S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/10/2016 - 07:10

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టును 2018లోగా కేంద్రమే పూర్తి చేస్తామంటే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అప్పగిస్తామని ఆయన తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన బుధవారం అసెంబ్లీలో సుదీర్ఘంగా ప్రసంగించారు. కొత్త రాష్ట్రానికి కేంద్రం ఇతోధికంగా సహాయం చేయాల్సి ఉందని అన్నారు.

03/10/2016 - 07:10

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగర వౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఇర్కాన్ ముందుకొచ్చింది. క్యాంపు కార్యాలయంలో బుధవారం ఇర్కాన్ సిఎండి మోహన్ తివారీ, అడిషనల్ జనరల్ మేనేజర్ దొడ్డయ్యతో పాటు ఇతర అధికారులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుతో సమావేశమయ్యారు.

03/10/2016 - 07:09

నరసాపురం: ప్రఖ్యాత వ్యవసాయ శాస్తవ్రేత్త , మాజీ ఎమ్మెల్సీ పద్మశ్రీ డాక్టర్ ఎంవి రావు (87) మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతిచెందారు. ఆయనకు ఒక కుమారుడు, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించిన డాక్టర్ ఎంవి రావు భారత వ్యవసాయ పరిశోధనా రంగానికి ఎనలేని సేవచేశారు. ఆకుపచ్చ విప్లవ సేనానిగా ఆయన గుర్తింపుపొందారు.

03/10/2016 - 07:07

హైదరాబాద్: 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ముచ్చటగా మూడో సంవత్సరం రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించేందుకు రంగం సిద్ధమైంది. ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ముందు లాంఛనంగా దీనికి మంత్రివర్గం ఆమోదం కావాల్సి ఉంటుంది. అందువల్ల ఉదయం 10.45 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమవుతోంది.

03/10/2016 - 07:07

హైదరాబాద్, మార్చి 9: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రాహ్మణ సామాజిక వర్గ సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ లిమిటెడ్‌కు మరిన్ని అదనపు నిధులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉందని దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు చెప్పారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కోన రఘుపతి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులు ఇచ్చారు. 2014-15 సంవత్సరానికి రూ. 25 కోట్లు, 2015-16 సంవత్సరానికి రూ.

03/10/2016 - 07:01

నేపీతా (మయన్మార్), మార్చి 9: మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకు రావడానికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్ సూకీ జరిపిన దశాబ్దాల పోరాటం పూర్తిస్థాయిలో కాకపోయినప్పటికీ కొంతమేరకైనా గురువారం ఫలించనుంది. గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించినప్పటికీ ఆమె దేశ నాయకురాలు కావడం లేదనేది ఇప్పటికే ఖాయమై పోయింది.

03/10/2016 - 06:59

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అయిదుగురు నాయకులకు ఢిల్లీలోని ఒక కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ ఏడో తేదీన తన ముందు హాజరు కావలసిందిగా చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సుమిత్ దాస్ ఆదేశించారు.

03/10/2016 - 06:57

న్యూఢిల్లీ: పార్లమెంటు చరిత్రలో ఐదోసారి రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సవరించటంలో ప్రతిపక్షం విజయం సాధించింది. రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ప్రతిపాదించిన సవరణకు అనుకూలంగా 94 ఓట్లు రాగా వ్యతిరేకంగా 61 ఓట్లు పడ్డాయి. రాజ్యసభలో ప్రతిపక్షానికే మెజారిటీ ఉందన్న సంగతి తెలిసిందే.

03/10/2016 - 06:57

డెట్రాయిట్: అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న పోటీలో తన సొంత పార్టీవారినుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ఇప్పటివరకు ప్రత్యర్థులకన్నా ముందంజలో ఉన్న రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ బుధవారం మరో మూడు ప్రైమరీలను దక్కించుకోవడం ద్వారా తన ఆధిక్యతను మరింతగా పెంచుకున్నారు.

03/10/2016 - 06:56

న్యూఢిల్లీ: ఇరాక్‌లో ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్న భారతీయులు ఇప్పటికీ జీవించే ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. వారిని క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని హామీ ఇచ్చారు. పంజాబ్‌కు చెందిన దాదాపు 40 మంది గత ఏడాదిగా ఇరాక్‌లో బందీలుగా ఉన్నారు.

Pages