S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/20/2018 - 00:20

విజయవాడ, మార్చి 19: ప్రధాని మోదీకి జగన్, పవన్ కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవిశ్వాసానికి టీడీపీ మద్దతిస్తుంటే దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రం రాసిచ్చిన స్క్రిప్టును పవన్‌కళ్యాణ్ చదివాడని విమర్శించారు.

03/20/2018 - 00:19

భీమవరం, మార్చి 19: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రత్యేక హోదా ఐక్యకార్యాచరణ కమిటి సోమవారం నాడు ముట్టడించింది. స్ధానిక మున్సిపల్ కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చిన ఈ ఐక్య కార్యాచరణ కమిటి తెలుగు ప్రజలను మోసం చేసిన బిజెపి, వెంకయ్య నాయుడుకి వ్యతిరేకంగ నినాదాలు చేసుకుంటూ బిజెపి కార్యాలయం వద్దకు చేరుకున్నారు.

03/19/2018 - 04:30

విజయవాడ, మార్చి 18: ఎల్‌ఈడీ వీధిలైట్ల ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 9.19 లక్షల ఎల్‌ఈడీ వీధి లైట్లను ఏర్పాటు చేసింది. రాష్టవ్య్రాప్తంగా దాదాపు 30లక్షల ఎల్‌ఈడీ వీధిలైట్ల ఏర్పాటును పూర్తిచేసి ప్రపంచ రికార్డు సృష్టించడంపై దృష్టి సారించింది.

03/19/2018 - 04:28

విజయవాడ, మార్చి 18: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం జరిగిన వేడుకల్లో నారా దేవాన్ష్ సభలో ఉన్న కొద్దిసేపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌లతో కలిసి వచ్చారు. బాబు, దేవాన్ష్ సంప్రదాయబద్ధమైన తెల్ల దుస్తులు ధరించారు. బాబు దంపతులు తమ మనవణ్ని ఇద్దరి మధ్య సీటుపై కూర్చోబెట్టుకున్నారు.

03/19/2018 - 04:26

తిరుపతి, మార్చి 18: విభజన నేపథ్యంలో రాష్ట్రాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని సాక్షాత్తు తిరుమల శ్రీవేంకటేశ్వరుని పాదాల చెంత ఎన్నికల ప్రచారంలో నాడు ఇచ్చిన మాటను గుర్తుకు తెచ్చుకుని అమలు చేయాలని తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్ నరసింహయాదవ్, కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నల్లకోనకు చెందిన టీడీపీ కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

03/19/2018 - 04:25

భీమవరం, మార్చి 18: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఆక్వా రంగానికి ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులపై రైతులు, ఆక్వారంగ ప్రతినిధులు పెదవి విరుస్తున్నారు. గత ఏడాది కంటే కేవలం మరో రూ.100 కోట్లు అదనంగా కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకుందనే వాదన వినిపిస్తోంది. గత బడ్జెట్‌లోఈ రంగానికి రూ.286 కోట్లు కేటాయించగా ఈసారి మరో వంద కోట్ల రూపాయలను అదనంగా అంటే రూ.386 కోట్లు కేటాయించారు.

03/19/2018 - 04:24

విజయవాడ, మార్చి 18: బీజేపీ-వైకాపా మధ్య ప్రశాంత్ కిషోర్ వారథిలా మారారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. బీజేపీ సమావేశంలో ప్రశాంత్ పాల్గొనడంతో 2019 ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని స్పష్టమైందని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో మునిగిన వైకాపాకు బీజేపీ దగ్గర కావడం నీతిబాహ్యమైన చర్యగా వ్యాఖ్యానించారు.

03/19/2018 - 04:23

విజయవాడ (బెంజిసర్కిల్), మార్చి 18: వేసవిలో మంచినీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఆదివారం అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటించి పరిస్థితులను అంచనా వేయాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నీటి సరఫరా ట్యాంకర్లను పర్యవేక్షించాలన్నారు.

03/19/2018 - 04:22

విజయవాడ (బెంజిసర్కిల్), మార్చి 18: అనుక్షణం నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షిస్తూ అందుకు కృషి చేస్తున్న చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నంలో పదవీ కాంక్షతో వైఎస్ జగన్ బీజేపీతో చేతులు కలిపారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, విప్ బుద్దా వెంకన్న ఆరోపించారు.

03/19/2018 - 04:22

నర్సీపట్నం, మార్చి 18: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర ఫ్రజానీకాన్ని దగా చేశారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం విశాఖ జిల్లా నర్సీపట్నంలో విలేఖర్లతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో విశాఖ, తిరుపతిల్లో జరిగిన సభల్లో ఎపీనీ సొంత రాష్ట్రంగా తీసుకుంటానని ఇచ్చిన హామీ నాలుగేళ్ళు గడుస్తున్నా ఫలితం కనిపించలేదన్నారు.

Pages