S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/27/2017 - 04:01

గుంటూరు, అక్టోబర్ 26: ప్రొఫెసర్ కంచె ఐలయ్యకు మా వల్ల ప్రాణహాని ఉందని ప్రకటించారని, అయితే ఆయనకు తాము రక్షణ కల్పిస్తామని ఆర్యవైశ్య, బ్రాహ్మణ ఐక్యవేదిక నాయకులు ప్రకటించారు.

10/27/2017 - 03:54

విజయవాడ, అక్టోబర్ 26: దేశంలో పెద్దనోట్లు రద్దుచేసి నవంబరు 8వ తేదీ నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజు నిరసన దినంగా పాటించాలని కేంద్రంలోని ఆరు వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడించారు.

10/27/2017 - 03:54

హైదరాబాద్, అక్టోబర్ 26: వచ్చే నెల 6వ తేదీన కడప జిల్లా ఇడుపుల పాయ నుంచి వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టే పాదయాత్రకు ప్రజా సంకల్ప యాత్రగా నామకరణం చేశారు. ఈ పాదయాత్ర 125 అసెంబ్లీ నియోజకవర్గాల ద్వారా మూడు వేల కి.మీ సాగుతుందని, పార్టీకి నూతనోత్తేజం తెచ్చి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వైకాపా అధ్యక్షుడు జగన్ ఈ యాత్ర చేపట్టినట్లు వైకాపా ప్రకటించింది.

10/27/2017 - 03:53

విజయవాడ, అక్టోబర్ 26: రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యాలతో కొత్తగా చేపడుతున్న 11 ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌తో పాటు వైద్య ఆరోగ్యశాఖ, రోడ్లు భవనాల శాఖ, రైల్వే శాఖకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

10/27/2017 - 03:53

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేకనే వైఎస్‌ఆర్‌సీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. వైఎస్‌ఆర్‌సీపీ కుంటిసాకులతో శాసనసభ నుంచి పారిపోతోందని ఆయన ధ్వజమెత్తారు.

10/27/2017 - 03:50

ఓబుళదేవరచెరువు, అక్టోబర్ 26: రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి మార్గాలు చూపడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. జనం కోసం జెపి సురాజ్య యాత్రలో భాగంగా గురువారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఓబులదేవరచెరువులోని విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.

10/27/2017 - 03:47

కాకినాడ, అక్టోబర్ 26: అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను ఇక నుండి ఆన్‌లైన్‌లో సంబంధిత శాఖలు జారీ చేయనున్నాయి. స్కానింగ్ సెంటర్ల ఏర్పాటుతోపాటు రెన్యువల్స్‌కు కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. స్కానింగ్ సెంటర్ల వివరాలను ఇకనుండి ఎప్పటికపుడు ఆన్‌లైన్‌లో పర్యవేక్షించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

10/27/2017 - 03:46

విజయవాడ, అక్టోబర్ 26: ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పిఎంజిఎస్‌వై) కింద రాష్ట్రానికి 355 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా మంజూరు చేసింది. 109 రోడ్లను, 96 వంతెనలను ఈ నిధులతో నిర్మిస్తారు. 243 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఈ మొత్తంలో 170 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా భరించాల్సి ఉంటుంది.

10/27/2017 - 03:46

విజయవాడ, అక్టోబర్ 26: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నవంబర్ 1న వెలగపూడి సచివాలయంలో జరుగునుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. నిరుద్యోగ భృతి, రానున్న అసెంబ్లీ సమావేశాలు, సిఎం విదేశీ పర్యటన తదితర అంశాల గురించి చర్చించనున్నారు.

10/27/2017 - 02:46

విజయనగరం, అక్టోబర్ 26: సరదాగా సెల్ఫీ తీసుకుందామనుకున్న ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. ఒడిశాలోని రాయగడలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి లభించిన వివరాల ప్రకారం గురువారం విశాఖపట్నం నుంచి తొమ్మిది మంది రాయగడ మజ్జి గౌర మ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు బయలుదేరారు. అమ్మవారి దర్శనం తరువాత అక్కడ తీగ వం తెన వద్ద సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లి న జ్యోతి, దేవి నదిలోకి జారిపడ్డారు.

Pages