S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/12/2018 - 08:35

అమరావతి, జనవరి 11: రాజధాని నిర్మాణం, తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రణాళిక, ఆలోచన బాగానే ఉందని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ అభినందించారు. అయితే అవన్నీ ఆచరణలో సాధ్యం కాకపోవచ్చేమోనని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన తాత్కాలిక సచివాయంలోకి తన సహచర నేతలతో కలసి సైక్లింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు.

01/12/2018 - 07:49

రామచంద్రాపురం, జనవరి 11: ముఖ్యమంత్రిగా దివంగత వై ఎస్‌రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు విస్తారంగా వర్షాలు కురిసి రైతులు సుబిక్షంగా ఉన్నారని, చంద్రబాబు సిఎం అయ్యాక కరవు విలయతాండవం చేసిందని, ఈ పరిస్థితి చూస్తే కరవు,చంద్రబాబు కవల పిల్లలని వైకాపా అధినేత,ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అన్నారు.

01/12/2018 - 07:48

గుంటూరు, జనవరి 11: రాష్ట్రంలో పరిపాలన దుర్మార్గంగా ఉందని, జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతుంటే పోలీసులను ఉసిగొల్పి దౌర్జన్యంగా జన్మభూమి నిర్వహిస్తున్నారని ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆరోపించారు.

01/12/2018 - 07:46

జగ్గయ్యపేట, జనవరి 11: దక్షిణ భారతదేశంలోనే రెండవ డిజిటల్ కోర్టును కృష్ణాజిల్లా జగ్గయ్యపేట న్యాయస్థానంలో గురువారం సాయంత్రం హైదరాబాదులోని హైకోర్టు ప్రాంగణం నుంచి జిల్లా పోర్టుపోలియో న్యాయమూర్తి బి రామసుబ్రహ్మణ్యన్ ప్రారంభించారు. సాయంత్రం 5గంటలకు జిల్లా న్యాయమూర్తి వై లక్ష్మణరావు మచిలీపట్నం నుండి అనుసంధానం చేస్తుండగా హైదరాబాదు నుండి రామసుబ్రహ్మణ్యన్ డిజిటల్ ద్వారా ఈ న్యాయస్థానాన్ని ప్రారంభించారు.

01/12/2018 - 07:43

నెల్లూరు,జనవరి 11: నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్, అతని సోదరుడు కార్పొరేటర్ జలీల్, కుటుంబ సభ్యులపై తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మేయర్ అబ్దుల్ అజీజ్ సోదరులు స్టార్ ఆగ్రో పేరుతో మోసాలకు పాల్పడ్డారంటూ మద్రాసు సిసిబి క్రైమ్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

01/12/2018 - 14:55

పెందుర్తి, జనవరి 11: ఇక్కడకు సమీపంలోని మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో గురువారం మధ్యాహ్నం ఈతకు వెళ్లిన విద్యార్థుల్లో ఇద్దరు మునిగి గల్లంతయ్యారు. ఇక్కడి ఎన్‌ఏడీ సమీపంలోని చైతన్య కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు జగదీష్, శ్రీకర్‌లు గల్లంతయ్యారు. జగదీష్ సబ్బవరం ప్రాంతానికి చెందిన వాడు కాగా, శ్రీకర్ ఎన్‌ఏడీ ప్రాంతానికి చెందిన విద్యార్థి.

01/11/2018 - 01:56

అమరావతి, జనవరి 10: ‘ప్రపంచవ్యాప్తంగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల వల్ల ప్రజల ఆలోచనలు వేర్వేరుగా ఉంటాయి. వందల ఏళ్లుగా వ్యూహాత్మక ప్రణాళిక వల్లే అమెరికా అగ్రదేశంగా ఆవిర్భవించింది. ఆర్థిక సంస్కరణల వల్లే చైనా అగ్రగామిగా మారింది. కేవలం 40ఏళ్లలోనే జపాన్, కొరియా, సింగపూర్ దేశాలు ఆర్థికాభివృద్ధి సాధించాయి.

01/11/2018 - 01:56

నాలా బిల్లును నరసింహన్ మళ్లీ తిప్పిపంపటంపై సూచన

01/11/2018 - 01:55

విజయవాడ, జనవరి 10: త్వరలో జరిగే డీఎస్సీలో విద్యాహక్కు చట్టం కింద ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి 1:4 ప్రకారం రాష్టవ్య్రాప్తంగా హిందీ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలంటూ హిందీ సేవా సదన్ మహా విద్యాలయ ఆధ్వర్యంలో బుధవారం గొల్లపూడిలోని పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు, నిరుద్యోగులు తరలివచ్చారు.

01/11/2018 - 01:54

విజయవాడ, జనవరి 10: వివిధ విద్యాసంస్థల భవనాల ఆకృతులు విభిన్నంగా ఉండేలా చూడాలని భూ కేటాయింపులు జరిగిన వివిధ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన సీఆర్‌డీఏపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో నిర్మించనున్న అమృత విశ్వవిద్యాపీఠం తన కార్యకలాపాలను ఈ ఏడాది ఆగస్టు నుంచి ప్రారంభించనుందని సీఎంకు అధికారులు తెలిపారు.

Pages