S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/05/2016 - 11:53

ఖమ్మం: పాలేరు ఎమ్మెల్యే, తెలంగాణ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ రామిరెడ్డి వెంకటరెడ్డి పార్థివదేహానికి పలువురు నేతలు శనివారం నివాళులర్పించారు. ఆయన స్వగ్రామం పాతలింగాలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎం.పి. నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు వీరయ్య, కనకయ్య, సున్నం రాజయ్య, టిడిపి జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య, సిపిఐ నేత సాంబశివరావు తదితరులు చేరుకుని నివాళులర్పించారు.

03/05/2016 - 11:52

మెదక్: జిన్నారం మండలం కాజీపల్లి పారిశ్రామిక వాడలోని ఓ ఫార్మా పరిశ్రమలో శనివారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. రియాక్టర్ వద్ద పైపు ఊడిపోవడంతో రసాయనాలు పడి ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో సికిందరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

03/05/2016 - 11:52

విజయవాడ: నూజివీడు మండలం అగిరిపల్లి, శూలవరం ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని చిరుత కోసం గాలిస్తున్నారు. చిరుత సంచరిస్తున్న ప్రాంతంలో గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.

03/05/2016 - 11:52

చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అపోలో హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ప్రతాపరెడ్డి కుటుంబీకులు శనివారం 65 లక్షల రూపాయల విలువచేసే వెండి సింహవాహనాన్ని సమర్పించారు. ఈ నెల 7న మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా జరిగే వాహన సేవలో ఈ వెండి సింహ వాహనాన్ని వినియోగిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

03/05/2016 - 07:58

విజయవాడ (కల్చరల్): స్వాతంత్య్రానంతరం ప్రభుత్వ పరిపాలనలలో వచ్చిన మార్పులతో బ్రాహ్మణ కమ్యూనిటీ ఎంతో నష్టపోయిందని, తిరిగి ఆ శక్తిని చేజిక్కించుకోవాలంటే చురుగ్గా రాజకీయాలలో పాల్గొంటూ రాజకీయంగా ఎదగగలిగినప్పుడే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ ఫ్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు.

03/05/2016 - 07:58

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 4: సాగుచేసే ఎరువుల వినియోగం దుర్వినియోగం కాకుండా వాటి వినియోగాన్ని మరింత క్రమబద్దీకరించే క్రమంలో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఇ-పోస్) విధానంతో ఎరువుల విక్రయాలు జరుగుతాయని, కొనుగోలు చేసే వారి వివరాలను సమగ్రంగా పర్యవేక్షించేందుకు గాను ఇ-పోస్ పద్దతిని ప్రవేశపెడుతున్నట్టు జిల్లా కలెక్టర్ బాబు.ఎ పేర్కొన్నారు.

03/05/2016 - 07:57

విజయవాడ: కనీస వేతనాలు లేకపోగా నెలకు కేవలం రూ.400 - 500లకు వెట్టిచాకిరి చేస్తున్న రాష్ట్రంలోని 45 వేల మంది ఆశా కార్యకర్తలకు ఆ కొద్దిపాటి వేతనం కూడా 16 నెలలుగా రాకపోవడాన్ని నిరసిస్తూ సిఐటియు అనుబంధ ఎపి వలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్ శుక్రవారం చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు పూర్తిగా భగ్నం చేశారు.

03/05/2016 - 07:56

మచిలీపట్నం: రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం రైతు బంధు పథకం కింద ఎనిమిది మంది రైతులకు రూ.5.15 లక్షలు విలువ చేసే రుణాలను మంత్రి రవీంద్ర అందజేశారు.

03/05/2016 - 07:53

ఖమ్మం(మామిళ్ళగూడెం), మార్చి 4: ప్రజలకు సమాన న్యాయంతో పాటు సామాజిక భద్రత అందించటమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు స్పష్టం చేశారు.

03/05/2016 - 07:52

వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణలో నియంతపాలన కొనసాగిస్తున్నాడని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం వరంగల్ మీట్ ది ప్రెస్‌లో పాల్గొని ఆయన మాట్లాడారు. టిడిపి పార్టీతో ఎదిగిన నాయకులంతా నేడు టిఆర్‌ఎస్ సర్కార్‌లో కీలకపాత్ర పోషిస్తున్నారని, వారందరికి రాజకీయ భిక్షపెట్టింది టిడిపియేనని, అలాంటి పార్టీని తెలంగాణలో లేకుండా చేస్తాననడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

Pages