S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/04/2017 - 04:25

విజయవాడ, నవంబర్ 3: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల 6న ప్రారంభవౌతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ప్రకటించారు. నగరంలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్ర వైఎస్సార్ కడప జిల్లా నుంచి ఇచ్ఛాపురం వరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కొనసాగుతుందని తెలిపారు.

11/04/2017 - 04:25

విజయవాడ, నవంబర్ 3: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం నిర్వహించాలని ఎపి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నిర్ణయించినట్లు నాయకులు చలసాని శ్రీనివాస్, కె రామకృష్ణ తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకూ ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలను వారు వివరించారు.

11/04/2017 - 04:24

శ్రీశైలం, నవంబర్ 3 : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్యంగా పౌర్ణమి పురస్కరించుకుని పుణ్యనదీ హారతి, లక్ష దీపోత్సవం, జ్వాలా తోరణం, పుష్ప ప్రదర్శన కార్యక్రమాలు కన్నుల పండువగా సాగాయి. కార్తీక పౌర్ణమి కావడంతో ఆలయ పరిసరాలు, పురవీధులు భక్తులతో పోటెత్తాయి.

11/04/2017 - 04:21

తెనాలి, నవంబర్ 3: తుక్కు ఇనుము నుంచి విగ్రహాల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన గుంటూరు జిల్లా తెనాలి శిల్పి కాటూరి రవిచంద్ర తయారు చేసిన మేకిన్ ఇండియా తరహా సింహాన్ని శుక్రవారం సింగపూర్ పంపటం కోసం తెనాలి నుండి తరలించారు. సింగపూర్‌లోని జ్ఞాని ఆర్ట్ గ్యాలరీ వారితో చేసుకున్న ఒప్పందం మేరకు గత సంవత్సరం ఆయన కొన్ని విగ్రహాలు తయారుచేసి ఇచ్చారు.

11/04/2017 - 02:24

అనంతపురం, నవంబర్ 3 : ప్రపంచంలోనే అరుదైన, అత్యంత ఖరీదైన ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాకు అనంతపురం జిల్లా రహదారులు రాచమార్గాలుగా మారా యి. సరిహద్దు జిల్లాలైన కడప, చిత్తూరు జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం వృక్షాలు విస్తరించి ఉన్నాయి. దీంతో ఆ అడవుల్లోని ఎర్రచందనం వృక్షాలను అక్రమంగా నరికి దుంగలను జిల్లా మీదుగా రవాణా చేయడం పరిపాటిగా మారింది.

11/04/2017 - 02:23

విశాఖపట్నం, నవంబర్ 3: నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో అల్పపీడనం ఏర్పడినట్టు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలియజేశారు. దీని ప్రభావం వలన తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురియనున్నాయి.
అలాగే, దక్షిణ కోస్తాలో కూడా ఒకటి, రెండు చోట్ల జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పారు. దక్షిణ కోస్తాలో గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలియచేశారు.

11/04/2017 - 02:23

విశాఖపట్నం, నవంబర్ 3: బహుళ ప్రయోజనాలు, డిమాండ్‌కు అనుగుణంగా మెరుగైన విద్యుత్ సరఫరాను అందించేందుకు వీలుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యాధునిక విద్యుత్ సబ్‌స్టేషన్లు రానున్నాయి. ఇందులో 30 ఇండోర్ సబ్‌స్టేషన్లను ప్రత్యేకించి నగరంలో నిర్మిస్తారు. ఇవి కాకుండా విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరో 16 సబ్‌స్టేషన్లు నిర్మించనుంది. ఇందుకోసం రూ.200 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

11/04/2017 - 02:22

సింహాచలం, నవంబర్ 3: ప్రముఖ శ్రీవైష్ణవ క్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారికి భక్తులు కానుకల రూపంలో సమర్పిస్తున్న కోడెదూడల అవకతవకలపై త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభించింది. దేవస్థానానికి వస్తున్న కోడెదూడల వ్యవహరంలో అవకతవకలు జరుగుతున్నాయని ఇటీవల జంతు సంరక్షణ సంస్థలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసాయి.

11/04/2017 - 02:20

విజయవాడ, నవంబర్ 3: స్టువర్టుపురం దొంగలు, నాందేడ్, కంజరభట్ ముఠాలు రాష్ట్రంపై దోపిడీకి దిగడానికి, జగన్ తన తోటి ముద్దాయిలతో కలిసి పాదయాత్ర చేయటానికి తేడా ఏమీలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు.

11/04/2017 - 02:18

రాజమహేంద్రవరం, నవంబర్ 3: తాను మొదటి నుంచి చెబుతున్నట్టు పోలవరం ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, రాష్ట్రానికి జీవనాడి అయిన ఈ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం తగదని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలపై చూపించే శ్రద్ధ పోలవరం ప్రాజెక్టుపై చూపించి ఉంటే ఇప్పటికే పూర్తయ్యేదన్నారు.

Pages