S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/27/2017 - 02:13

ఆచంట, ఫిబ్రవరి 26: దేశ సమైక్యత, సమగ్రత ప్రధాన లక్ష్యంగా ఎటువంటి అతుకులు, కుట్లు, అచ్చులు లేకుండా చేనేత మగ్గంపై పట్టుదారాలతో జాతీయ జెండాను తయారుచేస్తున్నాడు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామానికి చెందిన రుద్రాక్షల సత్యనారాయణ అనే యువకుడు. మరో వారం రోజుల్లో జెండా నేయడం పూర్తికానుంది. ఆచంట వేమవరం గ్రామం చేనేత కళాకారులకు పుట్టినిల్లు.

02/27/2017 - 02:11

విశాఖపట్నం, ఫిబ్రవరి 26: అలనాటి రాజ్యాలు సుభిక్షంగా ఉన్నాయంటే, అందుకు కారణం ఆనాటి రాజులు బ్రాహ్మణుల సూచనలు, సలహాలను పాటించేవారని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు.

02/27/2017 - 02:09

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 26: కేపిటలిజం, కమ్యూనిజం కంటే ఈ దేశానికి హిందూయిజమే ప్రత్యామ్నాయమని రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆంధ్ర ప్రాంత ప్రచారక్ భరత్‌కుమార్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సిజిటిఎం కళాశాల ప్రాంగణంలో ఆదివారం జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సాంఘిక్ సమావేశంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఈ దేశ వైభవ స్థితి సాధనే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమన్నారు.

02/26/2017 - 04:24

శ్రీ కాళహస్తి, ఫిబ్రవరి 25: వాయులింగేశ్వరుని రథోత్సవం భక్తుల్లో ఉత్సాహం నింపింది. ఆనందోత్సాహాల మధ్య రథోత్సవం వేడుకగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం బ్రహ్మరాత్రిని పురస్కరించుకొని బ్రహ్మరథంలో గంగాదేవి సమేతుడైన సోమస్కందమూర్తి ఆశీనుడయ్యాడు. మరోరథంలో జ్ఞాన ప్రసూనాంబ ఊరేగుతూ భక్తులకు కనువిందుచేసింది.

02/26/2017 - 04:21

తిరుపతి, ఫిబ్రవరి 25:టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నప్రసాదం ట్రస్టుకు 2016-17 ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరు నాటికి భక్తులు అందించిన విరాళాలు రూ.800 కోట్లకు చేరుకోనున్నాయని టిటిడి ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు వెల్లడించారు. స్థానిక టిటిడి పరిపాలనా భవనంలో శనివారం అన్నప్రసాదం ట్రస్టు కార్యకలాపాలపై సమీక్షించారు.

02/26/2017 - 04:19

విజయవాడ, ఫిబ్రవరి 25: మానసిక వ్యాధిగ్రస్తులకు అత్యున్నత స్థాయిలో ఆరోగ్య వైద్య సేవలందించడం మానసిక వైద్యుల బాధ్యతగా భావించాలని, నానాటికీ తగ్గుతున్న మానసిక వైద్యుల సంఖ్యను పెంచాల్సిన బాధ్యత ఉందని ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జి రోహిణి అభిప్రాయపడ్డారు.

02/26/2017 - 04:17

కాకినాడ, ఫిబ్రవరి 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస కరవుల కారణంగా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 301 మండలాలను కరవు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, అయితే ఈ సంఖ్య 400కు పైగానే ఉందన్నారు.

02/26/2017 - 04:15

విశాఖపట్నం, ఫిబ్రవరి 25: శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని సముద్రంలో పుణ్యస్నానానికి దిగిన యువకుడు కెరటాలకు బలయ్యాడు. విశాఖ ఆర్‌కె బీచ్‌లో శనివారం చోటుచేసుకున్న ఘటనలో ఆరిలోవ కాలనీకి చెందిన సాయిరాం (19) మృత్యువాత పడ్డాడు. సముద్ర స్నానానికి వెళ్లిన సాయిరాం ఆర్‌కె బీచ్‌లో కెరటాల ఉధృతి అధికంగా ఉండే ప్రాంతంలో గల్లంతయ్యాడు.

02/26/2017 - 04:14

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 25: రాష్ట్రంలో కరవు నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఏపిసిసి అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందించినట్లు తెలిపారు.

02/26/2017 - 04:13

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 25: సాగునీటి పథకాల్లో పునరావాస, పునర్నిర్మాణ పథకం బూటకంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదివాసీలకు అటవీ హక్కుల చట్టం, కొత్త పునరావాస చట్టం అక్కరకు రాకుండా పోయాయి. నిర్వాసితుల్లో పద్దెనిమిదేళ్లు నిండిన ఆదివాసీ యువతీ, యువకులకు తల్లిదండ్రులతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా పరిహారం అందించాలి. అయితే అది జరగలేదు.

Pages