S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/01/2017 - 03:39

అమరావతి, ఫిబ్రవరి 28: ‘వైఎస్ మాదిరిగా ఇచ్చిన మాట నిలబెట్టుకోరు. నమ్మిన వారికి న్యాయం చేసే అలవాటు, ఆయన మాదిరిగా తాను కష్టాల్లో ఉన్నప్పుడు తనతో ఉన్న వారిని గుర్తుంచుకుని చెప్పకుండా, ఎదుటివారు అడగకుండానే మేలు చేసే పెద్ద మనసు లేదు.

03/01/2017 - 03:38

మంత్రాలయం, ఫిబ్రవరి 28: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో గురువైభవోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాఘవరాయుల పట్ట్భాషేకం మహోత్సవం వేడుకగా జరిగింది. రాఘవేంద్రుల మూల బృందావనానికి పీఠాధిపతి శ్రీ సుభుదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి బంగారు పాదుకలను బంగారు సింహాసనంపై ఉంచి పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు.

03/01/2017 - 03:36

పుట్టపర్తి, ఫిబ్రవరి 28: అనంతపురం జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితులపై ‘కరవు నిజం.. వలస నిజం’... అన్న శీర్షికన ఆంధ్రభూమి దినపత్రికలో మంగళవారం ప్రచురించిన వార్తా కథనానికి స్పందన లభించింది. గోరంట్ల మండలం డి.గంగంపల్లితండాలో ఉపాధి హామీ ఏపిడి రవికుమార్, అధికారుల బృందం మంగళవారం పర్యటించింది. గ్రామంలో సుమారు 52 మంది ఉపాధి కూలీలకు జాబ్‌కార్డు ఉంది.

03/01/2017 - 03:34

విజయవాడ, ఫిబ్రవరి 28: మరో ప్రతిష్టాత్మక ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. భారీ వర్షాలు, వరదల సమయంలో కొండవీటి వాగు పరిసర ప్రాంతాలు ముంపునకు గురవడాన్ని నిరోధించడం కోసం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడానికి సిద్ధమవుతోంది. కొండవీటి వాగు, కృష్ణానదిలో కలిసే ప్రదేశంలో ఈ ఎత్తిపోతల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

03/01/2017 - 03:33

విజయనగరం, ఫిబ్రవరి 28: వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమల్లోకి తెస్తామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. మంగళవారం ఇక్కడి పోలీసు శిక్షణ కళాశాలలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ముగింపు శిక్షణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

03/01/2017 - 02:51

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 28: కృష్ణాజిల్లా ముండ్లపాడు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృత్యువాత పడిన ప్రయాణికుల కుటుంబాలు తీరని శోకసముద్రంలో మునిగిపోయాయి. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారిని చూసి తమ కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. కొన్ని గంటల ముందు ఆనందంగా తమతో గడిపిన తమ వారిని ఇంత ధైన్యంగా చూడాల్సిన దుస్థితి ఏర్పడటాన్ని జీర్ణించుకోలేని బాధిత కుటుంబాలు తల బాదుకున్నారు.

03/01/2017 - 02:48

విజయవాడ, ఫిబ్రవరి 28: రాజధాని అమరావతిలో నిర్మించ తలపెట్టిన ఎయిమ్స్‌కు అవసరమైన అనుమతుల మంజూరులో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎయిమ్స్ నిర్మాణ పురోగతిపై వెలగపూడి సచివాలయంలో సిఎం మంగళవారం సమీక్ష నిర్వహించారు.

03/01/2017 - 02:43

పెనుగంచిప్రోలు/వత్సవాయి, ఫిబ్రవరి 28: అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగినట్లు డిజిపి సాంబశివరావు పేర్కొన్నారు. మంగళవారం కృష్ణాజిల్లా ముండ్లపాడు వద్ద బస్సు ప్రమాద సంఘటన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు.

03/01/2017 - 02:41

తాడిపత్రి, ఫిబ్రవరి 28: కృష్ణా జిల్లా పెనుగంజిపాడు మండలం ముళ్ళపాడు వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వోల్వో బస్సు డ్రైవర్ తునికంటి ఆదినారాయణ(51) అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందినవాడు. జెసి సోదరులకు చెందిన దివాకర్ ట్రావెల్స్‌లో దాదాపు 23 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. యాడికి గ్రామానికి చెందిన ఆదినారాయణకు గతంలో సొంత లారీ ఉండేది.

03/01/2017 - 02:38

విజయవాడ, ఫిబ్రవరి 28: ప్రాదేశిక సముద్ర జలాల్లో పన్ను వసూలు అధికారం రాష్ట్రాలకే ఉండాలంటూ జిఎస్టీ కౌన్సిల్ చైర్మన్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం లేఖ రాశారు. ఉదయపూర్‌లో జరిగిన జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 12 నాటికల్ మైళ్ల మేర ప్రాదేశిక జలాల్లో పన్ను విధింపు, వసూలు అధికారం రాష్ట్రాలకే ఉండాలనే అంశాన్ని తాను ప్రస్తావించానని గుర్తుచేశారు.

Pages