S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/10/2016 - 06:55

న్యూఢిల్లీ: ఆమె అధికార పక్ష పార్లమెంటు సభ్యురాలు... ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలకూ హాజరవుతున్నారు... బుధవారం కూడా ఆమె సభలో ఉన్నారు. అయినా ఏం ప్రయోజనం! వికీపీడియా వెబ్‌సైట్ సాక్షిగా ఆమె మార్చి 3వ తేదీనే మరణించారు. చట్టసభల సాక్షిగా కళ్ళముందు కనిపిస్తున్న ఆమె పేరు అంజు బాల. ఈ చేదు నిజాన్ని బుధవారం పార్లమెంటులో స్వయంగా ప్రకటించడంతో కలకలం చెలరేగింది.

03/10/2016 - 06:54

న్యూఢిల్లీ: దేశంలో 83 లక్షల మంది ఎల్‌పిజి సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది మార్చిలో ఇచ్చిన ‘గివ్ ఇట్ అప్’కు స్పందన బాగుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారంస్పష్టం చేశారు.

03/10/2016 - 06:53

న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా వివాదాల సుడిగుండంలో తిరుగుతున్న అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవానికి ఎట్టకేలకు బుధవారం పొద్దుపోయిన తర్వాత జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లభించింది. ఈ మూడు రోజులు ఉత్సవ నిర్వహణ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనందున వీటిని ఆపలేమని స్పష్టం చేసిన ఎన్‌జిటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థపై ఐదు కోట్ల జరిమానా విధించింది.

03/10/2016 - 06:46

కోల్‌కతా: వరుస విజయాలతో మంచి ఊపుమీద ఉన్న భారత క్రికెట్ జట్టు టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం వెస్టిండీస్‌తో జరిగే వామప్ మ్యాచ్‌కి సిద్ధమైంది. అన్ని విభాగాల్లోనూ పట్టిష్టంగా ఉన్న కారణంగా, బెంచ్ బలాన్ని బేరీజు వేసుకోవడానికి ఈ మ్యాచ్‌ని ఒక వేదికగా స్వీకరించాలని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే అతను కొన్ని ప్రయోగాలు చేయడం ఖాయంగా కనిపిస్తున్నది.

03/10/2016 - 06:44

కోల్‌కతా: ఉత్కంఠ రేపుతున్న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఈనెల 19న ధర్మశాలలో జరగాల్సిన టి-20 ప్రపంచ కప్ గ్రూప్ మ్యాచ్ కోల్‌కతాలోనీ ఈడెన్ గార్డెన్స్‌కు మారింది. ధర్మశాలలో మ్యాచ్ జరిగే భద్రత కల్పించలేమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్‌భద్ర సింగ్ చేతులెత్తేయగా, అవసరమైతే పారా మిలటరీ బలగాలను రంగంలోకి దింపుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

03/10/2016 - 06:43

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్‌భద్ర సింగ్ వైఖరి వల్లే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ధర్మశాలలో ఈనెల 19న జరగాల్సిన టి-20 ప్రపంచ కప్ గ్రూప్ మ్యాచ్‌పై చివరి వరకూ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ధ్వజమెత్తాడు. ప్రతిష్ఠాత్మకమైన ఈ టోర్నీ షెడ్యూల్ ఏడాది క్రితమే ఖరారైందని, ఆరు నెలల ముందు వేదికలను కూడా ప్రకటించామని విలేఖరులతో మాట్లాడిన అతను గుర్తుచేశాడు.

03/10/2016 - 06:41

న్యూఢిల్లీ: ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ కోల్‌కతాకు మారడాన్ని పిసిబి స్వాగతించింది. ఈ మార్పుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. అయతే, జట్టును భారత్‌కు పంపేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నది. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ క్రికెట్ జట్టు బుధవారానికే ఇక్కడికి చేరుకోవాలి. 17న ధర్మశాలకు బయలుదేరాలి.

03/10/2016 - 06:41

ముంబయి: టి-20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకునే సత్తా భారత్‌కే ఎక్కువగా ఉందని ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ బెన్ స్టోక్స్, స్పిన్నర్ మొయిన్ అలీ జోస్యం చెప్పారు. బుధవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టీమిండియా అన్ని విభాగాల్లోనూ బలంగా ఉందని అన్నారు. స్వదేశంలో టోర్నీ జరగడం కూడా ఆ జట్టుకు లాభించే అంశమని పేర్కొన్నారు.

03/10/2016 - 06:39

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ని ధర్మశాల నుంచి కోల్‌కతాకు మార్చినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ స్పష్టం చేశాడు. బుధవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో అతను మాట్లాడుతూ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మ్యాచ్‌ని మరో వేదికకు మార్చేందుకు అంగీకరించామని అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఆటగాళ్లందరిపైనా నిఘా ఉంటుందన్నాడు.

03/10/2016 - 06:31

న్యూఢిల్లీ: విజయ్ మాల్యా విదేశాలకు వెళ్లిపోయాడని బుధవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వరంగ బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడిన మాల్యాపై బాధిత బ్యాంకర్లు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినది తెలిసిందే. ఉద్దేశపూర్వకంగా రుణాల ఎగవేతకు మాల్యా పాల్పడుతున్నారని, అరెస్టు చేసి, పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని ఎస్‌బిఐసహా 13 బ్యాంకులు సుప్రీంలో పిటిషన్ వేశాయి.

Pages