ్‌ను కట్టడి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

05/02/2016 - 07:10

హైదరాబాద్, మే 1: తమ జట్టు సమతూకంగా ఉందని, అన్ని విభాగాల్లోనూ రాణించగలుగుతున్నామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. శనివారం రాత్రి వర్షం కారణంగా ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్‌లో బలమైన ప్రత్యర్థి రాయల్ చాలెంజర్స్ బెంగళూరును 15 పరుగుల తేడాతో ఓడించడంతో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని అన్నాడు.

05/02/2016 - 07:10

ఉహాన్ (చైనా), మే 1: ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో లీ చాంగ్ వెయ్, మహిళల సింగిల్స్‌లో వాంగ్ ఇహాన్ విజేతలుగా నిలిచారు. ఫైనల్‌లో చాంగ్ వెయ్ 21-17, 15-21, 21-13 స్కోరుతో చెన్ లాంగ్‌ను ఓడించాడు. ఈ మ్యాచ్ మొదటి రెండు సెట్లు హోరాహోరీగా సాగినా, చివరిదైన మూడో సెట్‌లో చాంగ్ వెయ్ అసాధారణ ప్రతిభ కనబరిచి, విజయభేరి మోగించాడు.

05/02/2016 - 07:09

బెంగళూరు, మే 1: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి సోమవారం హోం గ్రౌండ్‌లోనే పరీక్ష ఎదురుకానుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవడానికి బెంగళూరు సర్వశక్తులు ఒడ్డి పోరాడాల్సిన అవసరం ఎర్పడింది. నైట్ రైడర్స్ ఇప్పటి వరకూ ఏడు మ్యాచ్‌లు ఆడి, నాలుగు విజయాలను నమోదు చేసింది. మూడు పరాజయాలను ఎదుర్కొంది.

05/02/2016 - 07:01

న్యూఢిల్లీ, మే 1: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ఆధారంగా ట్రేడ్ అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చి వ్యవధికిగాను హెచ్‌డిఎఫ్‌సి, హీరో మోటోకార్ప్, అదానీ పోర్ట్స్ తదితర కీలక సంస్థలు ఈ వారం తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి.

05/02/2016 - 06:59

విజయవాడ, మే 1: దేశ చరిత్రలో ఏ ప్రధాన మంత్రి, ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు తమ పేర్లతో ప్రభుత్వ పథకాలు ప్రారంభించిన దాఖలాలు లేవు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం తొలుత రంజాన్, సంక్రాంతి, క్రిస్‌మస్‌కు చంద్రన్న కానుకలు అందించగా, మొన్న చంద్రన్న సంచార ఆరోగ్య రథం పథకానికి, మేడే సందర్భంగా నిన్న చంద్రన్న బీమా పథకాన్ని తన చేతులు మీదుగానే ప్రారంభించి చరిత్ర సృష్టించారు.

05/02/2016 - 06:58

లండన్, మే 1: నకిలీ ఉత్పత్తుల వాణిజ్యంలో భారత్.. ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. విదేశాలకు భారత్ నుంచి నకిలీ వస్తువులు ఎగుమతి అవుతున్నాయని ఆర్గనైజేషన్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఒఇసిడి), ఐరోపా యూనియన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. అయితే ఈ విషయంలో పొరుగు దేశం చైనా భారత్‌కే కాదు, ఏ దేశానికి అందనంత స్థాయిలో ఉండటం గమనార్హం.

05/02/2016 - 06:57

హైదరాబాద్, మే 1: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బిహెచ్) నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో గతంతో పోల్చితే 43.2 శాతం క్షీణించి 253 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో 445.5 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది.

05/02/2016 - 06:57

న్యూఢిల్లీ, మే 1: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రతికూల తల మధ్య కూడా దేశీయ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు పోటెత్తుతు న్నాయ. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన విదేశీ పోర్ట్ఫోలి యో మదుపరులు (ఎఫ్‌పిఐ).. మలి రెండు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టిస్తున్నారు. మార్చిలో షేర్ల కొనుగోళ్లకు విశేషంగా ఆసక్తి కనబరిచిన మదుపరులు..

05/02/2016 - 06:50

బలియా, మే 1: దేశంలో అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఢంకాను ప్రధాని నరేంద్ర మోదీ మోగించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఐదుకోట్ల పేద కుటుంబాలకు ఉచితంగా ఎల్‌పిజి కనెక్షన్లను అందించే ఎనిమిదివేల కోట్ల రూపాయల భారీ పథకాన్ని ఆదివారం నాడిక్కడ ప్రారంభించారు.

Pages