S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/05/2016 - 20:13

ఈ చెట్టు .. పచ్చటి ఆకులతో కళకళలాడుతోందని అనుకుంటే మీరు తప్పులో కాలువేసినట్లే. ఎందుకంటే ఆ కొమ్మలనిండా ఆకుపచ్చగా ఉన్నవి ఓ రకం చిలుకలు. బడ్జీస్‌గా పిలుచుకునే ఈ చిన్నపాటి చిలుకలు వేలాదిగా కలసి తిరగడం, ఇలా నీటిమడుగులున్నచోట అన్నీకలసి నీళ్లు తాగడం, పక్కనే ఉన్న చిన్నచిన్న మొక్కలు, చెట్లపై గుంపులుగుంపులుగా వాలడం వాటికి ఇష్టమైన పని. దూరంనుంచి చూస్తే ఇదేదో చెట్టులా కన్పిస్తుంది.

03/05/2016 - 20:10

మనం షికాకాయ్‌ని తలంటుకోవడానికి, హెయిర్ కండిషనర్‌గా ఉపయోగిస్తాంకదా. కానీ దానికంటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఔషధాల్లోను, షాంపూల తయారీలోను, బట్టలు ఉతికే పదార్థంగానూ, ఆహార పదార్థాల తయారీలోనూ వాడతారు. తుమ్మజాతికి చెందిన షికాకాయ్ చెట్ల ఆకులు, బెరడు, కాయలు, గింజలు అన్నీ ఉపయోగకరమైనవే. వీటి బెరడులో ఉండే సపోనిన్ చర్మరక్షణకు పనికొస్తుంది. వీటి ఆకులు కొన్ని రకాల పచ్చళ్లలో వాడతారు.

03/05/2016 - 20:08

మా ఊరి చెరువు ఒక
వానాకాలం గంగాళం
శీతాకాలపు తామరపూల తటాకం
ఎండ వేడికి తల్లడిల్లిన
జంతుజాలము - విహంగాలకు
చల్లని గుండెతో స్వాగతించి
సేదతీర్చిన ‘అమ్మ ఒడి’
మా ఊరి చెరువు
పిల్లకాలువల పులకరింతలు
నీటిమడుగున సేదతీరిన
పాడిపంటల సోయగాలు
మా ఊరిచెరువు
శ్రమైక జీవుల చేతబట్టిన
రంగుల చీరల చెరువుగట్టు
ఆరవేతలు...

03/05/2016 - 17:41

ఏలూరు: ప్రేమను తిరస్కరించినందుకు ఓ యువతిపై ఇద్దరు యువకులు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రులో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన ఓ యువతి ఇంటర్ వరకూ చదివి, ఇంటిపట్టునే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు కొంతకాలంగా ప్రేమపేరిట ఆమెను వేధిస్తున్నాడు. అయితే, ఆమె అందుకు తిరస్కరించింది.

03/05/2016 - 17:40

హైదరాబాద్: భవనాల క్రమబద్ధీకరణకు సంబంధించి పలు ఆరోపణలు రావడంతో తార్నాకలోని హైదరాబాద్ మెట్రో అభివృద్ధి సంస్థ కార్యాలయంలో శనివారం ఎసిబి అధికారులు దాడులు చేస్తున్నారు. భవనాల క్రమబద్ధీకరణ విషయమై ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? వాటిని ఎలా ఆమోదించారు? అనే విషయమై వారు ఆరా తీస్తున్నారు. ఇదే విషయమై జిహెచ్‌ఎంసి కార్యాలయంలోనూ సోదాలు చేస్తున్నారు.

03/05/2016 - 17:40

హైదరాబాద్: ఎపీ శాసనసభ సమావేశాలను 16 రోజుల పాటు జరపాలని, ఈనెల 10న బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని అసెంబ్లీ బిఎసీ సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీ స్పీకర్ కోడెల అధ్యక్షతన శనివారం జరిగిన ఈ సమావేశంలో టిడిఎల్‌పి 17 అంశాలను బిఎసీ ఆమోదానికి ప్రతిపాదించింది. బిఎసీ సమావేశానికి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ హాజరుకాలేదు.

03/05/2016 - 17:39

దిల్లీ: దేశద్రోహం కేసులో నిందితుడిగా ఉంటూ ఇటీవల బెయిల్ పొందిన జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్‌ను కాల్చి చంపితే 11 లక్షల నగదు నజరానా ఇస్తామంటూ దిల్లీలో ‘పూర్వాంచల్ సేన’ పేరిట శనివారం వాల్‌పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. యుపి, బిహార్ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లుగా చెప్పుకునే ‘పూర్వాంచల్ సేన’ పేరిట పోస్టర్లు వెలియడం సంచలనం సృష్టించింది.

03/05/2016 - 16:09

దిల్లీ: దేశద్రోహం కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్ కార్యకలాపాలపై తమకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలంటూ దిల్లీ పోలీసులు జెఎన్‌యు అధికారులకు లేఖ రాశారు. బెయిల్‌పై విడుదలయ్యాక కన్నయ్య పలుచోట్ల విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళనల్లో పాల్గొంటున్నందున అతనికి భద్రత కల్పించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.

03/05/2016 - 16:09

హైదరాబాద్: ఎపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి ప్రసంగించారు. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ చక్రపాణి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

03/05/2016 - 16:08

హైదరాబాద్: విదేశాల్లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా గుట్టును ఉప్పల్‌లో పోలీసులు శనివారం రట్టు చేశారు. నిందితుల నుంచి భారీగా నకలీ వీసాలు, పాస్‌పోర్టులతో పాటు 80 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజ్‌గిరి ఎసిపి మీడియాకు తెలిపారు.

Pages