S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/01/2017 - 02:35

అనంతపురం సిటీ, ఫిబ్రవరి 28: కృష్ణా జిల్లాలో ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురవడం దురదృష్టకరమని, ప్రమాదంలో మృతి చెందిన వారు, క్షతగాత్రులను ఆదుకుంటామని దివాకర్ ట్రావెల్స్ యజమానులు జెసి దివాకర్‌రెడ్డి, జెసి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

03/01/2017 - 02:34

విజయవాడ, ఫిబ్రవరి 28: రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా అజయ్ కల్లం మంగళవారం పదవీ బాధ్యతలు వెలగపూడి సచివాలయంలో స్వీకరించారు. ఇప్పటి వరకూ సిఎస్‌గా వ్యవహరించిన ఎస్‌పి టక్కర్‌కు రెండు సార్లు పదవి కాలం పొడిగింపు అనంతరం మంగళవారం ఆయన పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడును కల్లం మర్యాదపూర్వకంగా కలిశారు. సిఎం ఆయనకు అభినందనలు తెలిపారు.

చిత్రం..సిఎంను కలిసిన కొత్త సిఎస్ కల్లం

03/01/2017 - 02:31

విజయవాడ, ఫిబ్రవరి 28: ప్రపంచంలో ప్రస్తుతం నాలుగో పారిశ్రామిక విప్లవం నడుస్తోందని, నేటి యువత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి) సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

02/28/2017 - 05:05

విజయవాడ, ఫిబ్రవరి 27: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రం ఇవ్వాల్సిన రూ.16వేల కోట్ల నిధుల విషయమై రాష్ట్ర మంత్రిమండలిలో చర్చించి మరోసారి ప్రధానమంత్రికి లేఖ రాయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, కాపు, బ్రాహ్మణ, మైనార్టీ వర్గాలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి కూడా ఈసారి బడ్జెట్‌లో తగిన న్యాయం చేయాల్సి ఉందని సిఎం అభిప్రాయపడ్డారు.

02/28/2017 - 05:05

శ్రీ కాళహస్తి, ఫిబ్రవరి 27: శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వేకువజామున వేదమంత్రాలు, అగ్నిహోత్రం సాక్షిగా ఆది దంపతుల కల్యాణం కడు రమణీయంగా జరిగింది. ఆదివారం రాత్రి ఆలయం నుంచి గజ, సింహ వాహనాలపై బయలుదేరిన స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులు సోమవారం వేకువజాము వేళకు పెండ్లిమండపానికి చేరుకున్నాయి. ముందుగా స్వామివారి వాహనం పెండ్లిమండపానికి చేరుకున్న తరువాత పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి.

02/28/2017 - 05:03

చింతూరు, ఫిబ్రవరి 27: మందుపాతర అమర్చి విధ్వంసం సృష్టిద్దామని మావోయిస్టులు పన్నిన వ్యూహం బెడిసికొట్టి చివరికి వారి ప్రాణాలనే బలిగొన్న సంఘటన తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సోమవారం తెలంగాణా రాష్ట్రం బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. బంద్ రోజున విధ్వంసం సృష్టించి తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు వ్యూహం పన్నారు.

02/28/2017 - 05:01

విజయవాడ, ఫిబ్రవరి 27: గోదావరిలో ప్రవాహ వేగం తగ్గడంతో పోలవరం ప్రాజెక్టులో భాగమైన కాఫర్ డ్యామ్ నిర్మాణం పనులు చురుగ్గా కొనసాగేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. మళ్లీ వర్షాకాలం రాకముందే పనులు కొలిక్కి రావాలని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులపై సోమవారం ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు.

02/28/2017 - 04:42

విజయవాడ, ఫిబ్రవరి 27: రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా బడ్జెట్ సమావేశాలు వెలగపూడిలో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో మార్చి 6 నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ, శాసన మండలి భవనాలను మార్చి 2న లాంఛనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.

02/28/2017 - 04:38

విజయవాడ, ఫిబ్రవరి 27: ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వేషన్లను శాస్ర్తియంగా కొంత మేర పెంచాల్సిన అవసరం ఉందని జస్టిస్ మంజునాథ అభిష్రాయపడ్డారు. రాష్ట్రంలో రిజర్వేషన్లకు చాలా డిమాండ్ ఉందని, దీనిపై ఒక ప్రణాళిక ప్రకారం కమిషన్ పరిశీలించి తన నివేదికను ప్రభుత్వానికి అందిస్తుందని బిసి రిజర్వేషన్లపై ప్రభుత్వం నియమించిన కమిషన్ చైర్మన్ జస్టిస్ కెఎల్ మంజునాథ తెలిపారు.

02/28/2017 - 04:36

విజయవాడ, ఫిబ్రవరి 27: ఎండలు పెరుగుతున్నాయి.. మంచినీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలి.. మంచినీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చెరువులు నింపుకునేందుకు వెంటనే నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి నీరు-ప్రగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపాధి హామీ పని ప్రదేశాల వద్ద మంచినీటిని అందుబాటులో ఉంచాలన్నారు.

Pages