S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/02/2016 - 07:24

మచిలీపట్నం, మే 1: జిల్లా చరిత్రలోనే మరపురాని ఘట్టంగా కృష్ణా పుష్కరాలు మిగిలిపోనున్నాయని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మండల పరిధిలోని పెద యాదర, సత్యనారాయణపురం గ్రామాల్లో రూ.5.40 కోట్ల అంచనాలతో చేపట్టిన పుష్కర నిర్మాణ పనులను పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావుతో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు.

05/02/2016 - 07:24

మచిలీపట్నం, మే 1: విహారయాత్ర తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సరదాగా స్నేహితులతో కలిసి మంగినపూడి బీచ్‌కు వచ్చిన ఐదుగురు యువకుల్లో ఇద్దరిని సముద్రం మింగేసింది. మిగిలిన ముగ్గురిని స్థానికంగా ఉన్న మత్స్యకారులు రక్షించటంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

05/02/2016 - 07:21

హైదరాబాద్, మే 1: రాజధాని నగరంలో రోజురోజుకు పెరుగుతున్న నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంకుడు గుంతల ఏర్పాటు ప్రక్రియ ఉత్తమమైనదే అయినా ప్రజలలో పూర్తి స్ధాయిలో అవగాహన కల్పించలేక పోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అంబర్‌పేట నియోజకవర్గంలో ఎక్కడ చూసినా భవనాలు ఉండటంతో పడిని వర్షపునీరు చుక్కకూడా భూమి లోపలకు ఇంకే పరిస్ధితులు కల్పంచడం లేదు.

05/02/2016 - 07:21

సికింద్రాబాద్, మే 1: తెరాస ప్రభుత్వం పేదలకు నిర్మించ తలపెట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం సికింద్రాబాద్ వాసులు అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. తమకు అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందో, మంత్రివర్యులు నిర్మాణాలకు ఎప్పుడు శంకుస్థాపనలు చేస్తారోనని ఎదురుచూస్తున్నారు.

05/02/2016 - 07:20

కెపిహెచ్‌బి కాలనీ, మే 1: భూగర్బ జలాల పెంపునకు ఇంకుడు గుంతలను తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలని వివేకానందనగర్ డివిజన్ టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మాధవరం రామారావు అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని శాంతినగర్‌లో ఏర్పాటు చేయనున్న ఇంకుడు గుంతల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నీటి నిలవలను పెంచవచ్చన్నారు.

05/02/2016 - 07:19

హైదరాబాద్, మే 1: అధిక వడ్డీతో ప్రజలను నమ్మిస్తూ, చీటీలు నిర్వహిస్తున్న ఓ వ్యాపారి చిట్టీల సొమ్ముతో ఉడాయించిన సంఘటన నేరెడ్‌మెట్ డిఫెన్స్ కాలనీలో చోటు చేసుకుంది. అధిక కమిషన్ వస్తుందంటూ కొనే్నళ్లుగా చిట్స్ నిర్వహిస్తున్న స్థానిక వ్యాపారి అరుణారెడ్డి, ప్రజల నుంచి చిట్స్ పేరుతో సేకరించిన రూ. 10 కోట్లతో ఆమె భర్త రఘునాథ్ రెడ్డి ఆదివారం ఉదయం కనిపించకుండా పోయారు.

05/02/2016 - 07:18

హైదరాబాద్, మే 1: ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు బాల కార్మికులకు విముక్తి కలిగింది. పాతబస్తీ, రంగారెడ్డి జిల్లాలోని పలు పరిశ్రమల్లో పెద్ద ఎత్తున బాలకార్మికులు పనిచేస్తున్నట్టు చైల్డ్, ఉమెన్ వెల్ఫేర్ అధికారులు దాడులు నిర్వహించారు.

05/02/2016 - 07:18

ముషీరాబాద్, మే 1: మెట్రో కారిడార్ మార్గాలు ప్రమాదాలకు రాస్తాలుగా మారుతున్నాయి. ప్రదాన కారిడార్ మార్గాలలో పిల్లర్ల నిర్మాణాలు పూర్తయినా సమస్యలు తప్పటం లేదు. రోడ్డు విస్తరణ కోసం కూల్చివేతలు జరిగి స్థల సేకరణ జరిగినా విస్తరణ పనులు పూర్తికావటం లేదు. విస్తరణ పనులలో భాగంగా ప్యాచ్ వర్క్ పనులు నత్తకే నడక నేర్పేవిదంగా మారాయి. ఫలితంగా ట్రాఫికర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి.

05/02/2016 - 07:17

సికింద్రాబాద్, మే 1: పోలీసులతో పాటు పౌరులు కూడా స్వచ్ఛందంగా తమ బాధ్యతలను నిర్వహించాల్సిన అవసరం ఉందని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ నియోజకవర్గం నార్త్‌జోన్ పరిధిలోని తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలతోపాటు ఆధునీకరించిన పోలీస్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు.

05/02/2016 - 07:14

లండన్, మే 1: భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ ఖాతాలో మరో నాకౌట్ విజయం చేరింది. ఫ్రెంచ్ బాక్సర్ మతియోజ్ రోయర్‌తో జరిగిన ఫైట్‌ను అతను టెక్నికల్ నాకౌట్‌లో ఓడించాడు. ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన తర్వాత విజేందర్‌కు ఇది వరుసగా ఐదో విజయం. ఆరు రౌండ్ల సూపర్ మిడిల్‌వెయిట్ విభాగంలో రోయర్‌తో తలపడిన 30 ఏళ్ల విజేందర్‌ను ఐదో రౌండ్‌లోనే రిఫరీ విజేతగా ప్రకటించాడు.

Pages