S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/14/2018 - 04:20

విశాఖపట్నం, జనవరి 13: సంక్రాంతి పండుగతో రైళ్ళ రద్దీ విపరీతంగా ఉంటోంది. కాలేజీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, బ్యాంకులకు వరుస సెలవులు రావడంతో వీరంతా ఇళ్ళకు బయలుదేరుతున్నారు. దీంతో రైళ్ళన్నీ కిటకిటలాడుతున్నాయి. సుదూర ప్రాంతాల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌లు, ప్రత్యేకరైళ్ళు, సూపర్‌ఫాస్ట్‌లు రద్దీగా నడుస్తున్నాయి.

01/14/2018 - 04:19

విశాఖపట్నం, జనవరి 13: పండుగ నాడు సొంత ఊళ్లలో కుటుంబ సభ్యులతో కలిసి గడపాలనుకుంటున్న సగటు మనిషికి ప్రయాణ పాట్లు తప్పట్లేదు. విశాఖ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విశాఖ రాకపోకలు సాగించే ప్రయాణికులు రవాణా సదుపాయం లేక పడరాని పాట్లు పడుతున్నారు. ఇద్దరు పిల్లలతో కలిసి కుటుంబం మొత్తం ఊరెళ్లి రావాలంటే రూ.20వేల ఖర్చవుతోంది.

01/14/2018 - 04:26

గుంటూరు, జనవరి 13: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలని విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యుడు, అనకాపల్లి ఎమ్మెల్యే టీలా గోవింద సత్యనారాయణ కోరారు. గుంటూరులో ఉద్యానశాఖ కమిషరేట్‌లో శనివారం వైస్ చాన్స్‌లర్ చిరంజీవి చౌదరి అధ్యక్షతన జరిగిన విశ్వవిద్యాలయ పాలకమండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

01/14/2018 - 02:01

రామచంద్రాపురం, జనవరి 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న చంద్రబాబు దుష్టపాలనకు చరమగీతం పాడుదామని ప్రతిపక్ష నేత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. 61వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం చిత్తూరూ జిల్లా రామచంద్రాపురం మండలం రాయలచెరువుపేట గ్రామం నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించారు.

01/14/2018 - 01:59

నాగాయలంక, జనవరి 13: నవ్యాంధ్రప్రదేశ్‌లో జల క్రీడల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మం త్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా నాగాయలంకలో రూ.3 కోట్ల తో నిర్మించనున్న రాష్ట్ర జల క్రీడల అకాడమీ భవన సముదాయానికి శనివారం శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి మంత్రి రవీంద్ర శంకుస్థాపన చేశా రు.

01/14/2018 - 01:57

విజయవాడ (బెంజిసర్కిల్), జనవరి 13: అచ్చమైన తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహించిన ఫ్యాషన్ షో అందరినీ అలరించిం ది. తెలుగు వారి సంప్రదాయ పంచెకట్టు, చీరలతో హొయలొలికిస్తూ యువతీ, యువకులు ఉత్సాహంగా ఈ షోలో పాల్గొన్నారు. విజయవాడలోని బెంజిసర్కిల్ వద్ద ఉన్న ట్రెం డ్ సెట్ మాల్‌లో శనివారం మాల్‌తో పాటు 24 క్రియేటివ్ ఈవెంట్స్ సం యుక్తంగా నిర్వహించిన ఈ ఫ్యాష న్ షోకు అపూర్వ స్పందన లభించింది.

01/14/2018 - 01:57

హైదరాబాద్, జనవరి 13: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలను ఎన్నింటిని నెరవేర్చారో చంద్రబాబు ప్రభుత్వం బహిర్గతం చేయాలని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ దుగ్గరాజ పట్నం పోర్టుకు బదులుగా రెండు ఎకనామిక్ జోన్స్ ఇవ్వాలని కోరే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.

01/14/2018 - 01:57

నెల్లూరు, జనవరి 13: అవినీతి ప్రజాస్వామ్యానికి పెద్దశత్రువుగా మారిందని భారతదేశ ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణ్భారత్ ట్రస్ట్‌లో శనివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల్లో నీతివంతమైన నాయకులను ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు.

01/14/2018 - 01:52

అమరావతి, జనవరి 13: బీజేపీకి చెందిన మంత్రి మాణిక్యాలరావు- పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ జడ్పీ చైర్మన్ బాపిరాజు, తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ మధ్య ముదురుతున్న మాటల యుద్ధం చివరకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి వెళ్లింది. వారి మధ్య ఇటీవలి కాలంలో జరుగుతున్న ఆధిపత్యపోరు మీడియాకెక్కడంతో సీఎం చంద్రబాబునాయుడు శనివారం ఆ అంశంపై పార్టీ నేతలతో చర్చించారు.

01/14/2018 - 01:52

రాచర్ల, జనవరి 13: అప్పులబాధ భరించలేక భార్యను హత్యచేసి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని అచ్చంపేట గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు బేస్తవారపేట మండలం వంగపాడు గ్రామానికి చెందిన కామిరెడ్డి కాశిరెడ్డి (57) అచ్చంపేట గ్రామానికి మూడేళ్ల క్రితం వలసవచ్చి భూములను కౌలు తీసుకొని జీవనం సాగిస్తున్నాడు.

Pages