S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/30/2017 - 03:12

కోట, జూన్ 29: ప్లాస్టిక్ బియ్యంపై సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న తరుణంలో నెల్లూరు జిల్లా కోట పట్టణంలో ప్లాస్టిక్ కోడిగుడ్లు ప్రత్యేక్షం కావడంతో మండల ప్రజలు హడలిపోతున్నారు. సహజంగా కోడిగుడ్డు ఉడకపెట్టనిదే దానిపై కప్పు ఊడదు. అలాగే ప్రతి గుడ్డులో తెల్లసొనతో పాటు పచ్చసొన కూడా ఉంటుంది.

06/30/2017 - 02:51

విజయవాడ, జూన్ 29: ప్రభుత్వ విద్యాలయాల బలోపేతమే లక్ష్యంగా ప్రతి పాఠశాలలోనూ పూర్తిస్థాయి వౌలిక సదుపాయాలు కల్పించనున్నామని, ఇందుకోసం రూ.4,139 కోట్లను ఖర్చు చేయనున్నామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నవ్యాంధ్ర అనేక కష్టాల్లో ఉన్నప్పటికీ విద్యారంగానికి సిఎం చంద్రబాబునాయుడు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు.

06/30/2017 - 02:48

విజయవాడ, జూన్ 29: సినీ పరిశ్రమ రాష్ట్రానికి తరలి రావాలని, అందుకోసం ఆ పరిశ్రమకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) దినేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయం ఒకటవ బ్లాక్‌లోని తన చాంబర్‌లో గురువారం సాయంత్రం జరిగిన ప్రణాళిక, సేవారంగం, టాస్క్ఫోర్స్ సమీక్షా సమావేశంలో రాష్ట్రానికి సినీ పరిశ్రమ తరలిరావడంపై చర్చించారు.

06/30/2017 - 02:28

భీమవరం, జూన్ 29: ఆదాయ పన్ను శాఖ పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్)కు ఆధార్ అనుసంధానం ప్రక్రియ ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తోంది. జూన్ 30వ తేదీ అనుసంధానానికి చివరి తేదీ అని గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా పెద్దగా పట్టించుకోని ప్రజలు ఇక రెండు రోజులే మిగిలివుండటంతో హడావుడి పడుతున్నారు.

06/30/2017 - 02:27

అమరావతి, జూన్ 29: రాజధాని ప్రజల సౌకర్యార్థం అమరావతిలో నైట్ సఫారీ ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. సింగపూర్ తరహాలో ఈ నైట్ సఫారీని ఏర్పాటు చేయాలని సిఎం చంద్రబాబునాయుడు ఆదేశించారన్నారు. విశాఖ, తిరుపతిలో ఉన్న జూలను నైట్ సఫారీలుగా అభివృద్ధి చేయనున్నామన్నారు.

06/30/2017 - 02:26

అమరావతి, జూన్ 29: దేవాలయ పర్యాటకాన్ని పెంపొందించేందుకు పర్యాటక బోర్డు పలు నిర్ణయాలు తీసుకుంది. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని మార్గాలను అనే్వషిస్తున్న పర్యాటకశాఖ నూతనంగా 6 ఆధునిక వోల్వో బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం దాదాపు రూ.9 కోట్లను వ్యయం చేయనున్నారు. సచివాలయంలో పర్యాటక అభివృద్ధి సంస్థ బోర్డు సమావేశం జరిగింది.

06/30/2017 - 02:26

విజయవాడ(బెంజిసర్కిల్), జూన్ 29: వ్యక్తి గత ఇమేజ్ కోసం వైకాపా నాయకులు పాకులాడుతున్నారని, లేని పోని విషయాలపై రాద్ధాంతం చేసి పబ్బం గడుపుకోవానుకుంటున్నారని విశాఖ జిల్లా పాయకరావుపేట శాసన సభ్యురాలు వంగలపూడి అనిత విమర్శించారు. రాజకీయ లబ్ధికోసం అనవరస ఆరోపణలు చేయడం వైకాపా ఎమ్మెల్యే రోజాకు అలవాటుగా మారిందన్నారు.

06/30/2017 - 02:25

తిరుపతి, జూన్ 29: ఖరీఫ్‌లో రైతులకు విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఉదయం మంత్రి సోమిరెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతోమాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు ప్రభావం వ్యవసాయ రుణాల మంజూరుపై పడిందని అన్నారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకి రూ.

06/30/2017 - 02:25

కాకినాడ, జూన్ 29: ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మి వైసిపి నుండి తెలుగుదేశంలో చేరిన నేతల పరిస్థితి దయనీయంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే ఆర్‌కె రోజా పేర్కొన్నారు. భూమా నాగిరెడ్డి అనతి కాలానికే గుండెపోటుకు గురి కాగా, జ్యోతుల నెహ్రూ వెన్నుపోటుకు గురయ్యారన్నారు.

06/30/2017 - 02:24

విజయవాడ, జూన్ 29: కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సిపిఎస్) కింద ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ వర్తింప చేస్తూ గురువారం ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. దీనిపై ఉద్యోగ జెఎసి తరపున చైర్మన్ పి.అశోక్‌బాబు, సెక్రటరీ జనరల్ ఐ.వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఆ మేరకు వారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Pages