S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/10/2016 - 07:30

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరాతి నిర్మాణానికి ఇంతవరకూ ప్రభుత్వం 34,142.74 ఎకరాల భూమిని సేకరించిందని, అందులో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిందే 28,264 ఎకరాలు ఉందని మున్సిపల్ మంత్రి డాక్టర్ పి నారాయణ చెప్పారు. బుధవారం శాసనసభలో ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఇంతవరకూ భూ సమీకరణకు 94 శాతం రైతులు అంగీకరించారని అన్నారు.

03/10/2016 - 07:29

హైదరాబాద్: రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థలను యూనివర్శిటీలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర ప్రభుత్వం నియమించిన సమీక్షా కమిటీ అభిప్రాయపడింది. ఉపాధ్యాయ విద్య, జాతీయ కౌన్సిల్ పనివిధానం, టీచర్ ట్రైనింగ్ తీరు తెన్నులపై అందరి అభిప్రాయాలను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సమీక్షా కమిటీని నియమించింది. కమిటీ బుధవారం నాడు సమావేశమై వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించింది.

03/10/2016 - 07:24

వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టిఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేసినప్పటికీ పశ్చిమలో ఆ పార్టీ దాదాపు నాలుగు సీట్లను కోల్పోయి కాంగ్రెస్ చేతుల్లో పెట్టింది. గ్రేటర్ పరిధిలో మెజార్టీ డివిజన్లు తూర్పు పశ్చిమలోనే ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు తూర్పులో హవా కొనసాగినా పశ్చిమలో టిఆర్‌ఎస్ హవాకు కాంగ్రెస్ నేతలు జంగా రాఘవరెడ్డి అడ్డుపడ్డారు.

03/10/2016 - 07:22

నల్లగొండ: తెలంగాణ తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుండి 11 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు యాదాద్రి దేవస్థానం సన్నాహాలు చేసింది. పంచనారసింహస్వామి క్షేత్రంగా, కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా భక్తుల పూజలందుకుంటున్న లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు హాజరుకానున్నారు.

03/10/2016 - 07:22

సంగారెడ్డి: శైవ భక్తులు, అమ్మ ఆరాధకులు భక్తి శ్రద్ధలతో మొక్కులు నిర్వహించుకునే మహా శివరాత్రి జాతర ఉత్సవాలు మెదక్ జిల్లాలో అట్టహాసంగా కొనసాగాయి. మూడు రోజుల జాతరలో భాగంగా ఏడుపాయల్లో బుధవారం నాడు వనదుర్గా మాత రథోత్సవం కన్నుల పండువగా శోభాయమానంగా కొనసాగింది.

03/10/2016 - 07:21

సూర్యాపేట: ఇంటర్మీడియట్ పరీక్షల్లో అక్రమాలకు అడ్డాగా పేరొందిన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఈ ఏడాది కూడా ఇంటర్ పరీక్షల్లో మాస్‌కాపీయంగ్ జోరుగా సాగుతోంది. పట్టణంలోని కొన్ని పరీక్షా కేంద్రాల నుండి పరీక్ష ప్రారంభమైన కొంతసేపటికే ప్రశ్నలు బయటకు పొక్కుతుండగా పరీక్ష ప్రారంభమైన అరగంటలోనే సంబంధిత సమాధానపత్రాలు పరీక్షా కేంద్రాలకు చేరుతున్నాయి.

03/10/2016 - 07:17

శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు ఆలయ వేద పండితులు, అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అదేవిధంగా పూర్ణాహుతి నిర్వహించారు. ముందుగా స్వామివారి యాగశాలలో చండీశ్వరునికి ప్రత్యేక పూజలు, లోకకల్యాణం కోసం జపాలు చేశారు. రుద్రహోమం, జయాదిహోమం నిర్వహించారు.

03/10/2016 - 07:16

కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నుండి గురువారం సాయంత్రంలోగా కాపుల సమస్యల పరిష్కారానికి లిఖితపూర్వక హామీ రాని పక్షంలో ఈనెల 11వ తేదీ నుండి మరోసారి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టేందుకు మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సన్నద్ధమవుతున్నారు. ఈమేరకు కిర్లంపూడిలోని తన నివాసంలో గురువారం 13 జిల్లాల కాపు నేతలతో కీలక సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నారు.

03/10/2016 - 07:15

సూళ్లూరుపేట: మరో చారిత్రక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్ధమైంది. మరో కొన్ని గంటల వ్యవధిలోనే ఇస్రో శాస్తవ్రేత్తలు సొంత నావిగేషన్ వ్యవస్థ అధ్యయానికి సర్వసిద్ధం చేశారు. సరికొత్త స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైతే మనకు సొంత నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.

03/10/2016 - 07:11

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నాటి ఇంటర్ సెకండియర్ పేపర్ లీక్ అయిందనే వార్తలు గుప్పుమనడంతో విద్యార్ధులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరోపక్క పలు కేంద్రాల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్టు విద్యార్ధి సంఘాల నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం మాథ్స్ -ఎ పేపర్ పరీక్ష జరుగుతుండగా ఈ విషయం బయటపడింది.

Pages