S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/05/2017 - 04:10

విజయవాడ, నవంబర్ 4: రాష్టవ్య్రాప్తంగా ఇటీవలి కాలంలో ఎసిబి దాడుల్లో కోట్లాది రూపాయల అక్రమాస్తులు వెలుగు చూస్తుండగా, ప్రభుత్వ ఖజానా కార్యాలయాల్లో జేబులు నింపుకుంటున్న అవినీతి సిబ్బంది మాత్రం దర్జాగా తమ పని కానిస్తుండటంపై విస్మయం వ్యక్తవౌతోంది. ఖజానా కార్యాలయాల నుంచి వందల కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము అక్రమార్కుల పాలైన ఉదంతాలెన్నో గత ఏడాది కాలంగా వెలుగుచూశాయి.

11/05/2017 - 04:09

రాజమహేంద్రవరం, నవంబర్ 4: రాష్ట్రంలోని అన్ని దేవాలయాల భూములపై ఆన్‌లైన్ నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా 6ఎ, 6బి కేటగిరి ఆలయాలకు చెందిన భూములను ఆన్‌లైన్ ద్వారా పర్యవేక్షించేందుకు జియో ట్యాగింగ్ చేస్తున్నారు. దీనితో పాటు ప్రధాన ఆలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు.

11/05/2017 - 04:09

విశాఖపట్నం, నవంబర్ 4: నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాలోని పలు చోట్ల తెలికపాటి వర్షాలు, ఒకటిరెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

11/05/2017 - 04:08

కర్నూలు, నవంబర్ 4: రైతు నుంచి రూ.5 వేలు లంచం తీసుకున్న విఆర్‌ఓ వెంకటేశ్వర్లును కర్నూలు జిల్లా ఎసిబి అధికారులు శనివారం అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా పూడూరు గ్రామానికి చెందిన రైతు పురుషోత్తంగౌడ్ తన పొలానికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే పుస్తకం ఇచ్చేందుకు విఆర్‌ఓ వెంకటేశ్వర్లు రూ.5 వేలు లంచం డిమాండ్ చేశాడు.

11/05/2017 - 04:08

హిందూపురం, నవంబర్ 4: మహిళపై జరుగుతున్న అకృత్యాలపై పోరాటం చేస్తున్న క్రాస్‌బౌ ప్రాజెక్టు వ్యవస్థాపకురాలు శ్రీస్తిబక్షి చేపట్టిన పాదయాత్ర శనివారం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన పాదయాత్ర జిల్లా సరిహద్దు కొడికొండ చెక్‌పోస్టుకు చేరుకోవడంతో కలెక్టర్ వీరపాండ్యన్, ఇతర అధికారులు ఆమెకు స్వాగతం పలికారు.

11/05/2017 - 02:17

గుంటూరు (పట్నంబజార్), నవంబర్ 4: బిసి కమిషన్‌కు చట్టబద్ధత కల్పించింది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వమేనని బిజెపి మహిళామోర్చా జాతీయ ఇన్‌చార్జి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి అన్నారు. 1955లో ఖేల్కర్ కమిటీ ఇచ్చిన నివేదికను అప్పటి ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని, మండల్ కమిషన్ అమలుకు నోచుకోలేదన్నారు.

11/05/2017 - 02:16

హైదరాబాద్, నవంబర్ 4: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలు అంతర్గత పదవులను భర్తీ చేస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు.

11/05/2017 - 04:57

హైదరాబాద్, నవంబర్ 4: పార్టీకి సేవలు అందించడానికి సమన్వయకర్తలను నియమించాలని జనసేన నిర్ణయించింది. ప్రస్తుతం ఈ నియామకాలు పార్లమెంటు నియోజకవర్గాలకు పరిమితమవుతాయి. జనసేన ఔత్సాహిక శిబిరాలను ఏర్పాటు చేసినపుడు సుమారు 65వేల మంది దరఖాస్తు చేశారు. ఈ డేటా అంతా జనసేన ఐటి విభాగంలో రికార్డుయింది. వీరిలో సుమారు ఎనిమిది వేల మందితో తొలి వడపోత జరిగింది. ఈ 8వేల మందిని జనసేన ఔత్సాహిక శిబిరాలకు ఆహ్వానిస్తారు.

11/05/2017 - 02:15

విజయవాడ, నవంబర్ 4: నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని కుడి, ఎడమ కాల్వల కింద కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇప్పటికే సాగుచేసిన పంటలకు వెంటనే సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ అపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, కుడి, ఎడమ కాల్వల ప్రాజెక్టు కమిటీ చైర్మన్లు గుంటుపల్లి వీర భుజంగరాయులు (గుంటూరు), వై పుల్లయ్య చౌదరి (కృష్ణా), డిస్ట్రి

11/05/2017 - 02:14

విశాఖపట్నం, నవంబర్ 4: ప్రఖ్యాత రచయిత, సినీ నటుడు, పాత్రికేయుడు గొల్లపూడి మారుతీరావుకు గీతం విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనుంది.

Pages