S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/02/2016 - 11:50

విజయవాడ: గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న ఎపి వాసులను వెనక్కి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు, ఈ విషయమై వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాసినట్లు మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం తెలిపారు. బోగస్ ఏజెన్సీల ద్వారా విదేశాలకు వెళ్లిన వారు అక్కడ నానా ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి ఏజెన్సీల గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

05/02/2016 - 11:50

విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం సోమవారం ఉదయం ఇక్కడ ప్రారంభమైంది. నీటి ఎద్దడి, రాజధాని నిర్మాణం, భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు, బందరు పోర్టు, రైతులకు రుణమాఫీ, ప్రభుత్వ పాఠశాలల్లో యోగా విధానం, ప్రత్యేక హోదా వంటి విషయాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కొన్ని కీలక నిర్ణయాలను సిఎం ప్రకటించనున్నట్లు సమాచారం.

05/02/2016 - 11:50

విజయవాడ: ఇక్కడి సిఆర్‌డిఎ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) అధికారులతో సిఎం చంద్రబాబు సోమవారం ఉదయం సమావేశమయ్యారు. మున్సిపల్ మంత్రి నారాయణ, సిఆర్‌డిఎ కమిషనర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు ప్లాట్ల కేటాయింపు, రాజధాని నిర్మాణం తదితర విషయాలపై తాజా పరిస్థితిని సిఎం తెలుసుకున్నారు.

05/02/2016 - 11:49

విజయవాడ: ఆగిరిపల్లి మండలం వడ్లమాను వద్ద సోమవారం ఉదయం రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో పాతికమంది బాలలు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

05/02/2016 - 11:49

విజయనగరం: బాడంగి మండల హౌసింగ్ ఎఇ సత్యం ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో సోమవారం ఉదయం ఆయన ఇళ్లపై ఎసిబి అధికారులు దాడులు చేశారు. అక్రమాస్తుల వివరాలు ఇంకా తేలాల్సి ఉంది.

05/02/2016 - 11:48

కరీంనగర్: ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఇక మంచిరోజులు ఖాయమని సిఎం కెసిఆర్ సోమవారం కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సందర్భంగా అన్నారు. కాళేశ్వరం పూర్తయితే ఉత్తర తెలంగాణకు నీటికష్టాలు ఉండవన్నారు. ప్రాజెక్టులను ఎవరూ అడ్డుకోలేరని ఆయన విపక్ష నేతలనుద్దేశించి అన్నారు. ప్రాజెక్టుల విషయమై కాంగ్రెస్ నేతలు ధర్నాలు, ఆందోళనలు చేస్తామనడం అవివేకమన్నారు.

05/02/2016 - 07:27

బెంజిసర్కిల్, మే 1: భవిష్యత్తు తరాల కోసం ఇప్పటి నుంచే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోనికి తీసుకురావడంతో పాటు పెట్టుబడులు వాటి ద్వారా పరిశ్రమలు నెలకొల్పేందుకు శ్రమిస్తున్న మొదడి కార్మికుడిని నేనేనని నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

05/02/2016 - 07:27

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 1: ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలను ఆదివారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన మే డే వేడుకల్లో అరుణ పతాకాలు రెపరెపలాడాయి. ఎవరికి వారు పట్టణంలో భారీ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించి అరుణ పతాకాలను ఎగురవేసి మేడే విశిష్ఠతను తెలియజేశారు.

05/02/2016 - 07:25

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 1: కార్మికుల సంక్షేమమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధ్యేయమని బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా స్థానిక విజయకృష్ణా చైతన్య ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని అరుణ పతాకాన్ని ఎగురవేశారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు.

05/02/2016 - 07:25

కూచిపూడి, మే 1: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అంతర్భాగంగా కూచిపూడిని చేర్చి ఈ గ్రామం పేరును, నాట్యం ఖ్యాతిని ఇనుమడింప చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా అమరావతిని సందర్శించే దేశ, విదేశీ పర్యాటకులు ప్రపంచ ప్రఖ్యాత నాట్యక్షేత్రం కూచిపూడిని సందర్శించేలా ఈ గ్రామాన్ని అవుటర్ రింగ్ రోడ్డులో అంతర్భాగంగా చేర్చినట్లు తెలుస్తోంది.

Pages