S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/10/2016 - 06:29

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మెకు దిగుతున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చినట్లు ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ అధికారుల జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటేశ్వరరెడ్డి తెలియజేశారు.

03/10/2016 - 06:28

న్యూఢిల్లీ: కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాటా విక్రయానికి సంస్థాగత మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసి తదితర సంస్థాగత మదుపరులు 1,887 కోట్ల రూపాయల విలువైన బిడ్లను దాఖలు చేశారు. 1,165 కోట్ల రూపాయల విలువైన 5 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం.. అమ్మకానికి పెట్టినది తెలిసిందే.

03/10/2016 - 06:27

న్యూఢిల్లీ: భారత్‌లో సంస్కరణలు మందగించనున్నాయని, వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను గత నెల 29న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్ ఇందుకు నిదర్శనమని గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ వ్యాఖ్యానించింది. దేశ ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించగల సంస్కరణలేవీ ఉండవని మరోమారు బడ్జెట్ తేల్చి చెప్పిందని బుధవారం పేర్కొంది.

03/10/2016 - 06:26

విశాఖపట్నం: దేశంలోని మేజర్ పోర్టులను ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని మేజర్ పోర్ట్స్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ సమన్వయ కమిటీ ఆరోపించింది. పోర్టుల ప్రైవేటీకరణ అంశంలో ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు దేశంలోని 11 మేజర్ పోర్టుల్లో కార్మికులకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఐదు ఫెడరేషన్ల సమన్వయ కమిటీ సమావేశాలు గత రెండు రోజులుగా విశాఖలో జరుగుతున్నాయి.

03/10/2016 - 06:25

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం లో 1,200 కోట్ల రూపాయల వ్యయంతో సుజ్లాన్ గ్రూప్ 3 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబర్చింది. ముంబయిలో ఒక రోజు పర్యటనలో భాగంగా తెలంగాణ పంచాయతీరాజ్, ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్.. సుజ్లాన్ గ్రూప్ సిఎండి తులసి తంతితో సమావేశమయ్యారు.

03/10/2016 - 06:24

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఈ ఏప్రిల్ 5న ద్రవ్యసమీక్ష జరపనున్న క్రమంలో అప్పుడైనా, దానికి ముందైనా కీలక వడ్డీరేట్లను పావు శాతం చొప్పున తగ్గించే అవకాశాలున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ నివేదిక బుధవారం అభిప్రాయపడింది.

03/10/2016 - 06:11

హైదరాబాద్: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు అచ్చంపేట మున్సిపాల్టీకి జరిగిన ఎన్నికల్లో తెరాసకు అఖండ విజయం చేకూర్చిన ఓటర్లకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ ఫలితాలు ప్రజల దీవెనలని సిఎం కెసిఆర్ అభివర్ణించారు.

03/10/2016 - 06:09

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు గురువారంనుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరుగనుంది. ఇందులో బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేస్తారు. శాసనసభలో ఈ నెల 14వ తేదీన ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ బడ్జెట్ ప్రవేశ పెడుతారు.

03/10/2016 - 06:05

హైదరాబాద్: తెలంగాణ టిడిపికి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార టిఆర్‌ఎస్ గూటికి చేరిపోయారు. టిడిపికి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇద్దరూ తమను టిఆర్‌ఎస్ శాసనసభ పక్షం సభ్యులుగా గుర్తించాలని కోరుతూ స్పీకర్ మధుసూదనాచారికి బుధవారం అధికారికంగా లేఖ పంపించారు.

03/10/2016 - 05:57

హైదరాబాద్: రాజధాని అమరావతిపై అసెంబ్లీ రణరంగమే అయ్యింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ అధికార, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పరస్పర దూషణలు, నిందారోపణలు దద్దరిల్లింది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో అట్టుడికింది.

Pages