S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/10/2016 - 07:52

చేవెళ్ల: చేవెళ్లలోని శ్రీలక్ష్మివేంకటేశ్వరస్వామి దేవాలయ అబివృద్ధికి కృషి చేస్తానన్ని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీలక్ష్మివేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జాతరలో ఎంపిపి బాల్‌రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయాలు క్రమశిక్షణ, ఆధ్యాత్మికతకు నిలయాలుగా నిలుస్తాయని అన్నారు.

03/10/2016 - 07:51

హైదరాబాద్, మార్చి 9: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న డబల్ బెడ్‌రూం ఇళ్ల మంజూరి కోసం దరఖాస్తు చేసుకునే వారు ఎవరైనా నేరుగా మీ సేవా కేంద్రాల్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు ప్రత్యేక ఆదేశాలు ఇస్తూ ప్రతి మీ సేవా కేంద్రం ముందు ఫ్లెక్సీ, బ్యానర్ రూపంలో వివరాలను ప్రకటించాలని సూచించారు.

03/10/2016 - 07:49

వికారాబాద్: ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడికీ ప్రభుత్వ పథకాల అమలులో ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వాలని టిజెఎసి చైర్మన్ కోదండరాం అన్నారు. బుధవారం ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఉద్యమకారుడు మహేందర్‌రెడ్డి కుటుంబాన్ని నవాబ్‌పేట మండలం తిమ్మారెడ్డిపల్లిలో పరామర్శించి అధైర్యపడొద్దని నచ్చజెప్పారు.

03/10/2016 - 07:49

వికారాబాద్: రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట పోలీసులు రూ.2.65 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుని, ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ రమారాజేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం మోమిన్‌పేట మండలం రాంనాథ్‌గుడుపల్లి అనుబంధ గ్రామమైన ఎల్లమ్మగుట్ట తండాకు చెందిన మేగావత్ ప్రకాష్(27) మేస్ర్తీ పనిచేస్తాడు.

03/10/2016 - 07:48

హైదరాబాద్, మార్చి 9: జంటనగరవాసులకు వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో ఎంతో వేగంగా జరుగుతున్న మెట్రోరైలు పనుల కారణంగా మహానగర పాలక సంస్థకు రూ. 30 కోట్ల మేరకు నష్టం ఏర్పడింది. మెట్రోకారిడార్ పనులు జరుగుతున్న వివిధ ప్రాంతాల్లో జిహెచ్‌ఎంసికి చెందిన దాదాపు 300 హోర్డింగ్‌లు తొలగించబడినట్లు గుర్తించామని, వాటి నుంచి కార్పొరేషన్‌కు ఏటా రూ.

03/10/2016 - 07:47

హైదరాబాద్: హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడిపిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, ఇప్పటివరకు నగరంలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన 40 వేల మందిపై కేసులు నమోదు చేశామని నగర ట్రాఫిక్ విభాగం-2 డిసిపి ఎవి.రంగనాథ్ తెలిపారు. పాతబస్తీ చార్మినార్‌లో బుధవారం సాయంత్రం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన ట్రాఫిక్ అదనపు డిసిపి ఎస్.సత్యనారాయణ, చార్మినార్ ఏసిపి జె.్భద్రేశ్వర్‌లతో కలిసి మాట్లాడారు.

03/10/2016 - 07:39

హైదరాబాద్/సైదాబాద్: చదువుకున్నవారే..కానీ జల్సాలకు అలవాటు పడ్డారు. అందుకు కావలసిన డబ్బుకోసం దోపిడీకి పథకం వేశారు. ఓ ఇల్లును దోచేందుకు యత్నించిన క్రమంలో ఒక మహిళ పాత్ర అవసరమైంది. కాగా వారిలో ఒక ప్రబుద్ధుడు తన తల్లిని రంగంలోకి దింపాడు. దోపిడీ యత్నం బెడిసికొట్టింది. సిసి కెమెరాల ఫుటేజి ఆధారంగా మలక్‌పేట పోలీసులు కేసును ఛేదించారు. దోపిడీ ముఠాలోని ఏడుగురు సభ్యులను అరెస్టు చేశారు.

03/10/2016 - 07:38

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే పిఇసెట్, పిజి ఇ సెట్, ఎడ్‌సెట్‌ల షెడ్యూళ్లను ప్రకటించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులో చేరేందుకు పిఇసెట్‌ను, ఎంటెక్, ఎంఫార్మసీల్లో చేరేందుకు పిజిఇసెట్‌ను, బిఇడి కోర్సులో చేరేందుకు ఎడ్‌సెట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ మూడు సెట్‌లను ఈ ఏడాది ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహించబోతోంది. ఆ

03/10/2016 - 07:33

హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు మొదటి దశను 2018 నాటికి పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

03/10/2016 - 07:31

హైదరాబాద్: విమ్స్ ఆస్పత్రిని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పరిధిలోకి తీసుకువచ్చి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా అభివృద్ధి చేస్తామని ఆరోగ్య, వైద్య మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. బుధవారం నాడు శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో కిడారి సర్వేశ్వరరావు, విష్ణుకుమార్‌రాజు, రాజన్నదొర, రామకృష్ణబాబు, కళావతి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.

Pages