S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/30/2017 - 00:59

విజయవాడ, జూన్ 29: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపులన్నీ శుక్రవారం రాత్రితో శాశ్వతంగా మూతబడనున్నాయి. రాష్ట్రంలో 4వేల 388 వైన్‌షాపులు, 747 బార్ అండ్ రెస్టారెంట్లు కొనసాగుతుండగా వాస్తవానికి వీటిలో 60 శాతం పైగా ప్రధాన రహదారుల వెంబడే ఉన్నాయి.

06/28/2017 - 03:47

పాడేరు, జూన్ 27: విశాఖ మన్యంలో ప్రాణాంతక వ్యాధులు ప్రబలి గిరిజనం మంచాన పడుతోంది. ఏజెన్సీలోని ఏ గ్రామంలో చూసినా వ్యాధులతో బాధపడుతున్నవారే. ఏటా వర్షాకాలంలో మన్యానికి జబ్బు చేయడం సర్వసాధారణం. ఈసారీ అదే పరిస్థితి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఏజెన్సీలో ఎపిడమిక్ సీజన్‌గా ప్రభుత్వం పరిగణిస్తుంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నప్పటికీ గిరిజనాన్ని రోగాలు వెంటాడుతూనే ఉన్నాయి.

06/28/2017 - 03:43

విజయవాడ, జూన్ 27: తూర్పుగోదావరి జిల్లా గిరిజన ప్రాంతంలో చోటు చేసుకున్న మరణాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తీరు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. 16 మంది మృత్యువాత పడిన తరువాత యంత్రాంగంలో కదలిక రావడం సరికాదంటూ వ్యాఖ్యానించారు. వెలగపూడి సచివాలయంలో ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు అందిస్తున్న వైద్య సేవలపై సిఎం మంగళవారం సమీక్ష నిర్వహించారు.

06/28/2017 - 03:41

విజయవాడ, జూన్ 27: ‘మీరు చెప్పింది ఓపికతో విన్నాను. సమస్యను నాకు వదిలివేయండి. నేను న్యాయం చేస్తాను’ అంటూ తనను కలిసిన పశ్చిమ గోదావరి వాసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.

06/28/2017 - 03:40

రాజమహేంద్రవరం, జూన్ 27: తూర్పు గోదావరి జిల్లాలో మలేరియా మహమ్మారి మృత్యుతాండవం కొనసాగుతూనేవుంది. ఇప్పటికే జిల్లాలోని వై.రామవరం మండలంలో 16మందిని బలితీసుకున్న ఈ మహమ్మారి, ప్రస్తుతం విలీన ప్రాంతం విఆర్‌పురం మండలంలో కరాళనృత్యం మొదలెట్టింది. వారం రోజుల వ్యవధిలో ఈ మండలంలో ముగ్గురు మృతిచెందగా, చింతూరు మండలంలో మరో వ్యక్తి మృతిచెందాడు. పలువురు వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.

06/28/2017 - 03:39

భీమవరం, జూన్ 27: రాష్ట్రంలోని దేవాదాయ ధర్మాదాయ సంస్థల్లో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులు ఆందోళన బాట పట్టనున్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం దేవాదాయ చట్టం సెక్షన్ 65ఎ ప్రకారం అర్చకులు, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకపోవడంతోపాటు అలవెన్సుల నిధి ఏర్పాటుచేయకపోవడంతో ఆందోళనబాట పడుతున్నారు. నిన్నటి వరకు అర్చకులు, ఉద్యోగులు వేర్వేరుగా ఉండేవారు.

06/28/2017 - 03:39

విశాఖపట్నం, జూన్ 27: విశాఖ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయంలో పర్సనల్ ఆఫీసర్ (పిఓ)గా పనిచేస్తున్న ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. అద్దె కార్లకు సంబంధించి బిల్లు పెట్టేందుకు రూ.10 వేలు లంచం డిమాండ్ చేసిన పిఒ మురళీమోహన్ దొరికిపోయారు. అప్పలరెడ్డి ఆర్టీసీలో 2 కార్లను అద్దె ప్రాతిపదికన నడుపుతున్నాడు.

06/28/2017 - 03:38

విశాఖపట్నం, జూన్ 27: ప్రజారోగ్య విభాగం ఇంజనీర్ ఇన్‌చీఫ్ పాండురంగారావు అరెస్టుతో పలువురు ఇంజనీర్లు హడలిపోతున్నారు. ముఖ్యంగా మహా విశాఖ నగరపాలక సంస్థతో ఆయనకున్న అనుబంధంతో ఇక్కడ పనిచేసిన, పనిచేసి వెళ్లిన ఇంజనీర్లలో కలవరం మొదలైంది. అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) చరిత్రలోనే అతిపెద్ద అవినీతి కేసుగా పాండురంగారావు వ్యవహారం ప్రచారం జరుగుతోంది.

06/28/2017 - 03:01

విజయవాడ, జూన్ 27: ఉత్తరాంధ్ర జిల్లా ల్లో పంటల ఉత్పాదకత భారీగా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సగటుతో పోలిస్తే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పంటల ఉత్పాదకత తక్కువగా ఉందని, గిరిజన ప్రాంతాల్లో మరీ తక్కువగా ఉందని...

06/28/2017 - 02:57

విజయవాడ, జూన్ 27: రానున్న రెండేళ్లలో రాష్ట్రంలోని వివిధ గిరిజన ప్రాంతాల్లో అవసరమైన కనీస వౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించేందుకు వీలుగా అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఐటిడిఏ ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు.

Pages