S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/05/2016 - 21:58

హరిబాబు ప్రధాన పాత్రలో శ్రీనివాస్ జి.ఎల్.బి. స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘సాయే దైవం’. భగవాన్ షిరిడీ సాయిబాబా భక్తుల అనుభవాలను ప్రధానాంశంగా తీసుకుని, బాబాను విశ్వసించిన భక్తుల జీవితాల్లో జరిగిన అద్భుతాలే ప్రధాన కథనంగా ఈ చిత్రం రూపొందించామని శ్రీనివాస్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్‌తోపాటుగా పాటల చిత్రీకరణ పూర్తిచేశారు.

03/05/2016 - 21:56

దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా మలయాళంలో రూపొందిన ‘ఉస్తాద్ హోటల్’ చిత్రాన్ని తెలుగులో ‘జతగా’ పేరుతో అందిస్తున్నారు. అన్వర్ రషీద్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రాన్ని సురేష్ కొండేటి అనువదించారు. తొలి కాపీ సిద్ధమైన ఈ చిత్రం గూర్చి నిర్మాత మాట్లాడుతూ, మలయాళంలో మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రంలో దుల్కర్, నిత్యామీనన్ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని తెలిపారు.

03/05/2016 - 21:51

ప్రశాంత్, మణికంఠ, ప్రసన్న, అశ్విని ప్రధాన తారాగణంగా వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.5వ చిత్రంగా రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. శివశ్రీ దర్శకత్వంలో డా.మళ్ల విజయ్‌ప్రసాద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

03/05/2016 - 21:48

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను కథానాయకుడుగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్ టీమ్‌వర్క్స్ పతాకంపై అన్నపూర్ణ స్టూడియోస్ రూపొందిస్తున్న యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ‘నిర్మలా కానె్వంట్’. జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శ్రేయాశర్మ కథానాయికగా నటిస్తోంది.

03/05/2016 - 21:45

గ్లామర్ భామ రెజినా ఈ మధ్య జోరుగా సినిమా చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. ఇప్పటికే స్టార్ హీరోయిన్‌గా మారిన ఈ భామ మరోసారి మెగా హీరోతో జోడి కట్టేందుకు రెడీ అయింది. ఆ మెగా హీరో ఎవరంటే మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్! ఇప్పటికే ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాల్లో నటించిన ఈ భామ ఇప్పుడు మరోసారి జోడీకట్టింది.

03/05/2016 - 21:41

రూపానటరాజన్, రంజన్‌శెట్టి, శే్వత, విక్రమ్ ప్రధాన తారాగణంగా కన్నడంలో రూపొందించిన ‘మిస్ మల్లిక’ చిత్రాన్ని తెలుగులో ‘కుమారి మల్లిక’గా అనువదిస్తున్నారు. శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక పిక్చర్స్ పతాకంపై ఆస్కార్ కృష్ణ దర్శకత్వంలో వంశీ కిరణ్‌రెడ్డి, స్వర్ణ శ్రీనివాస్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.

03/05/2016 - 21:32

ఐవింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్‌లింగాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’. సాయిరోనక్, అతిథి సింగ్, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

03/05/2016 - 21:30

థర్డ్‌ఐ పోస్ట్‌ప్రొడక్షన్ స్టూడియోస్ పతాకంపై వైభవ్, రమ్యానంబిసన్ జంటగా తెరకెక్కిన చిత్రం ధనాధన్. శ్రీ దర్శకత్వంలో డా.శివ వై.ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేని ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు.

03/05/2016 - 21:24

కార్తికేయ ప్రొడక్షన్స్ పతాకంపై రావంత్, పావని జంటగా ధనుంజయ్ దర్శకత్వంలో పల్ల రమణాయాదవ్ రూపొందిస్తున్న చిత్రం ‘నా హృదయం ఊగిసలాడే’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, చీరాల పరిసర ప్రాంతాలలో షూటింగ్ చేశామని, రాజ్‌కిరణ్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, హీరో కొత్తవాడైనా చక్కగా నటిస్తున్నాడని తెలిపారు.

03/05/2016 - 21:20

ప్రశాంత్, లావణ్య, శిల్ప ప్రధాన తారాగణంగా హనీ, ప్రణి ఫిలిమ్స్ పతాకంపై నంది వెంకట్‌రెడ్డి దర్శకత్వంలో డా.ఎ.వి.ఆర్. రూపొందించిన చిత్రం ‘వేటపాలెం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు.

Pages