S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/17/2018 - 02:42

విజయవాడ, మార్చి 16: ఈ ఏడాది పోషకాహార లోపం, రక్తహీనత, హృదయ శస్తచ్రికిత్సల్లో స్టెంటులపై తాము ప్రధానంగా దృష్టి పెట్టామని, నాబార్డు ఇందుకు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ఆయన నాబార్డు జలసంరక్షణ ఇతివృత్తంగా రూపొందించిన ‘స్టేట్ ఫోకస్ పేపర్ 2018-19’ని ఆయన ఆవిష్కరించారు.

03/17/2018 - 03:18

ఒంగోలు:ప్రకాశం జిల్లాలోని పలుచోట్ల శుక్రవారం రాత్రి కురిసిన అకాల భారీ వర్షానికి రైతాంగానికి భారీగా నష్టం వాటిల్లగా పిడుగులుపడి ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని దర్శి, కనిగిరి ప్రాంతాల్లో పిడుగులు పడతాయని వాతావరణశాఖ రెండుగంటల ముందే హెచ్చరించింది. ఈనేపధ్యంలో దర్శిలో మాత్రం పిడుగులు పడగ, కనిగిరిలో మాత్రం పిడగులు పడకపోవటంతో ఆ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

03/17/2018 - 01:37

విజయవాడ, మార్చి 16: పనిచేసే స్థలంలో మహిళలపై వేధింపులను సహించేది లేదని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమం, సెర్ప్ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పనిచేసే చోట మహిళలపై లైంగిక వేధింపుల నిరోధ చట్టంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయనిపుణులు, ప్రొఫెసర్లు పోలీస్ శాఖ చట్టంలో ఉన్న విధి విధానాలను సభ్యులకు వివరించారు.

03/17/2018 - 01:36

గుంటూరు, మార్చి 16: సినిమాలో ఇంటర్‌వెల్ వరకు హీరోలా ఉండి ఆ తర్వాత భిన్నమైన రోల్ పోషించినట్టుగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యవహరిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి విరుచుకుపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ వైసీపీ మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం ఇస్తుందని, జనసేన కూడా మిస్డ్‌కాల్ పార్టీల జాబితాలో చేరిందా అంటూ ప్రశ్నించారు.

03/17/2018 - 01:35

అమరావతి, మార్చి 16: రాష్ట్రంలోని జూలను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీకరించాలని అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఆదేశించారు. జూలను సందర్శించే సందర్శకుల సౌకర్యార్ధం మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడంతో పాటుగా ప్రతిరోజూ వాటి ప్రాముఖ్యతను, అందులో ఉన్న జంతుజాలాలను గురించి వివరించేందుకు ఒక మినీ థియేటర్‌ను విశాఖపట్నం, తిరుపతిలలో వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

03/17/2018 - 01:34

విజయవాడ, మార్చి 16: రాష్టప్రతి అభ్యర్థిగా ఎపీజే అబ్ధుల్ కలాం పేరును తానే ప్రతిపాదించానంటూ నాటి పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. రాష్టమ్రండలిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ తాను ఎన్డీయే కన్వీనర్‌గా ఉన్న సమయంలో రాష్టప్రతి అభ్యర్థిగా అలెగ్జాండర్‌ను ప్రతిపాదిస్తున్నట్లు అప్పటి ప్రధాని వాజపేయి తనకు తెలిపారన్నారు.

03/17/2018 - 01:29

విజయవాడ, మార్చి 16: రాష్టప్రతి అభ్యర్థిగా ఎపీజే అబ్ధుల్ కలాం పేరును తానే ప్రతిపాదించానంటూ నాటి పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. రాష్టమ్రండలిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ తాను ఎన్డీయే కన్వీనర్‌గా ఉన్న సమయంలో రాష్టప్రతి అభ్యర్థిగా అలెగ్జాండర్‌ను ప్రతిపాదిస్తున్నట్లు అప్పటి ప్రధాని వాజపేయి తనకు తెలిపారన్నారు.

03/17/2018 - 01:28

విజయవాడ, మార్చి 16: రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రధాని మోదీని విమర్శించకుండా తనను విమర్శిస్తే ఏమనుకోవాలి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పవన్ యు టర్న్ తీసుకుని తమను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కరోజులోనే తాను అవినీతిపరుడిగా కనబడ్డానని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టుపై అవగాహన ఉండే ఆయన మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు.

03/17/2018 - 01:14

గుంటూరు, మార్చి 16: గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో అతిసార ప్రబలి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించడం కన్నా మెరుగైన ఏర్పాట్లు చేశామని రాష్ట్ర మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు ప్రకటించారు.

03/17/2018 - 01:02

విజయవాడ, మార్చి 16: అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాన మోదీ రెండు ఒడిగలను ఇచ్చారంటూ ఎమ్మెల్సీ శమంతకమణి ఎద్దేవా చేశారు. రాష్ట్ర శాసన మండలిలో శుక్రవారం రాష్ట్ర విభజన చట్టంపై చర్చ జరిగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ శంకుస్థాపన సమయంలో ఎదో ప్రకటిస్తారని ఆశిస్తే, గంగాజలం, మన్ను ఉన్న రెండు ఒడిగలను (కుండలను) తీసుకువచ్చారన్నారు. విభజన హామీలను అమలు చేయరా? ఎవరబ్బ సొమ్ము అని ప్రశ్నించారు.

Pages