S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/03/2017 - 03:54

భీమవరం, జూలై 2: దేశ రక్షణ కోసం డిసెంబర్ నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో జనజాగరణ ఉద్యమం చేపడుతున్నామని ఆర్‌ఎస్‌ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత సహప్రచార ప్రముఖ్ బయ్యా వాసు ప్రకటించారు. భారత్‌ను ఒకవైపు దాయాది దేశం పాకిస్తాన్, మరోవైపు చైనా ఆక్రమించుకుంటున్నాయన్నారు. ఇప్పటికే బ్రహ్మపుత్ర, సింధు నదుల ప్రవాహాన్ని ఆ దేశాలు ఆపుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.

07/03/2017 - 03:52

రాజమహేంద్రవరం, జూలై 2: అభివృద్ధికి అర్బనైజేషన్ (పట్టణీకరణ) చాలా కీలకమని, ఒక ప్రణాళికాబద్ధ అభివృద్ధి కోసమే అర్బనైజేషన్‌కు ఇటు రాష్ట్రం, అటు కేంద్రం కూడా ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. అర్బనైజేషన్ కోసం ప్రభుత్వం జిఒఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) ఏర్పాటుచేసిందన్నారు.

07/03/2017 - 03:52

మాడుగుల, జూలై 2: విశాఖ జిల్లా మాడుగుల మండలం జాలంపల్లి పంచాయతీ కొత్తపల్లి గ్రామంలోని పెద్దేరు జలాశయంలోని ఎడమ కాలువలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. విశాఖపట్నంలోని వరల్డ్ నెట్ సర్వీసు సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న పది మంది యువకులు విహార యాత్రకు ఆదివారం పెద్దేరు జలాశయానికి వచ్చారు.

07/03/2017 - 02:06

విజయవాడ, జూలై 2: వైసిపి నేత శిల్పా మోహన్‌రెడ్డిపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో నంద్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ నౌమాన్ ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిల్పా మోహన్‌రెడ్డి కేవలం స్వార్థం కోసమే పార్టీ వీడారని ఆరోపించారు.

07/03/2017 - 02:01

విజయవాడ, జూలై 2: రాష్ట్రంలో వైసిపి నాయకుల పరిస్థితి చూస్తుంటే దొంగే దొంగా.. దొంగా అన్నట్టుగా ఉందని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. విశాఖ భూదందాపై సిట్ విచారణ ప్రారంభం కావడంతో తల్లి, పిల్ల కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు.

07/03/2017 - 02:00

మదనపల్లె, జూలై 2: వన్యప్రాణులను హతమార్చి మాంసం విక్రయాలు చేపడుతుండగా సమాచారం అందుకున్న నిమ్మనపల్లె పోలీసులు, మదనపల్లె అటవీశాఖ అధికారులు ఆదివారం వేకువజామున దాడులు నిర్వహించారు. వన్యప్రాణులను చంపి వాటి మాంసాన్ని శుభ్రం చేస్తుండగా అటవీశాఖ అధికారులు, పోలీసుల రాకతో దుండగులు పరారయ్యారు.

07/03/2017 - 01:58

తిరుపతి, జూలై 2: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు రూ.2.50 కోట్లు విలువ చేసే స్వర్ణ భుజకీర్తులను విరాళంగా సమర్పించారు. ఆదివారం ఈ ఆభరణాలను ఆలయంలో అధికారులకు అందజేశారు. ఇందుకు సంబంధించి ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు మాట్లాడుతూ ఈ ఆభరణాలను ఆదివారం ఆస్థానం రోజున స్వామివారికి సమర్పిస్తామన్నారు.

07/03/2017 - 01:58

విశాఖపట్నం, జూలై 2: విజయవాడలో అదృశ్యమైన ముగ్గురు ఇంటర్ విద్యార్థినులు విశాఖలో ప్రత్యక్షమయ్యారు. విజయవాడ సూర్యారావు పేట బిషప్ అజరయ్య హాస్టల్‌కు చెందిన వీరు శనివారం కాలేజ్‌కు వెళ్లి తిరిగి చేరుకోలేదు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వీరు తిరిగి రాకపోవడంతో హాస్టల్ నిర్వాహకులు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

07/03/2017 - 02:09

విజయవాడ, జూలై 2: రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న అంబేద్కర్ స్మృతివనంలో ఏర్పాటు చేయనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నమూనాను సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ఆదివారం పరిశీలించారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ మండలం మంగులూరు గ్రామంలో తయారుచేస్తున్న అంబేద్కర్ విగ్రహ నమూనాని ఆయన పరిశీలించిన అనంతరం కళాకారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

07/02/2017 - 01:32

అమరావతి, జూలై 1: ప్రతిసారీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు సంధించే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈసారి రాజకీయ పరిణతి ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

Pages