S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/10/2016 - 05:55

హైదరాబాద్: ఎన్నికలు ఏవైనా అధికార తెరాస పార్టీ తిరుగులేని ఆధిపత్య పరంపర కొనసాగిస్తోంది. మొన్నటి వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక, నిన్నటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికైనా, నేటి వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లోనూ తెరాస పార్టీ విజయదుందుభి మోగించింది. కమ్యూనిస్టులకు కంచుకోట అయిన ఖమ్మం జిల్లాలోనూ తెరాస ప్రభంజనమే సృష్టించింది.

03/10/2016 - 05:52

హైదరాబాద్: ఓత్ ఆఫ్ సీక్రసీని ఉల్లంఘిస్తూ రాజధాని అమరావతి సమచారాన్ని సిఎం చంద్రబాబే మంత్రులకు లీక్ చేశారని, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు తెరలేపారని విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర అభియోగాలు మోపారు. సమాచారం తెలుసుకున్న మంత్రులు అమరావతి చుట్టూ భారీగా భూములు కొనుగోలు చేసిన విషయాలు తమ వద్ద ఆధారాలతో ఉన్నాయన్నారు. మొత్తం వ్యవహారంపై విచారణకు సిబిఐని రంగంలోకి దించితే ఆధారాలు అందిస్తామని స్పష్టం చేశారు.

03/10/2016 - 05:13

హైదరాబాద్: అమరావతి భూముల వ్యవహారంపై విపక్షనేత జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు రుజువులు చూపిస్తే, సంబంధిత మంత్రులను తక్షణం డిస్మిస్ చేస్తానని సిఎం చంద్రబాబు సవాల్ చేశారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు చేసిన మీవద్ద రుజువులుంటే తక్షణం స్పీకర్‌కు అందించాలని జగన్‌ను డిమాండ్ చేశారు. ఆరోపణలు రుజువైతే మంత్రులను డిస్మిస్ చేస్తానన్నారు.

03/10/2016 - 05:10

న్యూఢిల్లీ: సంపూర్ణ సూర్యగ్రహణం బుధవారం ఉదయం ఇండోనేసియా, పసిఫిక్ ప్రాంతంలోని కోట్లాదిమందికి కనువిందు చేసింది. చంద్రుడు భూమికి, సూర్యుడికి మధ్యగా వచ్చిన కారణంగా ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణం ఉదయం 6 గంటల 19 నిమిషాలకు (్భరత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4.49కి) ప్రారంభమైంది. అయితే భారత్‌లో మాత్రం గ్రహణం పాక్షికంగానే కనిపించింది.

03/10/2016 - 05:08

న్యూఢిల్లీ: మరణం మాదిరిగా కాంగ్రెస్ ఎప్పుడూ నిందకు దొరకదు. మరణానికి దారితీసే పరిస్థితులను తప్ప, మరణాన్ని నిందించలేం, కాంగ్రెస్ మాదిరిగానే.. అంటూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యస్త్రాలు సంధించారు. బుధవారం రాజ్యసభలో రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బదులిస్తూ కాంగ్రెస్‌ను మరణంతో పోల్చారు.

03/10/2016 - 05:05

పుంగనూరు: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్త కన్నకూతురిని లైంగికంగా వేధిస్తుండటంతో తట్టుకోలేక ఆ తలి బిడ్డలపై కిరోసిన్ పోసి తానూ నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఎస్సై హరిప్రసాద్ కథనం ప్రకారం ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఎస్‌కే రహమాన్ పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం భార్యాబిడ్డలతో పుంగనూరుకు వలసవచ్చాడు.

03/10/2016 - 05:02

హైదరాబాద్: తెలంగాణలో వృత్తి సాంకేతిక విద్యా కోర్సుల్లో అడ్మిషన్లకు రెండు ప్రవేశ పరీక్షలను ఆన్‌లైన్‌లో ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు. తెలంగాణలో ఉద్యోగాల ఎంపికకు పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇప్పటికే రిక్రూట్‌మెంట్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించి అభ్యర్ధులను విజయవంతంగా ఎంపిక చేసింది.

03/10/2016 - 04:33

పేదరికం, కరవు, రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, అశాంతితో యువత, ఎన్‌కౌంటర్‌లు తెలంగాణ అనగానే ఒకప్పుడు గుర్తుకు వచ్చే వరుస క్రమం. ఇప్పుడు తెలంగాణ ముఖ చిత్రం మారుతోంది. నా తెలంగాణ కోటి రతనాల వీణ నిన్నటి మాట, నా తెలంగాణ కోటి ఎకరాల వీణ రేపటి మాట. సస్యశ్యామల తెలంగాణకు ఆంకరార్పణ జరిగింది. గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర తెలంగాణల మధ్య కుదిరిన ఒప్పందం చారిత్రక ఒప్పందం.

03/10/2016 - 04:29

ఈసారి ఫిబ్రవరిలోనే ఎండలు తీవ్రమయ్యాయ. ఇక పదవ తరగతి పరీక్షల సమయంలో భానుని ఉగ్ర రూపం ఎట్లా ఉంటుందో తలచుకుంటేనే భయమేస్తున్నది. ఈసారి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు తోడు, ప్రచండమైన ఎండలతో కఠిన పరీక్షను ఎదుర్కోనున్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చల్లని మంచినీటి సదుపాయం అన్ని పరీక్షా కేంద్రాల్లో విధిగా ఏర్పాటు చేయాలి.

03/10/2016 - 04:27

మాతృభాష అంటే స్వంత భాష. సాధారణంగా వ్యక్తులకు తమ తల్లిదండ్రులు మాట్లాడే భాషే మాతృభాష అవుతుంది. శిశువు మరొక భాషా ప్రాంతంలో ఉండి పెరగడం జరిగితే అక్కడి ప్రజల భాష అలవడితే ఆ భాషే ఆ శిశువు మాతృభాష ఆ ప్రాంతపు భాషే అని చెప్పవచ్చును.

Pages