S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/25/2017 - 03:33

గుంటూరు, అక్టోబర్ 24: సుదీర్ఘ విరామానంతరం నల్లమలలో మరోసారి మావోయిస్టుల కదలికలు కనిపిస్తున్నాయి. ఈ అంశం పోలీసువర్గాలకు కునుకు పట్టకుండా చేస్తోంది. గతంలో ఇదే అటవీ ప్రాంతం నుంచి పోలీసులకు మావోయిస్టులు సవాల్ విసిరిన సందర్భాలనేకం ఉన్నాయి.

10/25/2017 - 03:31

శ్రీకాకుళం, అక్టోబర్ 24: రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సోషల్ ఎమర్జన్సీ అండ్ రెస్పాన్స్ వాలంటీర్(ఎస్.ఇ.ఆర్.వి) కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఇక్కడి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా రెడ్‌క్రాస్ నిర్వహించిన ఈ సర్వ్ కార్యక్రమానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కాల్ అంబులెన్స్ యాప్‌ను సైతం ప్రారంభించారు.

10/25/2017 - 03:29

ఒంగోలు, అక్టోబర్ 24: ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనర్హుడని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో ఆయన మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా మార్టూరు, అద్దంకిలలో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధానంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన ప్రసంగం కొనసాగింది.

10/25/2017 - 03:28

తిరుపతి, అక్టోబర్ 24: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితా సవరణను నవంబర్ నెలాఖరులోగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్‌లు, ఇఆర్‌ఓలతో ఆయన సమావేశమై ఓటర్ల జాబితా పూర్తి సవరణపై సమీక్షించారు.

10/25/2017 - 03:27

మడకశిర, అక్టోబర్ 24: రాజధాని నిర్మాణం ఏమాత్రం ముందుకు సాగడం లేదని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. రాజధాని నిర్మాణం పూర్తికావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితేనే సాధ్యమవుతుందని అన్నారు. అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నిర్మాణంపై గోప్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీని వల్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదన్నారు.

10/25/2017 - 03:26

హొళగుంద, అక్టోబర్ 24: లోక్‌సభకు 2019లో జరిగే ఎన్నికల్లో కర్నూలు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఎంపి బుట్టారేణుక పేర్కొన్నారు. కర్నూలు జిల్లా హొళగుందలో మంగళవార ఆమె విలేఖరులతో మాట్లాడుతూ తాను ఇప్పటికే టిడిపికి మద్దతు ఇచ్చానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న రాష్ట్భ్రావృద్ది సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితురాలనై పార్టీకి మద్దతుగా నిలిచానన్నారు.

10/25/2017 - 03:26

బుచ్చెయ్యపేట, అక్టోబర్ 24: విశాఖపట్నం జిల్లా, బుచ్చెయ్యపేట మండలంలోని వడ్డాది కొత్తూరుకు చెందిన వెలగుల పూజ పల్లవి అనే అయిదేళ్ళ చిన్నారిపై ఉపాధ్యాయిని తన ప్రతాపాన్ని చూపించింది. విద్యార్థిని తండ్రి వెలుగుల నాగేశ్వరరావు అందించిన వివరాలివి. వడ్డాదిలోని ఎన్‌టిఎస్ ప్రైవేట్ పాఠశాలలో పూజపల్లవి యుకెజి చదువుతోంది. హోం వర్క్ చేయలేదని విద్యార్థిని చేయిపై క్లాస్ టీచర్ కర్రతో కొట్టింది.

10/25/2017 - 02:22

తిరుపతి, అక్టోబర్ 24: తిరుమలలో విలేఖరినని చెప్పుకుంటూ దర్శనం, లడ్డూల అనుమతులు పొంది భక్తుల నుంచి అధిక మొత్తంలో నగదు తీసుకుని ధనార్జనకు పాల్పడుతున్న శ్రీనివాసులు అనే వ్యక్తిని తిరుమల వన్‌టౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సిఐ వెంకటరవి కథనం మేరకు శ్రీనివాసులు అనే యువకుడు టి 5 చానల్ పేరుతో తిరుమలలో తిరిగేవాడన్నారు.

10/25/2017 - 02:21

హైదరాబాద్, అక్టోబర్ 24: విశాఖపట్నంలోని హెచ్‌పిసిఎల్ విస్తరణను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషనర్ ప్రస్తావించిన అభ్యంతరాలపై స్పందించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కాలుష్య నియంత్రణమండలికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈకేసులో పిటిషనర్ విశాఖ పవన్ ప్రజా కార్మిక సంఘం తరఫున న్యాయవాది బి రచనారెడ్డి వాదనలు వినిపించారు.

10/25/2017 - 02:21

తిరుపతి, అక్టోబర్ 24: కపిలతీర్థం వద్దనున్న అటవీ ప్రాంతంలో రెండున్నర సంవత్సరాలున్న చిరుత మంగళవారం బోనులో చిక్కింది. గత 15 రోజులుగా ఒక పెద్ద చిరుత, దాని పిల్లగా భావిస్తున్న చిన్న చిరుతపులి కపిలతీర్థం అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.

Pages