S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/01/2018 - 00:57

అమరావతి, జనవరి 31: రాష్ట్ర రాజధాని అమరావతిలోని సచివాలయంలో స్మార్ట్ బైకులు వచ్చేశాయి. వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా నడిపి ప్రారంభించారు. దాని పనితనం చూసి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో కూడా స్మార్ట్ బైకులు ప్రవేశపెట్టాలని ఆలిండియా బైసైకింగ్ ఫెడరేషన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు.

02/01/2018 - 00:57

అమరావతి, జనవరి 31: చాలాకాలం తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రానికి చెందిన పార్టీ కోర్ కమిటీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న వివిధ అంశాలపై ఆయన కోర్ కమిటీ సభ్యులతో చర్చించనున్నారు. గురువారం ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరుకావాలని ఇప్పటికే కోర్ కమిటీ సభ్యులకు సమాచారం అందింది.

02/01/2018 - 00:56

అమరావతి, జనవరి 31: మిత్రపక్షమైన బీజేపీతో కలసి నడిచే విషయంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు స్పష్టమైన సంకేతాలిచ్చారు. పార్టీ నేతలెవరూ బీజేపీపై నోరుజారి మాట్లాడవద్దని హెచ్చరించారు. ఒకవేళ బీజేపీ నుంచి బయటకు వచ్చి ఏం చేస్తామంటూ నేతలను ప్రశ్నించడం ద్వారా, ఆ పార్టీతో తన భవిష్యత్తు వ్యూహమేమిటో చెప్పకనే చెప్పారు.

02/01/2018 - 00:55

విజయవాడ, జనవరి 31: అమెరికా పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్ డేటా సెంటర్ టీంతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ప్రముఖ ఇంజనీర్ పార్థసారథి, రామ్, యాస్పీ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ రియల్ టైం గవర్నెన్స్ ద్వారా అనేక సేవలు అందిస్తున్నామని, ఏపీలో ఫైబర్ గ్రిడ్ ద్వారా రూ.149కే ఇంటర్నెట్ టెలివిజన్ వంటి పలు సేవలు అందిస్తున్నామని తెలిపారు.

02/01/2018 - 00:54

అమరావతి, జనవరి 31: ఏప్రిల్ 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు జరిగే సంతోష నగరాల సదస్సు ద్వారా మరోసారి అమరావతి ప్రాభవాన్ని ప్రపంచానికి చాటే అవకాశం దక్కిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. సంతోష సూచికలో తొలి 50 స్థానాలలో ఉన్న నగరాలకు లేఖలు రాయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

02/01/2018 - 00:54

విజయవాడ, జనవరి 31: ఈ ఏడాది అక్టోబర్ నాటికి అమరావతిలో హైకోర్టు భవనాలు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. రూ.110 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణ పనులు ఫిబ్రవరి ఆఖరులోగాని, మార్చి మొదటివారంలో గాని ప్రారంభించనున్నామన్నారు.

02/01/2018 - 00:53

విజయవాడ, జనవరి 31: అవసరమైతే రాష్ట్రంలో కోడి పందాల నిర్వహణకు సంబంధించి చట్టం తీసుకువస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (హోం) చినరాజప్ప వెల్లడించారు. సినిమా టిక్కెట్ల ధరల పెంపు, వామపక్ష ఉగ్రవాదంపై మంత్రుల కమిటీ సమావేశాలు వెలగపూడి సచివాలయంలో బుధవారం జరిగాయి. అనంతరం ఆయన తన చాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ కోడి పందాల నియంత్రణలో పోలీసులు బాగా పని చేశారన్నారు. దాదాపు 3000 కేసులు నమోదు చేశారన్నారు.

02/01/2018 - 00:52

ఇదే ఆఖరి బడ్జెట్. మరి ఇప్పుడయినా ఆశలు ఫలిస్తాయా? విభజన హామీలు అమలుచేస్తారా? ఉత్తరాంధ్ర ప్రజల స్వప్నమైన రైల్వేజోన్ సాకారమవుతుందా? రాజధాని నగర నిర్మాణానికి సొమ్ముల సంగతేమిటి? బడ్జెట్ లోటు లెక్క ఈసారయినా తేల్చి, నిధుల విడుదల ఉంటుందా? టీడీపీ కోరుతున్నట్లు టాస్క్ఫోర్స్ ఏర్పాటుకు అంగీకరిస్తుందా? శంకుస్థాపన చేసిన విద్యాసంస్థలకు నిధుల మాటేమిటి? మొత్తంగా ఏపీపై కేంద్రం కరుణిస్తుందా?

02/01/2018 - 00:39

విజయవాడ, జనవరి 31: దేశంలోనే రొయ్యల ఎగుమతిలో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి అవుతున్న రొయ్యల్లో ఎలాంటి యాంటీ బయోటిక్స్ అవశేషాలు లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకొనేలా రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోందని రాష్ట్ర మార్కెటింగ్, గిడ్డంగులు, పశుసంవర్థక, పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమ, సహకార శాఖల మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో రూ. 20వేల కోట్ల విలువైన రొయ్యలు, రూ.

02/01/2018 - 00:37

కడప కల్చరల్, జనవరి 31: కడప నగరంలోని ప్రఖ్యాతి గాంచిన అమీన్ పీర్ దర్గా (పెద్దదర్గా)ను సినీ సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ బుధవారం తెల్లవారుజామున సందర్శించారు. పెద్దదర్గా ఉరుసు జరుగుతున్నందున కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన రెహ్మాన్ తొలుత దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా ఆశీస్సులు పొందారు. అనంతరం గంధం ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రధాన గురువుల మజార్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రసాదాన్ని స్వీకరించారు.

Pages