S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/13/2018 - 01:50

తిరుపతి, జనవరి 12: పుత్తూరు నుంచి చెన్నయ్ వెళుతున్న నెంబర్ 125 తమిళనాడు బస్సును, కడపకు వెళుతున్న కంటైనర్ ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు ఏర్పేడు మండలం నయనారు కండ్రిగ వద్ద చోటు చేసుకుంది. ఈ సంఘటనలో బస్సులోని 26 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

01/13/2018 - 01:49

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 12: ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న పిచ్చి తుగ్లక్ చర్యలతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారని, అచ్చేదిన్‌లు ఇస్తామని చెప్పి ఇప్పుడు చచ్చే దిన్‌లు ఇస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి శుక్రవారం ధ్వజమెత్తారు.

01/13/2018 - 01:49

గూడూరు, జనవరి 12: తూర్పు రాయల సీమ ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులురెడ్డికి నెల్లూరు జిల్లా గూడూరు ఫస్ట్ క్లాస్ అదనపు జ్యుడిషియల్ న్యాయమూర్తి లావణ్య రెండేళ్ల జైలు శిక్ష, రూ.4700 జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు.

01/12/2018 - 14:58

గుంటూరు, జనవరి 11: మిర్చికి గిట్టుబాటుధరపై ప్రభుత్వం గత ఏడాది సీజన్‌లో ప్రకటించిన చంద్రన్న రాయితీలో భారీగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే కలెక్టర్ ఐదుగురు కాంట్రాక్టు ఎంపీఈఓలను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. వ్యవసాయ, ఉద్యానవనశాఖలకు చెందిన మరి కొందరు ఉద్యోగులు, అధికారులకు ఉచ్చు బిగుసుకుంటోంది.

01/12/2018 - 14:58

విజయవాడ, జనవరి 11: బీజేపీ వారంతా దేశద్రోహులని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి పీ దిలీప్ ఖండించారు.

01/12/2018 - 14:57

కాకినాడ, జనవరి 11: ఆంధ్రప్రదేశ్‌లో వివిధ వర్గాల సంక్షేమానికి సుమారు రూ.60 వేల కోట్లు వెచ్చిస్తున్నట్టు ఆర్ధిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ.లక్షా 56వేల కోట్లు కాగా ఇందులో సుమారు రూ.60 వేల కోట్లు సంక్షేమ రంగానికి వెచ్చిస్తున్నట్టు పేర్కొన్నారు. సుమారు 50 లక్షల మందికి వివిధ రకాల పింఛన్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.

01/12/2018 - 14:57

విజయవాడ, జనవరి 11: పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్టును సత్వరం పూర్తిచేయాలన్న సంకల్పంతో తాము చేసిన మహాపాదయాత్ర, సామూహిక సత్యాగ్రహంపై సీఎం చంద్రబాబు.. ఆయన తాబేదారులు చేసిన కువిమర్శలు, దుష్ప్రచారం అనైతికమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. అయితే పోలవరంపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అంటూ చంద్రబాబుకు రఘువీరా గురువారం బహిరంగ లేఖ రాశారు.

01/12/2018 - 08:49

విజయవాడ, జనవరి 11: పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్టును సత్వరం పూర్తిచేయాలన్న సంకల్పంతో తాము చేసిన మహాపాదయాత్ర, సామూహిక సత్యాగ్రహంపై సీఎం చంద్రబాబు.. ఆయన తాబేదారులు చేసిన కువిమర్శలు, దుష్ప్రచారం అనైతికమని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. అయితే పోలవరంపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అంటూ చంద్రబాబుకు రఘువీరా గురువారం బహిరంగ లేఖ రాశారు.

01/12/2018 - 14:59

విజయవాడ, జనవరి 11: జన్మభూమి - మా ఊరు కార్యక్రమంతో ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వెల్లడించారు. విజయవాడలోని సీఎంవోలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రజల సంతృప్తి స్థాయి 58 శాతంగా ఉండేదని, జన్మభూమి కార్యక్రమం తరువాత ఇది 65 శాతానికి పెరిగిందన్నారు.

01/12/2018 - 08:40

అమరావతి, జనవరి 11: ‘మన జన్మభూమి దేశంలోనే వినూత్న కార్యక్రమం, ఇతర రాష్ట్రాలకు గొప్ప నమూనా వంటిది. ఇంత పెద్దఎత్తున కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం గతంలో మరే రాష్ట్రంలోనూ జరగలేదని’ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం తన నివాసం నుంచి 10వ రోజు జన్మభూమి నిర్వహణపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

Pages