S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/04/2020 - 00:55

అమరావతి, మార్చి 3: హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్ణీత గడువులోపే పూర్తి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.

03/04/2020 - 00:52

అమరావతి, మార్చి 3: హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానకార్యదర్శితో అధికారులు బుధవారం సమావేశమై నోటిఫికేషన్‌పై చర్చించాలని సూచించారు. ‘స్పందన’ కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం సచివాలయం నుండి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

03/03/2020 - 05:23

గుంటూరు, మార్చి 2: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు విత్తనాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని, రైతులు క్యూ లైన్లలో నిలబడి లాఠీ దెబ్బలు తింటున్నారని, రైతుల కన్నీరు రాష్ట్రానికి అరిష్టమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

03/03/2020 - 05:20

గుంటూరు, మార్చి 2: భారతదేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన దిశ పోలీసుస్టేషన్ల నిర్వహణ, విధుల్లో కీలకపాత్ర పోషించాలని, మహిళల రక్షణే బాధ్యతగా ఇందుకోసం ఎంపికైన యువత భావించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు.

,
03/03/2020 - 05:19

గుంటూరు, మార్చి 2: మూడు రాజధానుల ప్రకటనను ఉపసంహరించుకుని, అమరావతినే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు, నిరసనలు సోమవారం నాటికి 76వ రోజుకు చేరగా ఇప్పటికే పలు రూపాల్లో, వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తూ వచ్చిన రైతులు ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతం 29 గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.

03/03/2020 - 04:42

అమరావతి, మార్చి 2: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల పదోన్నతులు, సీనియర్ టైం స్కేల్‌కు సంబంధించి స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చైర్మన్‌గా, జీఏడీ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శితో పాటు సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సభ్యులుగా స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు కానుంది.

03/03/2020 - 00:21

విజయవాడ(సిటీ): గ్రామ, వార్డు వలంటీర్లు తమకు అప్పగించిన బాధ్యతను అంకిత భావంతో సైనికుల్లా పూర్తి చేశారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశంసిం చారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం వారిని హే ళన చేసే విధంగా మాట్లాడారం టూ సోమవారం ట్విట్టర్‌లో ఆరోపించారు. గ్రామ వలంటీర్లెంత.. వాళ్ల జీతాలెంత..

03/03/2020 - 05:28

గుంతకల్లు: హంద్రీనీవాలో ప్రవహిస్తున్న కృష్ణాజలాలను కర్నూలు జిల్లా ఆలూరు బ్రాంచ్‌కెనాల్‌కు మళ్లించాలని డిమాండ్ చేస్తూ మంత్రి గుమ్మనూర్ జయరాం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా రైతులు హంద్రీనీవా కాలువకు సోమవారం గండి కొట్టే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, హంద్రీనీవా సైట్ ఇంజినీర్లు అక్కడికి చేరుకున్నారు. మంత్రి, రైతులకు నచ్చజేప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది.

03/03/2020 - 00:17

గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో కోర్టు తీర్పునకు లోబడే ముందుకు వెళతామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేయాలనే 59 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

03/03/2020 - 00:15

అమరావతి, మార్చి 2: మిషన్ బిల్డ్ ఏపీలో భాగంగా భూముల గరిష్ఠ వినియోగంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ఈ భూముల్లో చేపట్టాల్సిన

Pages