S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/03/2017 - 03:57

విజయవాడ, నవంబర్ 2: ప్రభుత్వం రాష్ట్రంలో గృహ నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సమాచార, పౌర సంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. వెలగపూడి సచివాలయం 5వ బ్లాక్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం 13 జిల్లాలకు చెందిన ఆ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, అధికారులతో ఆయన సమావేశమై ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ప్రగతిని సమీక్షించారు.

11/03/2017 - 03:52

రాజమహేంద్రవరం, నవంబర్ 2: అసెంబ్లీలో మాట్లాడటానికి, ప్రజా సమస్యలను చర్చించడానికి విపక్షానికి అవకాశం ఇవ్వడంలేదని, అందుకే శాసనసభ కంటే ప్రజాసభే నయమని, ప్రజలతో మమేకం కావడానికి జగన్ పాదయాత్రకు సిద్ధమయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. జగన్ పాదయాత్ర తేదీలు నిర్ణయించిన తర్వాతే అసెంబ్లీ తేదీలు ప్రకటించారన్నారు.

11/03/2017 - 03:51

హైదరాబాద్, నవంబర్ 2: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న అవినీతి కార్యకలాపాలను ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందని వైఎస్‌ఆర్‌సిపి ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు.

11/03/2017 - 03:51

చిత్తూరు, నవంబర్ 2: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికె బాబు అలియాస్ జయచంద్రారెడ్డి, ఆయన సతీమణి డాక్టర్ సికె లావణ్యబాబు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం బెంగళూరు పాత ఎయిర్‌పోర్టులోని విఐపి లాంజ్‌లో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకుని లాంఛనంగా పార్టీలో చేరారు.

11/03/2017 - 03:49

గుడివాడ, నవంబర్ 2: కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కమిషనర్ ఎన్ ప్రమోద్‌కుమార్ గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. లక్షా 10 వేల రూపాయల నగదు లంచంగా తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఆయన దొరికిపోయారు. విజయవాడ అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ ఎస్‌వివి ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం..

11/03/2017 - 03:48

అరకులోయ, నవంబర్ 2: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 1380 కోట్ల రూపాయలతో రహదారులు నిర్మించనున్నట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. గురువారం ఆయన విశాఖ జిల్లా అరకులోయలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో నూతన రహదారులు నిర్మించి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి బాట వేస్తామని చెప్పారు.

11/03/2017 - 03:47

అనంతపురం, నవంబర్ 2: వ్యసనాలకు బానిసై విచక్షణ కోల్పోయి డబ్బు కోసం కన్నతల్లిని హత్యచేసిన కొడుకుకు అనంతపురం జిల్లా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. పోలీసులు, ప్రాసిక్యూషన్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా గార్లదినె్న మండలం కల్లూరు ఆర్‌ఎస్‌కు చెందిన సయ్యద్‌ఖాజా వలీకి భార్య, పిల్లలు ఉన్నారు. అనుమానంతో భార్య షేక్ మున్నా బేగంను 2011లో హత్య చేశాడు.

11/03/2017 - 03:47

నిడదవోలు, నవంబర్ 2: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన అగ్నిప్రమాదంలో ఒక వృద్ధురాలు మంచంపైనే సజీవ దహనమయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో గురువారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానిక శాంతినగర్‌లో ఒక భవనం రెండవ అంతస్తులో యర్రా బుల్లెమ్మ తన కుమారుడు యర్రా నాగ వెంట సాయికృష్ణ, అత్తయ్య యర్రా సర్వలక్ష్మి (75)తో నివసిస్తున్నారు.

11/03/2017 - 03:46

ఆదోని, నవంబర్ 2: పత్తిరైతు మరోసారి నష్టాలను మూటగట్టుకుంటున్నాడు. కర్నూలు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు పంట మొత్తం తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిగిలిన అరకొర పంటను కోసి మార్కెట్‌కు తరలించగా అక్కడ గిట్టుబాటు ధర లభించలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో పత్తిరైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సిసిఐ సంస్థ రంగంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించని పరిస్థితి.

11/03/2017 - 03:43

విజయవాడ, నవంబర్ 2: రాష్ట్రంలో త్వరలో ఎలక్ట్రికల్ వాహన విధానాన్ని తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి అభివృద్ధికి సహకరించాలని కోరుతూ బెంగళూరులో వివిధ సంస్థల ప్రతినిధులతో గురువారం ఆయన సమవేశమై చర్చించారు. ఓలా క్యాబ్స్ ఫౌండింగ్ పార్టనర్ ప్రణయ్‌తో భేటీ అయ్యారు.

Pages