S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/25/2017 - 02:20

అమరావతి, అక్టోబర్ 24: ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు వివాదాస్పద రచయిత కంచ ఐలయ్యకు దళిత సంఘాలు తలపెట్టిన సన్మానం ఏపి పోలీసులకు తలనొప్పిలా పరిణమించింది. ఐలయ్య రచించిన సామాజికస్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకం రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాదం, ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్న నేపథ్యంలో ఈనెల 28న విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో ఆయనకు సన్మానం చేయాలని దళిత సంఘాల జేఏసీ నిర్ణయించింది.

10/25/2017 - 02:19

విశాఖపట్నం, అక్టోబర్ 24: తీర భద్రత కోసం ఏర్పాటు చేసిన కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ వ్యవస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. తీర భద్రత కోసం కేటాయించిన ఫాస్ట్ ఇంటర్‌సెప్టర్ బోట్లను నడిపేందుకు కావల్సిన డీజిల్ డబ్బులు కూడా లేని దయనీయ పర్థితులను ఎదుర్కొంటోంది. సిబ్బంది లేక విలవిల్లాడుతోంది. నిధులు లేక ముందుకు సాగలేకపోతోంది. ముంబై దాడులు తరువాత తీర భద్రతకు కేంద్రం అధిక ప్రాధాన్యం ఇచ్చింది.

10/25/2017 - 02:17

తెనాలి, అక్టోబర్ 24: గుంటూరు మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంబిబిఎస్ చదువుతున్న విద్యార్థిని అలినావజర్ తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలోని వాటర్ ట్యాంకుపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఈప్రాంతంలో సంచలనం రేపింది. త్రీటౌన్ పోలీసుల కధనం ప్రకారం.. కాకినాడకు చెందిన బొమ్మారెడ్డి అనిలావజర్(20) గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ ప్రథమ సంవత్సరం చదువుతోంది.

10/24/2017 - 04:36

తిరుపతి, అక్టోబర్ 23: పవిత్ర నాగులచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ మలయప్పస్వామి తన ఉభయదేవేరులైన శ్రీదేవి, భూదేవిలతో కూడి ఏడు పడగల పెద్దశేష వాహనంపై సోమవారం సాయంత్రం తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. కాగా దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగులచవితిగా వ్యవహరిస్తారు. శ్రావణ శుద్ధ చతుర్థినాడు కూడా ఈ పండుగను జరుపుకుంటారు.

10/24/2017 - 04:34

సింహాచలం, అక్టోబర్ 23: రాజ్యాంగంలో సవరణ తీసుకువస్తే దేశ వ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ సాధ్యమేనని తెలుగు రాష్ట్రాల ప్రధాన ఎన్నికలాధికారి భన్వర్‌లాల్ అభిప్రాయ పడ్డారు. సోమవారం ఆయన కుటుంబంతో సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకున్నారు.

10/24/2017 - 04:34

విజయవాడ, అక్టోబర్ 23: నిరుద్యోగ భృతి చెల్లింపునకు వీలైనంత త్వరగా తుదిరూపు తీసుకురావాలని అధికారులను రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో నిరుద్యోగ భృతికి సంబంధించి విధాన రూపకల్పనపై ఆయన సోమవారం అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగ భృతి చెల్లింపునకు అర్హత, ప్రాతిపదికను ఖరారు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

10/24/2017 - 04:33

విశాఖపట్నం, అక్టోబర్ 23: సముద్ర మార్గాన గ్లోబ్‌ను చుట్టి వచ్చేందుకు నావికా సాగర్ పరిక్రమ పేరుతో ఆరుగురు నేవీ మహిళలతో గత నెల 10న గోవా నుంచి బయల్దేరిన తరిణి నౌక సోమవారం ఆస్ట్రేలియాలోని ప్రిమెంటెల్ పోర్టుకు చేరుకుంది.

10/24/2017 - 04:32

కాకినాడ, అక్టోబర్ 23: కాకినాడ బీచ్ ఫెస్టివల్-2018 నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈ ఫెస్టివల్‌ను రెండు సంవత్సరాలుగా రాష్టస్థ్రాయి ఉత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈదఫా కూడా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి ఏర్పాట్లుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇక్కడ బీచ్ ఫ్రంట్ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నారు.

10/24/2017 - 04:31

విజయవాడ, అక్టోబర్ 23: నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న అక్రమ హేచరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(సిఎస్) దినేష్ కుమార్ ఆదేశించారు. నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై సోమవారం జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఆక్వా సాగులో యాంటిబయోటిక్స్ వినియోగం తగ్గించాలన్నారు.

10/24/2017 - 04:31

విశాఖపట్నం, అక్టోబర్ 23: దక్షిణాది రాష్ట్రాల్లో ఎదుగుదలకు బిజెపి వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆపార్టీ జాతీయ అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారావు స్పష్టం చేశారు.

Pages