S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/13/2016 - 13:09

హైదరాబాద్: సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ బస్సును నడుపుతున్న బిహెచ్‌ఇఎల్ ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. బుధవారం ఉదయం ట్రాఫిక్ పోలీసులు కూకట్‌పల్లి వద్ద తనిఖీలు చేస్తూ సెల్‌లో మాట్లాడుతుండగా డ్రైవర్‌ను పట్టుకున్నారు.

04/13/2016 - 13:08

హైదరాబాద్: కూకట్‌పల్లి ప్రగతినగర్‌లోని కెనరాబ్యాంకు ఎటిఎంలో నగదును చోరీ చేసేందుకు మంగళవారం అర్ధరాత్రి దొంగలు విఫలయత్నం చేశారు. ఎటిఎంను ధ్వంసం చేసినా నగదు లభించకపోవడంతో దొంగలు వెనుదిరిగారు. చోరీకి యత్నించిన వారికోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు.

04/13/2016 - 13:08

చిత్తూరు: జిల్లాలో బుధవారం పోలీసులు దాడులు నిర్వహించి 11 మంది ఎర్ర చందనం స్మగ్లర్లను అరెస్టు చేసి, వారి నుంచి రెండు టన్నుల దుంగలను, 9 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అరెస్టు చేసిన వారిలో ముగ్గురు బడా స్మగ్లర్లు ఉన్నట్లు చెప్పారు.

04/13/2016 - 13:08

హైదరాబాద్: నగరంలోని కుల్సుంపుర కబేళా వద్ద బుధవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో 20 గుడిసెలు కాలిబూడిదయ్యాయి. ఇళ్లలో సామగ్రి, నగదు, బంగారం కాలిపోవడంతో బాధితులు వీధిపాలయ్యారు.

04/13/2016 - 13:07

ఏలూరు: ఇక్కడికి సమీపంలోని వట్లూరు వద్ద బుధవారం ఉదయం విజయవాడ వైపు వెళుతున్న రైలు నుంచి జారిపడి తల్లి (30), కూతురు (6) మరణించారు. ప్రమాదవశాత్తూ వీరు రైలు నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలకు కొద్దిదూరంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న బాలుడిని ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

04/13/2016 - 08:49

నల్లగొండ/మహబూబ్‌నగర్/నిజామాబాద్/ఆదిలాబాద్/కరీంనగర్, ఏప్రిల్ 12: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో వడదెబ్బతో ఎనిమిది మంది మరణించారు.

04/13/2016 - 08:49

హైదరాబాద్, ఏప్రిల్ 12: అమరావతి రాజధాని ప్రాంతంలోని భూములను భూసమీకరణ, భూసేకరణ చట్టం కింద మళ్లీ వర్గీకరించాలని నిర్ణయించినట్లు, రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

04/13/2016 - 08:47

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: దేశంలో పేరుకు పోతున్న లక్షలాది కోట్ల రూపాయల మొండి బకాయిల పట్ల సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వందల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న వ్యక్తులు తమ కంపెనీలు దివాలా తీశాయంటూ తప్పించుకు పారిపోతున్నారని, కానీ, 15వేలు, 20వేలు మేర చిన్న రుణాలు తీసుకున్న పేద రైతులు వేధింపులకు గురవుతున్నారని సుప్రీం కోర్టు చురక వేసింది.

04/13/2016 - 08:45

విజయవాడ, ఏప్రిల్ 12: రాష్ట్రంలో ప్రజలకు, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది, వేధింపులు లేకుండా పన్నులు వసూలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఆదాయ సముపార్జిత శాఖలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.

04/13/2016 - 08:36

పాన్‌గల్, ఏప్రిల్ 12: వడదెబ్బతో భర్త మృతి చెందడంతో అతని అంత్యక్రియలు నిర్వహిస్తుండగా భార్య గుండె ఆగి మృతి చెందింది. ఈ మహబూబ్‌నగర్ జిల్లా పాన్‌గల్ మండల పరిధిలోని గోప్లాపూర్ గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

Pages